- పాఠశాలలో రాజకీయ జోక్యంతో ఘటన
నైట్‌వాచ్‌మన్‌గా నియమించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Fri, Sep 2 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
రేగొండ : గత కొంతకాలంగా మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో తాత్కాలిక అటెండర్‌గా పనిచేసిన తనను నైట్ వాచ్‌మన్‌గా నియమించలేదని ఓ వ్యక్తి మనోవేదనకు గురై పురుగుల మందు తాగిన సంఘటన గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత ఐలయ్య గత 15 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో తాత్కాలిక అటెండర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో తనకు సరైన వేతనం అందించడం లేదని గత సంవత్సరం నుంచి విధులకు దూంగా ఉంటున్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.3500 చొప్పున వేతనం ఇస్తూ ఏడాదిలో 10 నెలలు పని చేసేలా ఒక వాచ్‌మన్‌ను నియమించుకోవాలని హెచ్‌ఎంలను ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా ఐలయ్య జగ్గయ్యపేట గ్రామంలోని ఎస్‌ఎంసీ కమిటీని తననే నైట్‌వాచ్‌మన్‌గా నియమించాలని కోరాడు. అయితే గురువారం ఎస్‌ఎంసీ కమిటీ మాత్రం ఐలయ్యకు బదుల ఎస్‌ఎంసీ కమిటీ సభ్యురాలు సంధ్య భర్త పున్నం స్వామిని నియమిస్తూ తీర్మానం చేశారు. దీంతో మనోవేదనకు గురైన అయిలయ్య పాఠశాల ఆవరణకు వచ్చి పురుగుల మందు తాగుతుండగా గమనించిన గ్రామస్తులు అతడి చేతిలోని డబ్బాను లాక్కొని పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి 108లో తరలించారు.
రాజకీయ జోక్యంతోనే ఐలయ్య ఆత్మహత్యాయత్నం ..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇటీవల ఎస్‌ఎంసీ చైర్మన్ పదవిని దక్కించుకునేందకు తీవ్రంగా పోటీపడ్డారు. చివరికి టీఆర్‌ఎస్ బలపర్చిన వ్యక్తి గుంటుకు రమేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. గతంలో పనిచేసిన ఐలయ్యకు నైట్ వాచ్‌మన్‌గా ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. కానీ వారి మాట నెగ్గొద్దనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ నాయకులు మరొకరిని ఎంపిక చేశారు.
ఎస్‌ఎంసీ తీర్మానం మేరకే నియమించాం
ప్రభుత్వం ఇచ్చిన నామ్స్(నిబంధనల) ప్రకారమే నైట్‌వాచ్‌మన్‌ను నియమించినట్లు జగ్గయ్యపేట హైస్కూల్ హెడ్‌మాస్టర్ కె.రమేష్‌బాబు తెలిపారు. నైట్‌వాచ్‌మన్ నియామంకంలో తాను ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోలేదన్నారు.
– కె.రమేష్‌బాబు, హెచ్‌ఎం
Advertisement
Advertisement