నకిరేకల్ శివారులోని బాబాసాహెడ్‌గూడెంకు చెందిన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.
నకిరేకల్ : నకిరేకల్ శివారులోని బాబాసాహెడ్‌గూడెంకు చెందిన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. బాబాసాహెబ్‌గూడెం గ్రామానికి చెందిన గద్దపాటి అఖిల్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అఖిల్ తన ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకొని వెళ్లి నకిరేకల్ శివారులో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కాలినగాయాలతో కొట్టుమిట్టాడుతున్న అఖిల్‌ను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న ల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని అఖిల్ తన వాంగ్మూలం ఇచ్చినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.