ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
Published Thu, Aug 25 2016 9:57 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
నకిరేకల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, పండుగలు, గుళ్ల నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. నకిరేకల్‌లోని సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్న నదీజాలాల ఒప్పందాన్ని ఇంతగా ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల చేసి చెరువులు, కుంటలను నింపితే కొంతమేర సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. హైదరాబాద్ నగరం భారీగా విస్తరించినందున సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అడవిదేవులపల్లి, మద్దిరాల, నాగిరెడ్డిపల్లి, నాగార్జునసాగర్, అమ్మనబోలు గ్రామాలను మండల కేంద్రాలుగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో నంద్యాల నర్సింహారెడ్డి, అనంతరామ శర్మ, తుమ్మల వీరారెడ్డి, తిరందాస్ గోపి, మామిడి సర్వయ్య, ఎండీ.జహంగీర్, కందాల ప్రమీల, బోళ్ల నర్సింహారెడ్డి, మన్ను లక్ష్మి, ఎం.రాములు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, మర్రి వెంకటయ్య, లక్కపాక రాజు, తాజేశ్వర్ పాల్గొన్నారు.
Advertisement