భర్త రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడని.. | Felt ready to marry a second husband .. | Sakshi
Sakshi News home page

భర్త రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడని..

Published Fri, Apr 15 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

భర్త రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడని..

భర్త రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడని..

పురుగుల మందు తాగిన వివాహిత


మదనపల్లె క్రైం: పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే భర్త రెండో పెళ్లికి సిద్ధ పడడంతో మనస్తాపం చెందిన నవ వధువు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీకి చెందిన సిద్దగాళ్ల వెంకటేష్‌కు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రాధమ్మ(19)తో పెళ్లి జరిగింది. వీరి కాపురం మూడు నెలలు సజావుగా సాగింది. తర్వాత ఏమి జరిగిందో ఏమో కాని వెంకటేష్ రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు.


దీంతో రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెలో చంద్రకళ(20) అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది విషపు గులికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement