అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు
Published Sat, Oct 8 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
నార్కట్‌పల్లి : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై స్థాయికి మించి మాట్లాడడం అధికార దాహమేనన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టు కోసం అప్‌సెండింగ్ సమావేశానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు కాని ఆయనకు ప్రాజెక్టుల గురించి ఏమి తెలియదన్నారు. ప్రాజెక్టుల గురించి తెలియని ఆయనకు మూసీ ప్రాజెక్టు నిండిన వెంటనే గేట్లు తెరిచి నీటిని వృధా చేశారని అన్నారు. ప్రాజెక్టులపై అవగాహన ఉంటే నీటిని ఎలా వృథా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో గెలిచిన వేముల వీరేశం కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారు తప్ప ప్రజల సమస్యలు, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సర్పంచ్‌లు కొండూరు శంకర్, బొక్క భూపాల్‌రెడ్డి, చెర్వుగట్టు దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు పాశం శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బలి మల్లేషం, వల్లపు మల్లేషం, వెంకటచారి, లింగస్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement