ఐఎంఏ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు | ima ugadi festival | Sakshi
Sakshi News home page

ఐఎంఏ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

Published Sun, Mar 26 2017 10:50 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

ఐఎంఏ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు - Sakshi

ఐఎంఏ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

 -సినీ సంగీతదర్శకుడు మాధవపెద్ది విభావరి
-ఐదుగురు ప్రముఖులకు సత్కారాలు 
దివాన్‌చెరువు (రాజానగరం) : ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఆధ్వర్యంలో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు కాంప్లెక్స్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన ఉగాది సంబరాలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ సంగీత విభావరితో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సామాజిక సేవా పరాయణుడు,  ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్‌ దాట్ల బుచ్చివెంకటపతిరాజు, రంగస్థల నటుడు, నిర్మాత కంటే  వీరన్నచౌదరి, నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్ర, వేదపండితుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణరాజు, సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌లను సత్కరించారు. అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ వేలూరి రామచంద్రరావు, డాక్టర్‌ వైఎస్‌ గురుప్రసాద్, డాక్టర్‌ గన్ని భాస్కరరావు, డాక్టర్‌ కందుల సాయి, డాక్టర్‌ కేవీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, పలువురు వైద్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement