
కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(పాత చిత్రం)
నల్గొండ జిల్లా : కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ప్రజల్లో తిరుగుతున్నారంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే 2019 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్య యాభై వేల మెజార్టీ కాదు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని జోస్యం చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు. పిళ్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు నా సొంతంగా రూ.4 కోట్లు ఖర్చు పెట్టి కాలువ పనులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూశానని తెలిపారు. నల్లొంగ జిల్లా అంటేనే కేసీఆర్‌కు భయమని, అందులోనూ నకిరేకల్ నియోజకవర్గం అంటే ఇంకా భయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment