night watchman
-
ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్ వాచ్మన్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. వాచ్మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని 2020–21 నుంచి మిషన్ మోడ్‌లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది. ఫేజ్–1 కింద 15,715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్–2 కింద 22,228 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్–3లో అభివృద్ధి చేస్తారు. ఇదేకాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించారు. మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది. నాడు–నేడు ఫేజ్–2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తున్నారు. నాడు–నేడు ఫేజ్–1 కింద పనులు పూర్తయిన స్కూళ్లలో కూడా వీటిని సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఎఫ్‌పీలలోని కంటెంట్‌తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యంగా మారింది. వీటితోపాటు పాఠశాలల ఆవరణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మన్లను నియమించాలని ఆదేశాలిచ్చింది. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్ రెసిడెన్షియల్ (నివాసేతర) ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాచ్‌మన్‌ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధిమీనా మెమో విడుదల చేశారు. నైట్ వాచ్‌మన్ విధులు ► పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి. ► పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. ► రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన æభవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పనిచేయాలి. ► పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. ► ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగినప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టర్‌కు, సమీప పోలీస్ స్టేషన్‌కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి. ► సాయంత్రం పాఠశాల గార్డెన్‌కు నీరు పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్‌ను శుభ్రం చేయాలి. ► పాఠశాలకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందించడం చేయాలి. ► స్కూలుకు సంబంధించి హెచ్ఎం చెప్పే ఇతర పనులను చేయాలి. ► నైట్ వాచ్‌మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ► 2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి. ► నైట్ వాచ్‌మన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్మాస్టర్ ఐఎంఎంఎస్ యాప్ ద్వారా చేపట్టాలి. ► వాచ్మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలి. మార్గదర్శకాలు.. ► పేరెంట్ కమిటీల ద్వారా పాఠశాలల్లో నైట్ వాచ్‌మన్‌ను నియమించాలి. ► ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ► గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. ► వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు. ► నైట్ వాచ్‌మన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నివాసి అయి ఉండాలి. ► ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపికచేయాలి. ► వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. ► ఇప్పుడు గుర్తించిన 5,388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు. ► ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.6 వేల చొప్పున టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి. -
రంజిత్ స్ఫూర్తిగాథ.. నైట్‌వాచ్‌మెన్ నుంచి ఐఐఎం..
కాసర్గడ్: ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న రంజిత్ రామచంద్రన్‌ది స్ఫూర్తిదాయక చరిత్ర. నైట్‌వాచ్‌మన్‌గా పనిచేసి, ఆ తరువాత ఐఐటీలో చదువుకుని, ప్రస్తుతం ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి చేరారు. ఈ వివరాలను ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయన వివరించారు. కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్‌తో కప్పిన తన చిన్న గుడిసె ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఫేస్బుక్లో 37 వేల లైక్స్ వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు. కాసర్గడ్లోని పనతుర్‌లో ఉన్న ఒక టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లో రంజిత్ నైట్ వాచ్‌మన్‌గా పనిచేశారు. అలా చేస్తూనే పీఎస్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించారు. తనకు మలయాళం మాత్రమే తెలియడం, ఆంగ్లం రాకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పీహెచ్డీ కోర్సు వదిలేద్దామనుకున్నారు. కానీ గైడ్ డాక్టర్ సుభాష్ సహకారంతో కోర్సు పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పేదరికంతో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశానని, తన తండ్రి టైలర్ కాగా, తల్లి ఉపాధి కూలీ అని ఆ పోస్ట్‌లో రంజిత్ తెలిపారు. -
నైట్‌వాచ్‌మన్‌గా నియమించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పాఠశాలలో రాజకీయ జోక్యంతో ఘటన రేగొండ : గత కొంతకాలంగా మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో తాత్కాలిక అటెండర్‌గా పనిచేసిన తనను నైట్ వాచ్‌మన్‌గా నియమించలేదని ఓ వ్యక్తి మనోవేదనకు గురై పురుగుల మందు తాగిన సంఘటన గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత ఐలయ్య గత 15 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో తాత్కాలిక అటెండర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో తనకు సరైన వేతనం అందించడం లేదని గత సంవత్సరం నుంచి విధులకు దూంగా ఉంటున్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.3500 చొప్పున వేతనం ఇస్తూ ఏడాదిలో 10 నెలలు పని చేసేలా ఒక వాచ్‌మన్‌ను నియమించుకోవాలని హెచ్ఎంలను ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా ఐలయ్య జగ్గయ్యపేట గ్రామంలోని ఎస్ఎంసీ కమిటీని తననే నైట్‌వాచ్‌మన్‌గా నియమించాలని కోరాడు. అయితే గురువారం ఎస్ఎంసీ కమిటీ మాత్రం ఐలయ్యకు బదుల ఎస్ఎంసీ కమిటీ సభ్యురాలు సంధ్య భర్త పున్నం స్వామిని నియమిస్తూ తీర్మానం చేశారు. దీంతో మనోవేదనకు గురైన అయిలయ్య పాఠశాల ఆవరణకు వచ్చి పురుగుల మందు తాగుతుండగా గమనించిన గ్రామస్తులు అతడి చేతిలోని డబ్బాను లాక్కొని పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి 108లో తరలించారు. రాజకీయ జోక్యంతోనే ఐలయ్య ఆత్మహత్యాయత్నం .. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇటీవల ఎస్ఎంసీ చైర్మన్ పదవిని దక్కించుకునేందకు తీవ్రంగా పోటీపడ్డారు. చివరికి టీఆర్ఎస్ బలపర్చిన వ్యక్తి గుంటుకు రమేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. గతంలో పనిచేసిన ఐలయ్యకు నైట్ వాచ్‌మన్‌గా ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. కానీ వారి మాట నెగ్గొద్దనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు మరొకరిని ఎంపిక చేశారు. ఎస్ఎంసీ తీర్మానం మేరకే నియమించాం ప్రభుత్వం ఇచ్చిన నామ్స్(నిబంధనల) ప్రకారమే నైట్వాచ్మన్ను నియమించినట్లు జగ్గయ్యపేట హైస్కూల్ హెడ్మాస్టర్ కె.రమేష్‌బాబు తెలిపారు. నైట్‌వాచ్‌మన్ నియామంకంలో తాను ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోలేదన్నారు. – కె.రమేష్‌బాబు, హెచ్ఎం -
నాచగిరిలో దొంగల హల్చల్
వర్గల్ : చోరులు బరి తెగించారు. మండల పరిధిలోని నాచగిరి పుణ్యక్షేత్రం ఆలయ ద్వారాల తాళాలు బద్దలుకొట్టి లోనికి చొరబడి హుండీలు, బీరువాలను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం రాత్రి రోజు మాదిరిగానే నాచగిరి ఆలయ అర్చక, పురోహితులు పూ జా కార్యక్రమాలు ముగించి గుడి మూసేశారు. అదే రోజు రాత్రి ఆలయం వద్ద పహారా కాసేందుకు ముగ్గురు నైట్ వాచ్మెన్లు విధుల్లో చేరారు. సోమవారం రాత్రి అనూహ్యంగా సాయిబాబా ఆలయం వద్ద ఇనుప గేటు గొలుసు విరగ్గొట్టారు. అందులోనుంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించారు. మెట్ల దిగువున ఉన్న నవగ్రహాలయ హుండీ బద్దలు కొట్టారు. లోపలి వైపు తాళం లేకపోవడంతో హుండీ తెరుచుకున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న శివాలయం హుండీ తాళం, రామాలయం హుండీ పగులకొట్టేందుకు ప్రయత్నించారు. లడ్డూల కోటా గది తాళం బద ్ధలు కొట్టి లోపలి బీరువా తెరచి సొమ్ము కోసం వెతుకులాడారు. ఆ తరువాత ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేక దర్శనం గేటు తాళం పగులగొట్టారు. ఆలయ మండపంలోని ఆండాళమ్మ కోవెల గదిని తెరి చేందుకు ప్రయత్నించారు. అది సాధ్యపడలేదు. అయితే శివాలయం వద్ద, ప్ర దాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఓ పక్కకు తిప్పేశారు. ఇంత జరుగుతున్నా.. పహారా కాసే కాపలాదారులకు వినిపించకపోవడం గమనార్హం. కాగా మంగళవారం ఉదయం అర్చకులు ఆలయం తెరిచేందుకు వచ్చి చూసే వరకు విషయం వెలుగులోకి రాలేదు. అర్చకుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ హేమంత్ కుమార్, సంగారెడ్డి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శివరాజ్ మంగళవారం ఉదయం ఆలయం చేరుకుని చోరీ తీరు పరిశీలించారు. తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తూప్రాన్ ఎస్ఐ సంతోష్‌కుమార్ ఆలయం సందర్శించారు. సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు వాచ్మెన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. -
సీఎం నైట్వాచ్మేన్ మాత్రమే: హరీశ్ రావు
హైదరాబాద్: ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ బ్యాట్స్‌మేన్ కాదని, నైట్ వాచ్‌మేన్ మాత్రమేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో ఆయన ప్రభాకం ఏమాత్రం ఉండదన్నారు. సీఎం ఇంటికి కరెంటె నిలిపివేయడానికి ఒక్క నిమిషం పడుతుందన్నారు. సీఎం అంటే చాలు హరీశ్ రావు ఒంటికాలుమీద లేస్తున్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర అహంకారంతో కిరణ్ మాట్లాడుతున్నారని మండిపడుతుంటారు.