
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పేలవ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ అగా సల్మాన్(18)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్.. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే టీ20 సిరీస్‌కు మాత్రం కీలక ఆటగాళ్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాంలను టీ20 జట్టు నుంచి పాకిస్తాన్ సెలక్టర్లు తప్పించారు. మహ్మద్ రిజ్వాన్ స్ధానంలో సల్మాన్ అలీ అగాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ వన్డేల్లో మాత్రం రిజ్వాన్‌ను కెప్టెన్‌గా పీసీబీ కొనసాగించింది.
తుది జట్లు
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ
పాకిస్తాన్: హారీస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఖుష్దిల్ షా, జహందాద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్
చదవండి: WPL 2025: ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment