పండుగ చేసుకోయలేక పోయామని ఆత్మహత్యాయత్నం | festival poyamani to commit suicide | Sakshi
Sakshi News home page

పండుగ చేసుకోయలేక పోయామని ఆత్మహత్యాయత్నం

Published Sun, Apr 10 2016 1:38 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

festival poyamani to commit suicide

మదనపల్లె క్రైం : ఇంట్లో పండుగ చేసుకోలేకపోయామనే బాధతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని నీరుగటువారిపల్లెలో జరిగింది. టూటౌన్ పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బండి రామచంద్ర కుమారుడు జగన్నాథం (40) మదనపల్లెలోని అయోధ్యనగర్‌కు 20 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. కూలి మగ్గాలు నేస్తూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉగాది రోజు ఇంట్లో పండుగ చేయడానికి అతని వద్ద డబ్బులు లేవు.


భార్యతో కూడా గొడవపడ్డాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. ద్విచక్రవాహనంలోని పెట్రో ల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన భార్య పద్మజ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. బాధితుడిని హుటాహుటిన 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి 108లో తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement