
గల్ఫ్ ఏజెంట్ మోసం
పురుగుల మందు తాగి
బాధితుడు ఆత్మహత్యాయత్నం
కేసు నమోదు చేయని పోలీసులు
నిజామాబాద్ క్రైం : జిల్లాలో గల్ఫ్ మోసాలు ఇంకా జరుగుతునే ఉన్నాయి. తమ కుటుం బాన్ని పోషించుకునేందుకు భార్యా బిడ్డలను వదిలి, అప్పులు చేసి విదేశాలకు వెళ్లే వారు మోసపోతూ ప్రాణా లు తీసుకుంటున్నారు. తాజాగా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుం ది. ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు చేసిన అప్పులు ఎలా తీ ర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మిట్టపల్లి గ్రామానికి చెందిన లోక శ్రీనివాస్‌ను అదే గ్రామానికి చెం దిన గల్ఫ్ ఏజెంట్ మమ్మాయి నడ్పి సాయిలు తరచూ నిన్ను బయట దేశం బహ్రెయిన్‌కు పంపుతానని, అక్కడ ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగం ఉందని, ఇందుకు రూ. 80 వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. అక్కడ నెలకు రూ. 15 నుంచి 20 వేల జీతం ఉంటుందని చెప్పటంతో శ్రీనివాస్‌కు ఆశ కలిగింది.
దీంతో బెహరన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం తన భార్య పల్లవి మెడలో ఉన్న బంగారు గొలు సు, చెవి కమ్మలు అమ్మాడు. డబ్బులు సరిపోక పోవటంతో అతని తండ్రి తె లిసిన వారి వద్ద కొంత డబ్బులు అ ప్పు చేసి ఇచ్చాడు. వారం రోజుల క్రి తం శ్రీనివాస్ బహ్రెయిన్‌కు బయలుదేరి వెళ్లాడు. అక్కడ అతనిని ఏజెంట్ నడ్పి సాయిలు సోదరుడు చిన్న సాయిలు ఎయిర్‌పోర్టు నుంచి తీసుకువె ళ్లి, కంపెనీలో అప్పగించారు. అయి తే కంపెనీ వారు ఆఫీస్ బాయ్ ఉద్యో గం కాకుండా లేబర్ పని ఇవ్వడంతో, తనకు లేబర్ పని చేయటం చేతకాదని చెప్పి కంపెనీ నుంచి బయటకు వచ్చా డు. అక్కడి పోలీసులు తనను పట్టుకుని జైల్లో పెట్టారని తెలిపాడు. విషయం తెలుసుకున్న చిన్న సాయి లు, మరికొందరు తనను జైలు నుంచి విడిపించారని చెప్పాడు. చిన్న సాయి లు సెలవులో స్వదేశానికి వస్తుండటంతో ఆయనతో పాటు తనను కూడా ఎయిర్‌పోర్టుకు కొడుతూ తీసుకువచ్చాడని తెలిపాడు.
శంషాబాద్ ఎయిర్‌పోర్డులో ఏజెంట్ నడ్పి సాయిలు, అతని చిన్న తమ్ముడు సాయిలు, కజిన్ సోదరుడు ఒకరు తనపై దాడిచేసి కొట్టి తన వద్దనున్న కొత్త బట్టలు, సెల్ ఫోన్ లాక్కున్నారని, అక్కడి నుంచి తమ గ్రామానికి తీసుకువచ్చి తన ఇంట్లో వదిలిపెట్టినట్లు వివరించాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక భర్త పడుతున్న బాధను చూడలేక భార్య పల్లవి శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగేందుకు ప్రయత్నం చేసింది. అక్క డే ఉన్న శ్రీనివాస్ ఆమె చేతిలో ఉన్న పురుగుల మందును తీసుకుని తాను తాగాడు. దీనిని చూసిన కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసంపై డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తెల్ల కాగితం చేతిలో పెట్టి నీ ఇష్టం వచ్చిన ఫిర్యాదు రాసి ఇవ్వాలని చెప్పారని బాధితుడి బంధువు చంద్రమోహన్ తెలిపారు. ఏజెంట్ మోసంపై తమ ఫిర్యాదు ఇప్పటికీ నమోదు చేయలేదన్నారు.
మా దృష్టికి రాలేదు..: ముజుబూర్ రెహమాన్, డిచ్‌పల్లి ఎస్సై
లోక శ్రీనివాస్ గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోస పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కేసు విషయం మా దృష్టికి రాలేదు. బాధితుడు ఫిర్యాదు చేస్తే ఏజెంట్‌పై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేస్తాం.