ప్రకృతికి పుట్టిన రోజు పండుగ ఉగాది
ప్రకృతికి పుట్టిన రోజు పండుగ ఉగాది
Published Mon, Mar 27 2017 10:09 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
–మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు
–ఘనంగా ఉగాది విశిష్ఠ సేవాపురస్కారాల కార్యక్రమం
రాజమహేంద్రవరం రూరల్ : ఉగాదిని హిందువుల పండువగా భావించరాదని, ప్రకృతికి ఉగాది పుట్టినరోజు పండుగలాంటిదని, అన్ని మతాల వారు ఈ మధుమాసాన్ని ఆచరించాలని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు అన్నారు. సోమవారం హేవిళంబి నామ ఉగాదిని పురస్కరించుకుని ఫిలాంత్రోఫిక్ సొసైటీ, తెలుగువిశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో తెలుగు విశ్వవిద్యాలయ సెమినార్ హాలులో ఉగాది విశిష్ట సేవాపురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ చైత్రమాసంలో వసంత రుతువు అనాదిగా మానవజాతికి మరువలేని తీపి గురుతన్నారు. తెలుగువిశ్వవిద్యాలయ పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఉగాదిని గుర్తు చేసే కోయిల పాట వింటే ప్రాణం లేచివస్తుందని, జగమంతా వసంతాలు పూయు ఉగాది ఒకటి చాలని అన్నారు. తెలుగుభాషా రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రజల్లో విశ్వవిద్యాలయాల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేలా ఫిలాంత్రోఫిక్ సొసైటీ వివిధ విశ్వవిద్యాలయాలతో చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సభలో ఆదికవినన్నయ్య విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ పి.విజయనిర్మల జ్యోతిప్రజ్వలన చేయగా, సీనియర్ జర్నలిస్టు, ఏపిడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండేలా శ్రీరామ్మూర్తి, నన్నయ్యవిశ్వవిద్యాలయం తెలుగు విభాగ కన్వీనర్ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా మాట్లాడారు. తెలుగు బాష కమ్మదనంపై కె.వాణి పాడిన గీతం, డాక్టర్ పుట్ల హేమలత వాఖ్యానం ఆహుతులను అలరించాయి. ఉగాది కవితతో అందరి మదిని దోచారు కవి నూజెళ్ల శ్రీనివాసరావు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 22మందికి ఉగాది విశిష్ట సేవా పురస్కార్ అవార్డులు అందించి, ఘనంగా సన్మానించారు.
పురస్కారాలు పొందినవారు వీరే
సాహిత్యం విభాగంలో డాక్టర్ బి.ప్రభాకరరావు(రెక్టర్, జేఎన్‌టీయూ, కాకినాడ), డాక్టర్ జనపాల కాళేశ్వరరావు(కవి, రచయిత, సామాజికవేత్త), మల్లెమొగ్గల గోపాలరావు(కవి, రచయిత), యడవల్లి శ్రీనివాసరావు(కవి, సామాజికవేత్త), బత్తుల మురళీకృష్ణ(కవి, రచయిత), సాంస్కృతిక రంగంలో తురగా సూర్యారావు(నటుడు, సామాజికవేత్త), డాక్టర్ కేవీఎం లాల్ నెహ్రూ(నృత్యం, సామాజిక రంగం), డాక్టర్ రవిపరస(నఖ చిత్రలేఖనం), సామాజిక రంగాల్లో డీజే సుధాకరరాజు, డాక్టర్ ఒమ్మి రఘురాం, డాక్టర్ మనికిరెడ్డి సత్యనారాయణ, మల్లాడి సత్యనారాయణ, చింతా వెంకటరమణి, డాక్టర్ కట్టా నళిని, డాక్టర్ రాయవరపు సత్యభామ, కె.వాణి, మల్లెపూల నిర్మలకుమారి, డాక్టర్ యంగలశెట్టి సాయికుమార్, డాక్టర్ కె.కృష్ణంరాజు, గుంపుల వెంకటేశ్వరరావు, రెవ.జోసఫ్ పాలంగి, గరికపర్తి నమశ్శివాయ
Advertisement
Advertisement