వేములవాడ రూరల్: పెళ్లి పేరుతో ఒక యువకుడు వేధించడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం బాల్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన నాగుల శ్రీకర్, కరీంనగర్ మండలం ముగ్దూంపూర్ కు చెందిన గుంటి అఖిల కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీకర్ బెదిరిస్తున్నాడు. తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఆమెను మంగళవారం తన ద్విచక్రవాహనంపై తీసుకుని వేములవాడ మండలం మల్లారంలోగల అతడి అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌లో అఖిల కిడ్నాప్ అయినట్లు కేసు నమోదైంది. శ్రీకర్‌పై అనుమానం ఉందంటూ అమ్మాయి తండ్రి గుంట అంజయ్య చెప్పాడు.
బుధవారం శ్రీకర్, అఖిల ద్విచక్రవాహనంపై కామారెడ్డి వె ళ్తూ రామాయంపేట వద్ద ఆగారు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగడానికి శ్రీకర్ యత్నించారు. ఈక్రమంలో మందుడబ్బాను లాక్కొని అఖిల తాగేసింది. దీంతో ఆమెను వేములవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న ఆమెను తీసుకెళ్లారు. ఎల్‌ఎండీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Thu, Apr 7 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
Advertisement
Advertisement