అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలి
అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలి
Published Tue, Oct 4 2016 10:38 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ రూరల్ : సీఎం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దుర్గామాత ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుతున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం పానగల్లు శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం వేముల రాజీవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంబించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరత్నంరాజు, అబ్బగోని రమేష్‌గౌడ్, ప్రదిప్‌నాయక్, సత్తయ్యగౌడ్, బకరం వెంకన్న, అరుణాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీను, నకిరేకల్ ఇన్‌చార్జి సైదులు, శ్రవణ్, తదితరులున్నారు.
Advertisement
Advertisement