to commit suicide
-
స్క్రిప్ట్ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాయదుర్గం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీకి మైండ్‌బ్లాక్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ జనరంజక పాలనతో దూసుకుపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ పార్టీని బతికించుకునేందుకు నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇంటి స్థల సమస్యను సాకుగా చూపి వైఎస్సార్సీపీ నాయకులకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యకర్త ద్వారా ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరలేపారు. గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జయరామిరెడ్డి తనకు మంజూరు చేసిన ఇంటి పట్టాకు సంబంధించి అధికారులు స్థలం చూపలేదంటూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేసిన ఆత్మహత్యాయత్నం డ్రామా అని తేలింది. నీటితో నింపిన పురుగుమందు డబ్బాను వెంట తెచ్చుకుని గుటగుటా తాగేయగా.. భార్య పల్లవి సెల్ఫోన్లో వీడియో తీస్తూ డ్రామాను రక్తి కట్టించింది. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సమస్యకు కారణం వైఎస్సార్సీపీ నాయకులే అంటూ పేర్లు చెప్పడానికి ప్రాధాన్యత ఇచి్చంది. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కనీసం వెంట కూడా పోకుండా కార్యాలయం ముందే కూర్చోవడం, కంటిలో నీరు కూడా రాకపోవడం అక్కడున్న వారు చూసి ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చర్చించుకోవడం కనిపించింది. టీడీపీ నాయకుడి అత్యుత్సాహం టీడీపీ మండల నాయకుడు రాఘవరెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపినట్లు తెలిసింది. టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాన్ని వైఎస్సార్సీపీపై నెట్టాలని కుయుక్తులు పన్నాడు. ఆ కుట్రల్లో భాగంగా సంఘటన జరగడానికి గంట ముందే తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్ చేసి ‘గుమ్మఘట్ట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లండి, జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ సమాచారమందించాడు. అంతటితో ఆగ కుండా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు చెప్పాలం టే రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు సూచించడం అక్కడున్నవారందరూ గుర్తించారు. అడ్డు తగులుతున్న మాజీ మంత్రి బీటీపీకి చెందిన జయరామిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అనుచరుడు. టీడీపీ కార్యకర్తకు స్థలం ఇప్పించడంలో కూడా మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డు తగులుతున్నాడని 2018 ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల పర్యటనలో భాగంగా ఆరోపణలు గుప్పించాడు. చివరకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు 2018 జూన్‌లో జయరామిరెడ్డికి పట్టా ఇప్పించారు. అయితే ఆ పట్టాలో చెక్కుబందీ సరిగా పొందుపరచలేదు. స్థలం చూపాలంటూ జయరామిరెడ్డి పలుమార్లు ప్రయతి్నస్తే అప్పటి మంత్రి కాలవ, జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు అడ్డుపడ్డారు. అప్పటి నుంచి జయరామిరెడ్డి సమస్య సమస్యగానే మిగిలిపోయింది. -
రౌడీషీట్ ఓపెన్ చేస్తా
నాల్గో పట్టణ సీఐ బెదిరింపులు యువకుడి ఆత్మహత్యాయత్నం అనంతపురం మెడికల్ : ‘రేయ్ కాలనీలో ఉండాలనుకున్నావా? లేదా? నేను చెప్పినట్లు వింటే బాగుంటావ్. లేదంటే నీ ఇష్టం. బ్యాచ్‌లు మెయింటేన్ చేస్తున్నావంట. రౌడీషీట్ ఓపెన్ చేస్తా’ అంటూ నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ శివశంకర్ తనను బెదిరించారని చంద్రబాబు కొట్టాలకు చెందిన అనిల్ ఆరోపించాడు. పోలీసుల వేధింపులు తాళలేని అతడు సోమవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అనంతపురం మండలం చంద్రబాబు కొట్టాలకు చెందిన అనిల్, అశ్విని భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. అదే కాలనీలో అనిల్ ఇటీవల కేబుల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. క్రమంగా డిష్ కనెక్షన్లు పెరగడంతో మరో కేబుల్‌కు చెందిన వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పలుమార్లు అనిల్ నిర్వహిస్తున్న కేబుల్ వైర్లను కట్ చేశారు. డిష్ నిర్వహించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినా అతడు వినకపోవడంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సహకారంతో నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శివశంకర్ తరచూ అనిల్‌ను స్టేషన్‌కు పిలిపించసాగారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్‌కు రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇదే క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్నీ వదులుకుంటే బాగుంటుందని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ వేయొద్దని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ సోమవారం కాలనీలోనే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన స్నేహితులు వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే పరామర్శ : విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపారు. పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తుగా మారారని, అతడికేమైనా జరిగితే కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నేతలు యోగేశ్వరరెడ్డి, బండి పరుశురాం, మారుతినాయుడు తదితరులు ఉన్నారు. స్టేషన్ ముందు ధర్నా చేస్తాం : పోలీసుల వైఖరిపై అనిల్ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పక్షాల నిలవాల్సిన ఖాకీలే ఇలా బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. రెండు వారాల నుంచి రోజూ స్టేషన్‌కు రమ్మంటున్నారని, వెళితే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఒకానొక దశలో స్టేషన్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తామని వారు చెప్పగా గురునాథరెడ్డి వారిని సముదాయించారు. -
పోలీసు స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం
కొండాపురం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోలీసు స్టేషన్లోనే ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న తండ్రి, బంధువు స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మల్కిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డికి నాలుగు నెలల క్రితం మధుసూదనరెడ్డి అనే వ్యక్తి కడపకు చెందిన మధుభూషన్రెడ్డి కారును రూ.2 లక్షల 66వేలకు ఇప్పించాడు. కారు కొనుగోలు చేసిన సమయంలో కిరణ్కుమార్రెడి్డ కేవలం రూ.60 వేలు మాత్రమే చెల్లించాడు. మిగిలిన సొమ్ముకు మధుసూదన్‌రెడ్డి పూచీకత్తు రాయించాడు. అయితే నెలరోజుల పాటు బాగా నడిచిన కారు కొద్దిరోజుల్లోనే ఇంజన్ సీజ్ అయింది. అయితే మధుసూదన్‌రెడ్డి మాత్రం కారు కొనుగోలు సమయంలో తాను రూ.2 లక్షల 6వేలు పూచీకత్తు పడ్డానని ఆ డబ్బులను ఇప్పించాలంటూ మూడు నెలల క్రితం పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టించాడు. అయితే మల్కిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తాను ఎవరికీ డబ్బులు బాకీ లేనని పూర్తి డబ్బులు చెల్లించడంతోనే తనపేరుమీద కారు రిజిస్రే్టషన్ చేయించారని, అనవసరంగా తనను వేధించ వద్దంటూ పోలీసుతో గట్టిగా వాదించారు. కాగా దీనికి సంబంధించి ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. రెండురోజుల క్రితం తాళ్లప్రొద్దుటూరుకు రావడంతో సోమవారం మధుసూదన్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి ఎస్ఐ కృష్ణయ్య కిరణ్‌కుమార్‌రెడ్డిని పట్టుకుని రావాలంటూ కిందిస్థాయి పోలీసులను ఆదేశించారు. ఇంటి వద్ద ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు తాళ్లప్రొద్దుటూరు స్టేషన్‌కు తీసుకొని వచ్చారు. ఎస్ఐ రూ.2 లక్షల6 వేలు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తీసుకొని రావడంతో పాటు పరుషంగా దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు తన వెంట తెచ్చుకున్న వాస్మోల్ తాగి పోలీసు స్టేషన్లోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం గమనించిన పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు ఎలాంటి విషయం తెలియపరచకపోవడంతో తన కుమారుడిని పోలీసులు ఏం చేశారంటూ తండ్రి వెంకట్రామిరెడ్డి, బంధువు శ్రీకాంత్‌రెడ్డి కూడా పోలీసు స్టేషన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై కొండాపురం సీఐ రవిబాబు విలేకరులతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డిపై 420 కేసు నమోదై ఉండటంతో అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషన్‌కు పిలిపించామన్నారు. అతను తమకు తెలియకుండా ఆత్మహత్యకు యత్నించాడని తెలిపారు. -
పెద్దలు ఒప్పుకోలేదు..చనిపోదామనుకున్నారు
జనగామ: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవటం లేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దెంకి గ్రామానికి చెందిన మధు(24), వరంగల్ క్రిస్టియన్ కాలేజీకి చెందిన మౌనిక(23) హైదరాబాద్‌లోని యశోద హాస్పెటల్లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ శుక్రవారం ఎల్లమ్మగుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పురుగుమందుతాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
తండ్రిపై కుమారుడి హత్యాయత్నం..?
కడిపికొండలో కలకలం కాజీపేట అర్బన్ : కుమారుడు ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతున్న ఓ తండ్రి..ఈ విషయం తెలిసిన తనయుడు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనలో ఇరువురు ప్రాణాపాయస్థితిలోకి చేరుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలోని 35 డివిజన్ కడిపికొండలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కడిపికొండ గ్రామానికి చెందిన గంగుల దేవేందర్‌రెడ్డి కాజీపేట రైల్వే స్టేషన్లో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఆరోగ్యం సరిగాలేకపోవడంతో తన కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డికి వీఆర్ఎస్లో ఉద్యోగాన్ని ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా భరత్‌కుమార్‌రెడ్డికి నాలుగునెలల క్రితం వరికోల్ గ్రామానికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది.పెళ్లి అయినప్పటి నుంచి ఖాళీగా ఉంటున్న భరత్‌కుమార్‌రెడ్డితో జ్యోతికి గొడవలు జరిగి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భరత్‌కుమార్‌రెడ్డి తండ్రికి కూల్‌డ్రింక్ ఇవ్వడంతో అది తాగిన దేవేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం పాలప్యాకెట్ల విక్రయదారుడికి వెల్లడించారు. దీంతో సదరు విక్రయదారుడు 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం సుబేదారిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.ఈ విషయాన్ని తెలుసుకున్న తనయుడు భరత్‌కుమార్‌రెడ్డి సైతం పురుగుల మందు తాగి ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు స్థానికులు వెల్లడించారు. కాగా, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువరైతు మృతి
తాడిపత్రి రూరల్ : అప్పుల బాధ భరించలేక డిసెంబర్ 29న పురుగుమందు తాగి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామానికి చెందిన రైతు షౌకత్(30) సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీహర్ష తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య అస్మత్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
రొద్దం : మండలంలోని కంచిసముద్రంలో ఓ వివాహిత(25) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అటు భర్త, ఇటు ప్రియుడి చేష్టలతో విసుగెత్తిన ఆమె జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహులు తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేశారు. -
యువజంట ఆత్మహత్యాయత్నం
కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు వైద్యం కోసం తరలింపు ఇల్లెందు : రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ యువజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇల్లెందులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని చెరువు కట్టకు చెందిన ఎస్కె.ముజీబ్, నంబర్–2 బస్తీకి చెందిన ఎల్లబోయిన సాహితీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల కిందట ఇరువురు తమ కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా దూరంగా వెళ్లిపోయి కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సాహితీ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఇల్లెందు పోలీసులు ఇరువురిను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే తమను విడదీస్తారనే భయంతో ఓ చిన్న డబ్బాలో కొన్ని టైఫాయిడ్ టాబ్లెట్లు వేసుకుని వచ్చి, ఓ గ్లాసు నీటిలో కలిపి సగం వరకు సేవించారు. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత స్టేషన్ బయటకు వచ్చిన ఇరువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరి తర్వాత ఒకరు పడిపోయిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. ఇల్లెందు వైధ్యాధికారి హన్మేష్‌ను వివరాలు అడుగగా ప్రాథమిక వైద్యం అందించామన్నారు. టాబ్లెట్లు మింగారో.. మందు సేవించారో తెలపడం లేదని, తాగిన మందును బట్టి వైద్యం అందిస్తామని వివరించారు. ఈ విషయమై సీఐ ఏ.నరేందర్‌ను వివరణ కోరగా కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నైట్‌వాచ్‌మన్‌గా నియమించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పాఠశాలలో రాజకీయ జోక్యంతో ఘటన రేగొండ : గత కొంతకాలంగా మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో తాత్కాలిక అటెండర్‌గా పనిచేసిన తనను నైట్ వాచ్‌మన్‌గా నియమించలేదని ఓ వ్యక్తి మనోవేదనకు గురై పురుగుల మందు తాగిన సంఘటన గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత ఐలయ్య గత 15 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో తాత్కాలిక అటెండర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో తనకు సరైన వేతనం అందించడం లేదని గత సంవత్సరం నుంచి విధులకు దూంగా ఉంటున్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.3500 చొప్పున వేతనం ఇస్తూ ఏడాదిలో 10 నెలలు పని చేసేలా ఒక వాచ్‌మన్‌ను నియమించుకోవాలని హెచ్ఎంలను ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా ఐలయ్య జగ్గయ్యపేట గ్రామంలోని ఎస్ఎంసీ కమిటీని తననే నైట్‌వాచ్‌మన్‌గా నియమించాలని కోరాడు. అయితే గురువారం ఎస్ఎంసీ కమిటీ మాత్రం ఐలయ్యకు బదుల ఎస్ఎంసీ కమిటీ సభ్యురాలు సంధ్య భర్త పున్నం స్వామిని నియమిస్తూ తీర్మానం చేశారు. దీంతో మనోవేదనకు గురైన అయిలయ్య పాఠశాల ఆవరణకు వచ్చి పురుగుల మందు తాగుతుండగా గమనించిన గ్రామస్తులు అతడి చేతిలోని డబ్బాను లాక్కొని పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి 108లో తరలించారు. రాజకీయ జోక్యంతోనే ఐలయ్య ఆత్మహత్యాయత్నం .. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇటీవల ఎస్ఎంసీ చైర్మన్ పదవిని దక్కించుకునేందకు తీవ్రంగా పోటీపడ్డారు. చివరికి టీఆర్ఎస్ బలపర్చిన వ్యక్తి గుంటుకు రమేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. గతంలో పనిచేసిన ఐలయ్యకు నైట్ వాచ్‌మన్‌గా ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. కానీ వారి మాట నెగ్గొద్దనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు మరొకరిని ఎంపిక చేశారు. ఎస్ఎంసీ తీర్మానం మేరకే నియమించాం ప్రభుత్వం ఇచ్చిన నామ్స్(నిబంధనల) ప్రకారమే నైట్వాచ్మన్ను నియమించినట్లు జగ్గయ్యపేట హైస్కూల్ హెడ్మాస్టర్ కె.రమేష్‌బాబు తెలిపారు. నైట్‌వాచ్‌మన్ నియామంకంలో తాను ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోలేదన్నారు. – కె.రమేష్‌బాబు, హెచ్ఎం -
ఈ జీవితం వద్దనుకుని..
అన్ని జన్మల్లోకెల్లా మానవజన్మ ఎంతో గొప్పదంటారు. ఈ విషయాన్ని చాలా మంది మరచిపోతున్నారు. చిన్నచిన్న విషయాలకే తల్లడిల్లిపోతూ బలవంతంగా తనువు చాలిస్తున్నారు. అయిన వారిని అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. వారి నిర్ణయం వెనక కారణాలు ఏమైనా.. కష్టాలు వచ్చినోళ్లందరూ చస్తూ పోతుంటే బతకడానికి మనిషి అనే వాడు ఉండడు కదా? గుత్తి : ఆర్ఎస్లోని దుర్గమ్మ వీధిలో నివాసముంటున్న వివాహిత పార్వతి (35) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పార్వతి భర్తకు దూరంగా నివసిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో తరచూ కలహాలు చోటు చేసుకునేవి. భర్త దూరం కావడం, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో యువకుడు.. వజ్రకరూరు: మండలంలోని పీసీ.పెద్దప్యాపిలి గ్రామానికి చెందిన ప్రకాష్ (18) అనే యువకుడు కుటుంబ కలహాలతో విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపారు. ఆదివారం ఉద యం ఇంట్లో విషపు గుళికలు మింగడంతో ప్రకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు వెంటనే గమనించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో బంధువులు అనంతపురం ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఆయన తెలిపారు. వివాహిత ఆత్మహత్యాయత్నం సోమందేపల్లి: సోమందేపల్లి ఎస్సీ కాలనీకు చెందిన పుష్పలత(30) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ తెలిపారు. వెంటనే ఆమెను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. రెక్కమానులో విద్యార్థి.. కదిరి టౌన్ : హాస్టల్‌కు వెళ్లి బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపంతో పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రెక్కమానులో చోటు చేసుకుంది. వివరాలు.. నంబులపూలకుంట మండలం రెక్కమానుకు చెందిన రామకృష్ణ కుమారుడు హరి 9వ తరగతి చదువుతున్నాడు. ఇదివరకు స్వగ్రామంలోనే ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునేవాడు. అయితే తన తండ్రి ఇదే మండలం పూలకుంటలో ఉన్న సంక్షేమ హాస్టల్లో హరిని చేర్పించాడు. దీంతో తనకు ఇష్టం లేకున్నా హాస్టల్లో చేర్పిస్తున్నారనే కారణంతో మనస్థాపం చెందిన హరి ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఒత్తిడితో చిత్తు
► పని భారంతో రోగాలబారిన ► పడుతున్న పోలీసులు ► సెలవుల్లేక సతమతం ► తాజాగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పలమనేరు: తీవ్రమైన పని ఒత్తిడితో పోలీసు విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది చిత్తవుతున్నారు. బాస్‌లకు మస్కా కొట్టే సిబ్బంది మాత్రం జల్సాగా ఉంటుంటే చిత్తశుద్ధితో పనిచేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తగినన్ని సెలవులు లేకపోవడం, అత్యవసర విధుల కు హాజరవుతుండడంతో సమయానికి తిండిలేక, తగిన విశ్రాంతి లేక రోగాల బారినపడుతున్నారు. ఇక మహిళా కానిస్టేబుళ్ల పరిస్థితి మరో ఘోరంగా తయారైంది. ఉదయం రెండు గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో ఇంట్లో వంట కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన టెన్షన్, ఉన్నతాధికారుల టార్గెట్లు, వేధింపులతో కొందరు సిబ్బంది ఉద్యోగం పైనే విరక్తి చెందుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోలేక, తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుప్పం పోలీస్ స్టేషన్‌కు చెందిన రెడ్డెప్ప అనే కానిస్టేబుల్ సోమవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అమలుకు నోచుకోని వీక్లీ ఆఫ్ గతంలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేలా పోలీస్ ఉన్నతాధికారులు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పోలీస్ మ్యానువల్ ప్రకారం సంవత్సరానికి 15 లీవులు మాత్రమే వీరికి ఉన్నాయి. ఇక ఆప్షనల్ హాలిడేస్‌గా పదింటిని వాడుకునే వెసులుబాటుంది. ఒకవేళ మెడికల్ లీవ్ పెడితే జీతంలో కోత విధిస్తారు. ఈఎల్ (ఎర్నింగ్ లీవ్) పెట్టినా డబ్బులు చేతికందని పరిస్థితి. దానికితోడు సిబ్బంది పరిస్థితిని బట్టే సెలవులిచ్చే అవకాశం ఉంది. తమకు కావాల్సిన వారికి మాత్రం సెలవులు ఇవ్వడం.. మిగిలిన వారికి కుదరదని చెప్పడం పోలీస్ శాఖలో షరా మామూలేనని ఓ సీనియర్ హెడ్‌కానిస్టేబుల్ ఆవేదన. 40 శాతం మందికి జబ్బులే మొత్తం పోలీసులు 40 శాతం మంది సిబ్బంది షుగర్, బీపీ, అల్సర్‌తో బాధపడుతున్నారు. వీరికి సకాలంలో ఆహారం లేకపోవడం, తగిన విశ్రాంతి లేకపోవడం, మానసిక ఒత్తిడి జబ్బులకు కారణమవుతోంది. కనీసం పోలీస్ స్టేషన్ల లో విశ్రాంతి తీసుకోవడానికి కూడా తగిన సదుపాయాలు లేవు. దీంతో స్టేషన్‌లోని చెక్కబల్లలు, వరండాల్లో పడుకోవాల్సిందే. ఇలాం టి ఇబ్బందుల మధ్య అత్యవసర విధులను ఎలా నిర్వహించాలో అర్థం గాని పరిస్థితి. ఎన్నాళ్ల నుంచో డిమాండ్లున్నాయి పోలీస్ శాఖలో పనిచేసే వారికి వారాంతపు సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు భార్య కాన్పు సమయంలో భర్తకు సెలవు ఇవ్వడం, కోరుకున్నపుడు సెలవులు, ఎనిమిది గంటల డ్యూటీ, పోలీస్ స్టేషన్లో తగిన సదుపాయాలతో విశ్రాంతి తదితర డిమాండ్లను వీరు కోరుతూనే ఉన్నారు. కానీ వీరి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోకుండానే పోతున్నాయి. సమాజాన్ని రక్షించే పోలీసులకు తగిన సౌకర్యాలు, మానసిక ప్రశాంతత లేక ఒత్తిడితోనే విధులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. -
భర్త రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడని..
పురుగుల మందు తాగిన వివాహిత మదనపల్లె క్రైం: పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే భర్త రెండో పెళ్లికి సిద్ధ పడడంతో మనస్తాపం చెందిన నవ వధువు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీకి చెందిన సిద్దగాళ్ల వెంకటేష్‌కు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రాధమ్మ(19)తో పెళ్లి జరిగింది. వీరి కాపురం మూడు నెలలు సజావుగా సాగింది. తర్వాత ఏమి జరిగిందో ఏమో కాని వెంకటేష్ రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెలో చంద్రకళ(20) అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది విషపు గులికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ చేసుకోయలేక పోయామని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె క్రైం : ఇంట్లో పండుగ చేసుకోలేకపోయామనే బాధతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని నీరుగటువారిపల్లెలో జరిగింది. టూటౌన్ పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బండి రామచంద్ర కుమారుడు జగన్నాథం (40) మదనపల్లెలోని అయోధ్యనగర్‌కు 20 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. కూలి మగ్గాలు నేస్తూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉగాది రోజు ఇంట్లో పండుగ చేయడానికి అతని వద్ద డబ్బులు లేవు. భార్యతో కూడా గొడవపడ్డాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. ద్విచక్రవాహనంలోని పెట్రో ల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన భార్య పద్మజ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. బాధితుడిని హుటాహుటిన 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి 108లో తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వేములవాడ రూరల్: పెళ్లి పేరుతో ఒక యువకుడు వేధించడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం బాల్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన నాగుల శ్రీకర్, కరీంనగర్ మండలం ముగ్దూంపూర్ కు చెందిన గుంటి అఖిల కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీకర్ బెదిరిస్తున్నాడు. తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఆమెను మంగళవారం తన ద్విచక్రవాహనంపై తీసుకుని వేములవాడ మండలం మల్లారంలోగల అతడి అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో అఖిల కిడ్నాప్ అయినట్లు కేసు నమోదైంది. శ్రీకర్‌పై అనుమానం ఉందంటూ అమ్మాయి తండ్రి గుంట అంజయ్య చెప్పాడు. బుధవారం శ్రీకర్, అఖిల ద్విచక్రవాహనంపై కామారెడ్డి వె ళ్తూ రామాయంపేట వద్ద ఆగారు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగడానికి శ్రీకర్ యత్నించారు. ఈక్రమంలో మందుడబ్బాను లాక్కొని అఖిల తాగేసింది. దీంతో ఆమెను వేములవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న ఆమెను తీసుకెళ్లారు. ఎల్ఎండీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డిప్యూటీ తహశీల్దారు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు (అగ్రికల్చర్): చిత్తూరు కలెక్టరేట్లో ఎలక్షన్ విభాగంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న సుధాకర్ బుధవారం విధి నిర్వహణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డిప్యూటీ తహశీల్దారు సుధాకర్ ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. కొంత సమయానికే తాను కూర్చున్న సీటు పైనుంచి సృ్పహ కోల్పోయి కింద పడిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆయన అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగడంతో ఆయన స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్వో విజయ్‌చందర్‌ను వివరణ అడగ్గా కుటుంబ కలహాల కారణంగా సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. -
విద్యుత్‌శాఖలో కలకలం
►నర్సీపట్నం సబ్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం ►విశాఖ కేజీహెచ్‌కు తరలింపు ►అధికారుల వేధింపుల వల్లేనని ఎస్ఎంఎస్లు ►పోలీస్ కేసు నమోదు, దర్యాప్తు నర్సీపట్నం: ఉన్నతాధికారుల వేధింపులకు తట్టుకోలేకపోతున్నాను..మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. నర్సీపట్నం ప్రశాంతనగర్లోని తన స్థలం ఆక్రమణ విషయంలో ఆర్డీవో సూర్యారావు కూడా అన్యాయం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇదీ విద్యుత్‌శాఖ సబ్ ఇంజినీర్ జి.శివప్రసాద్ బుధవారం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పంపిన ఎస్ఎంఎస్. ఆ వెంటనే ఇంటిలో ఉన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన విద్యుత్‌శాఖలో కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణకు చెందిన శివప్రసాద్ నర్సీపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. నర్సీపట్నంకు చెందిన అపర్ణను వివాహం చేసుకుని పెదబొడ్డేపల్లిలో ఉంటున్నాడు. పదేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారుల పనిభారం మోపుతున్నారని, వారి వేధింపులను తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సన్నిహితులు, కుటుంబసభ్యులకు ఉదయం 10 గంటల సమయంలో ఎస్ఎంఎస్లు పంపా డు. ట్రాన్స్‌కో డీఈఈ, ఏడీఈ, ఏఈలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడిని కావడంతో ప్రాంతీయ తత్వంతో పాటు దళితుడను అయినందున వివక్ష చూపుతున్నారని ఎస్ఎంఎస్ల్లో పేర్కొన్నాడు. 11 గంటల సమయంలో నిద్ర మాత్రలు మిం గాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతనిని కుటుంబ సభ్యు లు 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. బాధితుని భార్య అపర్ణ విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ ఇంటికి వచ్చి రోజూ బాధపడే వాడని తెలిపింది. ఉద్యోగం చేయాలనిపించటం లేదని చెబుతుండే వారన్నారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన డీఈ, ఏడీఈ, ఏఈలపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె కంటతడి పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు నెలలుగా గైర్హాజరు నెల రోజులు సెలవు పెట్టిన శివప్రసాద్ నాలుగు నెలలుగా విధులకు హాజరుకాలేదు. సెలవు ముగిశాక కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో అతనిని ఎస్ఇ కార్యాలయానికి సరెండర్ చేశాం. కావాలని తప్పుడు అరోపణలు చేస్తున్నాడు. ఏనాడూ అతనిపై వేధింపులకు పాల్పడలేదు. రమేష్, విద్యుత్‌శాఖ డీఈ ఆయన ఎవరో తెలియదు వివిధ సమస్యలతో కోర్టుకు అనేక మంది వస్తుంటారు. న్యాయ, న్యాయాలు పరిశీలించి తీర్పు ఇస్తాం. ఎవరికి అన్యాయం చేసే విధంగా కోర్టు తీర్పు ఉండదు. కె.సూర్యారావు,ఆర్డీవో, నర్సీపట్నం -
ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి
పాల్వంచ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీకి చెందిన గృహిణి కల్తీ నాగమణి (27) నాలుగు రోజుల క్రితం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
శుభకార్యం కోసం బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిరలో శనివారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పాగోడ మండలం పడవళ్లికి చెందిన గోవింద్‌నాయక్ (43) మడకశిరలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఈ రోజు ఉదయం కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు అతన్ని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతని పై పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ మృతిచెందిన యువతి ఆస్పత్రిలో కోలుకుంటున్న యువకుడు నక్కపల్లి/పాయకరావుపేట:పెళ్లికితల్లిదండ్రులు నిరాకరిస్తున్నారన్న కారణంగా ప్రేమంజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడగా, యువకుడు తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన ఉలవకాయల పార్వతి(21) అదేగ్రామానికిచెందిన వేముల నరేంద్రలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేనత్త మేనమామపిల్లలు,పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్వతి తల్లిదండ్రులు ఆమెకు బయట వ్యక్తితో వివాహం చేయడానికి సంబంధాలుచూస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రేమికులిద్దరూ ఈనెల 22న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరూ సమీపంలో ఉన్న తోటలో పడిఉండటాన్ని చూసి బంధువులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. యవతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో ఆమె మృతి చెందినట్లు తండ్రి సత్తిబాబు పోలీసులకు తెలిపాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. -
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం
కృష్ణా జిల్లా పామర్రులో ఉరి వేసుకున్న వ్యక్తి నేతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పెళ్లి రోజునే ఘటన.. నిలకడగా బాధితుడి ఆరోగ్యం పరామర్శించిన సీఎం చంద్రబాబు... బాధితుడి తండ్రితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్ హైదరాబాద్/పామర్రు/పెనమలూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగావకాశాలు దక్కవని భావించిన ఓ వ్యక్తి తన పెళ్లి రోజునే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా పామర్రులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పామర్రు సాయినగర్‌కు చెందిన చావలి సుబ్బారావు(గిరి) భార్య, ఇద్దరు పిల్లలతో తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. తమ డాబాపై ఉన్న పాకలో శనివారం ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన అతడి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి తాడును కోసి కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని తొలుత స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సుబ్బారావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రాంతంలో సూసైడ్ నోట్‌ను కుటుంబసభ్యులు గుర్తించారు. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్... బాధితుడి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి సుబ్బారావును చూస్తానని ఓదార్చారు. హోదా లేదు.. ఉద్యోగం రాదు సుబ్బారావు సూసైడ్ నోట్లోని వివరాలివీ... ‘‘నేను ఎస్ఎస్సీ, ఐటీఐ పూర్తిచేశాను. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)లో శిక్షణ పొందాను. ఉద్యోగం కోసం 18 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్న విషయం నన్ను బాధించింది. ఇక జన్మలో నాకు ఉద్యోగం రాదని అర్థమైంది. ఇటువంటి పరిస్థితులలో ప్రాణ త్యాగమే కచ్చిత నిర్ణయంగా భావించాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక ఆటో లోన్ కూడా తీసుకోలేకపోయా. నా భార్యా పిల్లలకు కూడు పెట్టలేక సంఘంలో ఎలా బతకాలో అర్థంకాక ఆత్మహత్యకు పాల్పడుతున్నా. మూడు నెలలుగా ఆలోచించి నా పెళ్లి రోజున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించున్నా. చంద్రబాబు, జగన్, ఇతర నాయకులు... మీకు వీలుంటే నా కుటుంబాన్ని ఆదుకోండి. డాడ్, మామ్, వైఫ్, డాటర్, సన్.. ఐ మిస్ యూ. బట్ ఆంధ్రా లైక్. ఇప్పటివరకు నాతో కలిసి ఉన్న వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. నిలకడగా సుబ్బారావు ఆరోగ్యం ఆత్మహత్యాయత్నం చేసిన సుబ్బారావు ఆరోగ్యం నిలకడగా ఉందని పెనమలూరు మండలం పోరంకిలోని బొప్పన ఆసుపత్రిలో ఎండీ బొప్పన వెంకటరత్నం తెలిపారు. బాధితుడికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ తీసిన తర్వాత కానీ వివరాలు చెప్పలేమన్నారు. ఆసుపత్రిలో సుబ్బారావు భార్య సుజాత అస్వస్థతకు గురైంది. ఆమెకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో కుప్పకూలింది. ఆమెకు అదే ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలు అధైర్యపడొద్దు: సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలు అధైర్యపడొద్దని, తాను కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసి, బొప్పన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చావలి సుబ్బారావును శనివారం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాపై ప్రగాఢమైన కోరిక ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయం జరగాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే తాను కేంద్రంతో చర్చలు జరుపుతున్నానని చెప్పారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉందని అన్నారు. ఈ నెల 25న ప్రధానమంత్రితో చర్చలు జరుపుతానని వెల్లడించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, తాను ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. ప్రజలు తొందరపాటుతో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, డీజీపీ జె.వి.రాముడు, ఇతర అధికారులు చంద్రబాబు వెంట ఉన్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
హసన్‌పర్తి : ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన ఈ జంట.. కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం నేరెళ్లల్లో సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. అయితే ప్రస్తుతం ఆ జంట పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..హసన్‌పర్తి మండలం నాగారానికి చెందిన బండారి హరీష నగర పరిధిలోని ఓ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఎండీ.ఖాజాపాషాతో ఆమె ప్రేమలో పడింది. ఖాజాపాషా గ్రామంలో బెలూన్ల (బుగ్గులు, పీకలు) వ్యాపారం చేస్తున్నాడు.కాగా, ఈనెల 15వ తేదీ న హరీ షకు నిశ్చితార్థం. ఈనెల 14న హరీష ఇంటి నుంచి పారిపోయింది. రెండురోజుల పా టు హరీషకోసం గాలింపు చేపట్టారు. జాడ కానరాకపోవడంతో ఈనెల 16న కుటుంబ సభ్యులు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేరెళ్లలో ఆత్మహత్యాయత్నం.. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంది. అయితే రెండురోజుల పాటు ఆ ప్రేమికులు నేరెళ్లలోని ఖాజాపాషా బంధులు ఇంటిలో ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్లితే కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించిన వారు పురుగుల మందు తాగారు. బాధితులను వెంటనే 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలివెళ్లారు. -
ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
-
ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
309 సెక్షన్ తొలగించాలని కేంద్రం నిర్ణయం లా కమిషన్ సిఫారసుకు 18 రాష్ట్రాలు అనుకూలం న్యూఢిల్లీ: ఆత్మహత్యాయత్నం ఇకపై నేరం కాబోదు. ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ చేసిన సిఫార్సుపై దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సానుకూలంగా స్పందించాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది. ఇది త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశముందని తెలిపింది. ఈ అంశంపై ఒక సభ్యుడి ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 309వ సెక్షన్‌ను రద్దు చేయాలని లా కమిషన్ తమ 210వ నివేదికలో సిఫారసు చేసింది. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున దీనిపై వారి అభిప్రాయం కోరాం. 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే 309వ సెక్షన్‌ను రద్దుచేసే అవకాశముంది..’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ సెక్షన్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదనను పలు రాష్ట్రాలు వ్యతిరేకించగా.. మరికొన్ని పలు సూచనలు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయకుండా, కొన్ని సవరణలు మాత్రం చేయాలని బిహార్ డిమాండ్ చేసింది. ఎవరైనా తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారు ఆత్మహత్యాయత్నం చేస్తే.. దానికి సంబంధించి వేరే చట్టాలు ఉండాలని సూచించింది. ఇక ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకపోతే... సెక్షన్ 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం)ను బలహీన పరుస్తుందని మధ్యప్రదేశ్ స్పష్టం చేసింది. సిక్కిం కూడా లా కమిషన్ సిఫారసు పట్ల వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక 309 సెక్షన్‌ను రద్దుచేయడం పట్ల ఢిల్లీ సానుకూలంగానే స్పందించినా... సదరు ఆత్మహత్యాయత్నం ఘటనలను సంబంధిత అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువచ్చేలా, వారికి ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించింది. -
గల్ఫ్ ఏజెంట్ మోసం
పురుగుల మందు తాగి బాధితుడు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయని పోలీసులు నిజామాబాద్ క్రైం : జిల్లాలో గల్ఫ్ మోసాలు ఇంకా జరుగుతునే ఉన్నాయి. తమ కుటుం బాన్ని పోషించుకునేందుకు భార్యా బిడ్డలను వదిలి, అప్పులు చేసి విదేశాలకు వెళ్లే వారు మోసపోతూ ప్రాణా లు తీసుకుంటున్నారు. తాజాగా డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుం ది. ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు చేసిన అప్పులు ఎలా తీ ర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మిట్టపల్లి గ్రామానికి చెందిన లోక శ్రీనివాస్‌ను అదే గ్రామానికి చెం దిన గల్ఫ్ ఏజెంట్ మమ్మాయి నడ్పి సాయిలు తరచూ నిన్ను బయట దేశం బహ్రెయిన్‌కు పంపుతానని, అక్కడ ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగం ఉందని, ఇందుకు రూ. 80 వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. అక్కడ నెలకు రూ. 15 నుంచి 20 వేల జీతం ఉంటుందని చెప్పటంతో శ్రీనివాస్‌కు ఆశ కలిగింది. దీంతో బెహరన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం తన భార్య పల్లవి మెడలో ఉన్న బంగారు గొలు సు, చెవి కమ్మలు అమ్మాడు. డబ్బులు సరిపోక పోవటంతో అతని తండ్రి తె లిసిన వారి వద్ద కొంత డబ్బులు అ ప్పు చేసి ఇచ్చాడు. వారం రోజుల క్రి తం శ్రీనివాస్ బహ్రెయిన్‌కు బయలుదేరి వెళ్లాడు. అక్కడ అతనిని ఏజెంట్ నడ్పి సాయిలు సోదరుడు చిన్న సాయిలు ఎయిర్‌పోర్టు నుంచి తీసుకువె ళ్లి, కంపెనీలో అప్పగించారు. అయి తే కంపెనీ వారు ఆఫీస్ బాయ్ ఉద్యో గం కాకుండా లేబర్ పని ఇవ్వడంతో, తనకు లేబర్ పని చేయటం చేతకాదని చెప్పి కంపెనీ నుంచి బయటకు వచ్చా డు. అక్కడి పోలీసులు తనను పట్టుకుని జైల్లో పెట్టారని తెలిపాడు. విషయం తెలుసుకున్న చిన్న సాయి లు, మరికొందరు తనను జైలు నుంచి విడిపించారని చెప్పాడు. చిన్న సాయి లు సెలవులో స్వదేశానికి వస్తుండటంతో ఆయనతో పాటు తనను కూడా ఎయిర్‌పోర్టుకు కొడుతూ తీసుకువచ్చాడని తెలిపాడు. శంషాబాద్ ఎయిర్పోర్డులో ఏజెంట్ నడ్పి సాయిలు, అతని చిన్న తమ్ముడు సాయిలు, కజిన్ సోదరుడు ఒకరు తనపై దాడిచేసి కొట్టి తన వద్దనున్న కొత్త బట్టలు, సెల్ ఫోన్ లాక్కున్నారని, అక్కడి నుంచి తమ గ్రామానికి తీసుకువచ్చి తన ఇంట్లో వదిలిపెట్టినట్లు వివరించాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక భర్త పడుతున్న బాధను చూడలేక భార్య పల్లవి శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగేందుకు ప్రయత్నం చేసింది. అక్క డే ఉన్న శ్రీనివాస్ ఆమె చేతిలో ఉన్న పురుగుల మందును తీసుకుని తాను తాగాడు. దీనిని చూసిన కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసంపై డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తెల్ల కాగితం చేతిలో పెట్టి నీ ఇష్టం వచ్చిన ఫిర్యాదు రాసి ఇవ్వాలని చెప్పారని బాధితుడి బంధువు చంద్రమోహన్ తెలిపారు. ఏజెంట్ మోసంపై తమ ఫిర్యాదు ఇప్పటికీ నమోదు చేయలేదన్నారు. మా దృష్టికి రాలేదు..: ముజుబూర్ రెహమాన్, డిచ్పల్లి ఎస్సై లోక శ్రీనివాస్ గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోస పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కేసు విషయం మా దృష్టికి రాలేదు. బాధితుడు ఫిర్యాదు చేస్తే ఏజెంట్‌పై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేస్తాం. -
‘జన్మభూమి'లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఊట్లపల్లి(బాలాయపల్లి): ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న బంగారుతల్లి, జననీసురక్ష పథకాలకు తమ పిల్లలను ఎంపిక చేయలేదనే మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దింగి అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఊట్లపల్లిలో సోమవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో చోటుచేసుకుంది. బాలాయపల్లి మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన చింతలపూడి సుబ్బారావుకు ఇద్దరు కుమార్తెలు. వారు పుట్టినప్పటి నుంచి బంగారుతల్లి, జననీ సురక్ష పథకాలను వర్తింపజేయాలని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగాడు. రచ్చబండ, గ్రామసభలు తదితర కార్యక్రమాల్లో అర్జీలు ఇచ్చినా పలితం కరువైంది. ఈ క్రమంలో అధికారులు తన విషయంలో కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారనే మనస్థాపానికి గురైన సుబ్బారావు జన్మభూమి గ్రామసభలో విషగుళికలు తినేందుకు యత్నించాడు. వెంటనే కానిస్టేబుళ్లు మనోహర్, నరేష్ అడ్డుకున్నారు. సుబ్బారావు ఆత్మహత్యాయత్నం చేయడంపై తహశీల్దార్ సీతారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు అర్హత ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, ఆత్మహత్యాయత్నం చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారికి ప్రభుత్వ పథకాలు వర్తించే అంశాన్ని పరిశీలించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మను ఆదేశించారు. సీడీపీఓ అనురాధతోనూ ఫోన్లో మాట్లాడారు. సుబ్బారావు అర్జీని ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు. -
జయకు మద్దతుగా తమిళ నటి ఆత్మహత్యాయత్నం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ నటి మాయ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. జయలలితకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ ఆమె చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ చర్యకు పాల్పడింది. తమిళ చిత్రాలు గర్జానాయి, అమరకావ్యం తదితర చిత్రాల్లో మాయ నటించింది. -
గ్రీవెన్స్‌సెల్‌లో ఆత్మహత్యాయత్నం
ఓబులవారిపల్లె: తనకు ఇచ్చిన భూమికి సంబందించిన స్థలాన్ని తొమ్మిదేళ్లుగా చూపకపోవడంతో ఆ దళితరైతు విసిగిపోయాడు. చివరకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్‌సెల్‌లో చిన్నఓరంపాడు గ్రామానికి చెందిన సోంబత్తిన శ్రీనివాసులు అనే దళిత రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రీవెన్‌సెల్‌కు రైల్వేకోడూరు శాసన సభ్యుడు కొరముట్ల శ్రీనివాసులుతో పాటు స్థానిక తహశీల్దార్ శిరీష పాల్గొన్నారు. మధ్యాహ్న సమయంలో సోంబత్తిన శ్రీనివాసులు ‘తనకు 2005లో ఠమొదటిపేజీ తరువాయి జెడ్హెచ్టీసీ భూముల్లో ఎకరా పట్టా ఇచ్చారని, ఇంత వరకు ఆ స్థలం ఎక్కడ ఉందో చూపించలేదని వాపోయాడు. ఇందుకోసం ఓబులవారిపల్లె మండల రెవెన్యూ కార్యాలయం మొదలుకుని హైదరాబాదు ఎస్సీ, ఎస్టీ కమిషనర్ కార్యాలయం వరకు తొమ్మిదేళ్లుగా తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమి కోసం అధికారుల వద్ద పడిన అవమానాన్ని తలచుకుని ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న విషద్రావణాన్ని తాగే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యేతో పాటు తహశీల్దార్ నివ్వెరపోయారు. గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన మాజీ మండలాధ్యక్షుడు తిరుపాల్, వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఆర్ఐ రఘుపతి తదితరులు శ్రీనివాసులు దగ్గర ఉన్న విషద్రావణాన్ని లాక్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఎకరా భూమితో పాటు మరో ఎకరా భూమి వచ్చేటట్లు చేస్తామని ఈ సందర్భంగా తహశీల్దార్ శిరీష బాధిత రైతుకు హామీ ఇచ్చారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
నకిరేకల్ : నకిరేకల్ శివారులోని బాబాసాహెడ్గూడెంకు చెందిన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. బాబాసాహెబ్‌గూడెం గ్రామానికి చెందిన గద్దపాటి అఖిల్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అఖిల్ తన ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకొని వెళ్లి నకిరేకల్ శివారులో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలినగాయాలతో కొట్టుమిట్టాడుతున్న అఖిల్‌ను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న ల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని అఖిల్ తన వాంగ్మూలం ఇచ్చినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఒకరు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లికి చెందిన సి.గంగులప్ప టీడీపీ కార్యకర్త. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, స్వగ్రామంలోని తన భూమికి పట్టా ఇప్పించాల్సిందిగా చంద్రబాబును కోరేందుకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో లోనికి వెళ్లి పురుగులు మందు తాగి బాబు వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం గంగులప్ప ఆరోగ్యం కుదుటపడినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.