ima
-
జర్మనీ క్రిస్మస్ మార్కెట్లో దారుణం
న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ వేళ జర్మనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మగ్దెబర్గ్ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లో జనంపైకి ఓ ఆగంతకుడు కారును వేగంగా నడిపాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల సమయంలో ఓ కారు మార్కెట్లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా వెళ్లినట్లు సీసీఫుటేజీలో నమోదైంది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో కనీసం 41 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని మీడియా తెలిపింది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్.ఎ.(50)అనే వ్యక్తిని సాయుధ పోలీసులు వెంటనే చుట్టుముట్టి, అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన దారినే తిరిగి వెళ్లేందుకు కారును మళ్లించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా కేవలం మూడే మూడు నిమిషాల్లో జరిగిపోయింది. కారు ముందుభాగం, విండ్ స్క్రీన్ ధ్వంసమైంది. రద్దీగా మార్కెట్లో పాదచారుల మార్గంపైకి బీఎండబ్ల్యూ కారు వెళ్తున్న దృశ్యం అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయింది. తాలెబ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని అధికారులు తెలిపారు. భయానక విషాద ఘటన ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న బాధితులను తరలించేందుకు 100 మంది పోలీసులు, వైద్య సిబ్బంది, ఫైర్ ఫైటర్లతోపాటు 50 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. దారుణం తెలిసిన వెంటనే ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ మగ్దెబర్గ్ వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. దాడిని భయానక విషాద ఘటనగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆనందానికి మారుపేరుగా ఉన్న మగ్దెబర్గ్లో ఘోరం చోటుచేసుకుందన్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో జర్మనీ వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ వారాంతపు మార్కెట్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. 7 Indian nationals have been injured in Magdeburg, Germany. 3 have been discharged from the hospital. Indian Mission is in touch with all those injured in the attack: Sources— ANI (@ANI) December 21, 2024ఖండించిన భారత్క్రిస్మస్ మార్కెట్లో జరిగిన దాడిని భారత్ ఖండించింది. దుండగుడు జనంపైకి కారు నడిపిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, గాయపడిన భారతీయులందరితో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. గాయపడిన భారతీయులతో, అలాగే వారి కుటుంబాలతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. సాధ్యమైన మేరకు వారికి సహాయ సహకారాల్ని అందిస్తామని ’ తెలిపింది. -
కోల్‌కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశంలో సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) అక్టోబర్ 15వ తేదీన 24 గంటల దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది.మరోవైపు.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్), మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్(ఎంఎస్ఎన్) నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ పేర్కొంది.‘‘తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోల్‌కతా జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తొమ్మిదో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఐఎంఏ తెలిపింది.ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లు కలిశారని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది. ఐఎంఏ బెంగాల్ యూనిట్.. నిరాహార దీక్షలు చేపట్టిన జూనియర్ డాక్టర్ల సంఘాలకు సంఘీభావం ప్రకటించింది. దేశంలోని అన్ని ఆఫీస్ బేరర్లు, రెసిడెంట్ డాక్టర్లు కూడా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఐఎంఏ కోరింది. ఇక.. నిరాహారదీక్ష/నిరసన వేదిక.. మెడికల్ కాలేజీ లేదా క్యాంపస్‌ల సమీపంలో ఆదర్శంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలోని పనిచేసే డాక్టర్లు.. తాము అక్టోబర్ 14 నుంచి 48 గంటల పాటు పాక్షికంగా విధలు నిర్వహిస్తామని ప్రకటించారు. -
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కోల్‌కతా అభయ కేసు : సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐఎంఏ
న్యూఢిల్లీ: కోల్‌కతా అభయ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సస్పెండ్ చేసింది.ఆర్జీకార్ అభయపై జరిగిన దారుణంలో సందీప్ ఘోష్ ప్రమేయం ఉందని తేలలేదు. అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం, ఆత్మహత్య అని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సీబీఐ సైతం దర్యాప్తు చేస్తుంది. అదే సమయంలో ఆర్జీకార్ మాజీ డాక్టర్, ప్రస్తుత ముర్షిదాబాద్ వైద్య కళాశాల డిప్యూటీ సుపరింటెండెంట్ అక్తర్ అలీ సందీప్ ఘోష్‌పై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మృతదేహాలతో వ్యాపారం,బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేశారని ఆరోపించారు.ఈ ఆరోపణలతో సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌ను 90 గంటల పాటు ప్రశ్నించారు. దీంతో పాటు ఆయన ఇల్లు, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం 11 గంటల పాటు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు.ఈ తరుణంలో ఐఎంఏ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్ చేసింది. వైద్యురాలి మరణంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యం, సానుభూతి లేకపోవడాన్ని ప్రస్తావించింది. తన తీరుతో సందీప్ ఘోష్ వైద్యవృత్తికి చెడ్డపేరు తెచ్చారని, క్రమశిక్షణా కమిటీ అతనిని సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ తెలిపింది. కాగా,ఆర్జీ కార్ ఆస్పత్రి వైద్యురాలి మరణం అనంతరం జరిగిన పరిణామలపై సందీప్ ఘోష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొన్ని గంటల్లోనే మమతా ప్రభుత్వం అతన్ని కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమించడం విశేషం. -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో యువ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్‌కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్‌కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్‌బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, హత్య, షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్‌పై జరిగిన దాడితోపాటు కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ఫిట్టా.. ఫట్టా
ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయ నేత గెలవడం అంటే...తనకు ఓటేసిన లక్షల మంది ప్రజల ఆశల్ని మోయడం. అంతటి బరువు బాధ్యతల్ని మోసే నేత ఆరోగ్యంగా ఉండాలి..అంతకన్నా ముందు ఆ నేత ఆరోగ్యం గురించి ప్రజలకు తెలిసి ఉండాలి...అది వారి హక్కు అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). ఏళ్లనాటి ఈ డిమాండ్ ఇంకా డిమాండ్‌గానే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతల ఆరోగ్యంపై అవగాహన నిజంగా ప్రజల హక్కుగానే భావించాలా? అయితే ఎందుకు? 2015లో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు తమ ఆర్థిక పరమైన ఆస్తులను ప్రకటించినట్లే తమ ఆరోగ్య స్థితిగతుల్ని కూడా ప్రకటించాలని ఐఎమ్ఎ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లపాటు రాజకీయ ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజాసేవ చేయగలరా లేదా అని తెలుసుకోవడం తమ అభ్యర్థుల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ఓటరు హక్కు ’’ అని అప్పటి ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెకె అగర్వాల్ స్పష్టం చేశారు. అది తప్పనిసరి చేయాలి.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు, అభ్యర్థి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. వైద్య పరీక్షలో ముందుగా ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధిని గుర్తిస్తే సదరు అభ్యర్థి ఉద్యోగానికి అనర్హులవుతారనేది మనకి తెలుసు. అలాగే క్రీడల్లో కూడా ఫిట్నెస్ పరీక్ష జరపకుండా ఆడటానికి అనుమతించరు. అలాంటప్పుడు పాలనకు బాధ్యత వహించే రాజకీయ నేతను ఎలా అనుమతిస్తారు? ప్రపంచంలోని అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేత ఆరోగ్యాన్ని తనిఖీ చేయకుండా ఎన్నికలలో పోరాడటానికి అనుమతివ్వడం సరైనదేనా? అనేవి కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే. దీనిని దృష్టిలో ఉంచుకునే... ‘‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య వివరాలు వెల్లడించడం తప్పనిసరిగా మార్చి దీని కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు అప్పటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎ మార్తాండ పిళ్లై. యువతపై ప్రభావం... మన దేశంలో రాజకీయ నాయకులను సెలబ్రిటీలుగా పరిగణిస్తారని, వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి యువ తరాన్ని ప్రభావితం చేస్తాయని ఐఎంఏ అంటోంది. నేతలు ఊబకాయంతో ఉండడం అలాగే పొగ తాగటం లేదా మద్యపానం వంటి దురలవాట్లు కలిగి ఉండడం... యువ తరానికి తప్పుడు సందేశం ఇస్తుందనేది తమ ఆందోళనగా పేర్కొంది. రాజకీయ నేత... అట్టడుగు స్థాయిలో పని చేయగలమని, శారీరకంగా చురుగ్గా ఉన్నామని, ఏ సమయంలోనైనా ఆకస్మిక విపత్తు సంభవించిన ప్రదేశాలకు రాగలమని, మైళ్ల దూరం నడిచి ప్రజలకు కావలసిన సేవలు అందించగలమనే నమ్మకం ప్రజలకు అందించాలి. ఐఎంఎ నాటి ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని నేతలు ఇప్పటికైనా గుర్తించి...తప్పనిసరి నిబంధన రాకున్నా...ఆస్తుల వెల్లడి తరహాలోనే స్వచ్ఛందంగానైనా తమ ఆరోగ్య వివరాలు వెల్లడిస్తే... అది గొప్ప మార్పుకు దారి తీయవచ్చు. అనారోగ్యంతో మరణిస్తే... ఒక నేత తన అనారోగ్యాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే... ఉపఎన్నిక అనివార్యమై. అది ప్రజాధనం వృధాకి కారణం అవుతుంది. నాయకులు అంటే ప్రజలకు సేవకులు అనేది అందరూ చెప్పే మాటే... అయితే ఒడిదుడుకులను ఎదుర్కొని తమకు 5ఏళ్ల పాటు సేవలు అందించే శారీరక మానసిక సామర్థ్యం నేతలకు ఉందో లేదో తెలుసుకోవడం ప్రజల హక్కు కూడా. –డా.బీఎన్‌రావు, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉంటేనే కదా...చెప్పింది చేయగలరు.. ఏ మనిషైనా ఆరోగ్యం అత్యవసరం అనేది తెలిసిందే. నేతలు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే కదా ప్రజలు గెలిపిస్తారు. ఆరోగ్యం ఉంటేనే కదా నేతలు తాము ఇచ్చిన హామీలు అమలు చేయగలరు. కాబట్టి... నేతల ఆరోగ్య వివరాలు ప్రజల హక్కు అనేది నిర్వవాదం.. దీనిపై తాజాగా ఐఎంఎ ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ...గతంలో చేసిన ఈ డిమాండ్ ఎప్పటికీ సజీవమే అని నేను భావిస్తున్నా. –డా.గుత్తా సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు, ఐఎంఏ. -
పేపర్ లీడర్ కావాలా.. పీపుల్ లీడర్ కావాలా?
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు చేసే మంచి పనులకంటే ఎక్కువగా ఎదుటి వారిని తిట్టిన వార్తలకే మీడియాలో ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేపర్ లీడర్ కావాలో, సరైన పీపుల్ లీడర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆలోచించాలని చెప్పారు. స్ట్రాంగ్ లీడర్ కావాలో లేదా రాంగ్ లీడర్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, వైద్యులు తెలంగాణ భవన్‌లోకి వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయమన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఏది ఆచరిస్తే, దేశం అది అనుసరిస్తుందనే వారని, ఇప్పుడు ఆ మాటను తెలంగాణ తిరగరాసిందని చెప్పారు. ‘24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరోటి లేదు. అందుకే స్ట్రాంగ్ లీడర్ చేతిలో రాష్ట్రం ఉండాలి, రాంగ్ లీడర్ చేతిలో పెట్టొద్దు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు అందరం కలిసి కృషి చేద్దాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ వాడొద్దు!
కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్రం గణాంకాలను సేకరించింది. దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్‌ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్‌ఫ్లూయెంజా A సబ్టైప్ H3N2 వైరస్.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఆస్పత్రి పాలుజేస్తుంది. కానీ, ఏమాత్రం ప్రాణాంతకం కాదు. గత రెండు రెండు, మూడు నెలలుగా దేశంలో కేసులు అధికంగా నమోదు కావడానికి కారణం కూడా ఇదేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ► ఈ వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం.. లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ► ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి(అందుకే కరోనా అని కంగారు పడిపోతున్నారు). పేషెంట్లు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ► వాయు కాలుష్యం కూడా ఇది త్వరగతిన వ్యాపించడానికి ఒక కారణం. ► ఇదేం ప్రాణాంతకం కాదు. కానీ, ఆస్పత్రి పాలుజేస్తుంది. కొందరిలో మాత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపెడుతుంది. ► ఐసీఎంఆర్‌తో పాటు ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఆర్) కూడా పలు కీలక సూచనలు చేస్తోంది. ► మరోవైపు, దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను హెచ్చరిస్తోంది. ► యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణాలకు ఆధారంగా చికిత్సను అందించాలని, మందులను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. ► కరోనా సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను జనాలు ఇష్టానుసారం వాడారు. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియల్ అవునా? కాదా? అని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం.. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. కానీ, సంబంధిత వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ విషయంలో.. Influenza A subtype H3N2 is the major cause of current respiratory illness. ICMR-DHR established pan respiratory virus surveillance across 30 VRDLs. Surveillance dashboard is accessible at https://t.co/Rx3eKefgFf@mansukhmandviya @DrBharatippawar @MoHFW_INDIA @DeptHealthRes pic.twitter.com/3ciCgsxFh0 — ICMR (@ICMRDELHI) March 3, 2023 Fever cases on rise - Avoid Antibiotics pic.twitter.com/WYvXX70iho — Indian Medical Association (@IMAIndiaOrg) March 3, 2023 -
రాందేవ్ బాబా వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా
-
అల్లోపతిపై రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హర్షవర్థన్
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి.. కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్ ఇచ్చిన వివరణ కూడా సరిపోదన్నారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్ లేఖ రాశారు. కోవిడ్ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయన్నారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే .. మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక , మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్‌దేవ్ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోండి!
న్యూఢిల్లీ : యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ యాక్షన్(ఐఎమ్ఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి మందులపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. యోగా గురుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో... యోగా గురు రామ్‌దేవ్ బాబా అల్లోపతి మందులను పనికి రాని వాటిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది. గతంలోనూ ఆయన డాక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారని, వండర్ డ్రగ్స్ విడుదల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ముందే డాక్టర్లను హంతకులన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పటికీ, రామ్‌దేవ్ ఆయన సహచరుడు బాలక్రిష్ణ జీలు అనారోగ్యం పాలైనప్పుడు అల్లోపతి వైద్యమే చేయించుకుంటున్నారని తెలిపింది. తప్పుడు, నిరాధార ఆరోపణలు, ప్రకటనలు చేస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ‘‘ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్’’ కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని, విచారణకు ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య శాఖను డిమాండ్చేసింది. చదవండి : పిచ్చి పీక్స్ అంటే ఇదే.. స్వీటు కోసం 200కి.మీ.. నెగిటివ్ రిపోర్టు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ -
కరోనాతో 196 మంది వైద్యులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 196మంది డాక్టర్లు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) శనివారం ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది జనరల్ ప్రాక్టీషనర్లు ఉన్నారని తెలిపింది. (చదవండి : ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి పాజిటివ్) ప్రతిరోజూ వైద్యులు వ్యాధి బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఐఎంఏ వెల్లడించింది. వైద్యుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఎంఏ లేఖ రాసింది. అన్ని రంగాలలోని వైద్యులతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఏపీ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం
-
ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు
సాక్షి, అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 1,088 అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేశవ్యాప్తంగా అనేకమంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టిన ఏపీ ప్రభుత్వ చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘1088 అంబులెన్స్‌లను ప్రారంభించడం స్వాగతించాల్సిన విషయం. ఏపీకి గొప్ప చరిత్ర ఉంది. వైద్యుల పరిరక్షణ కోసం బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటిని పరీక్షించడం, రోగుల వైద్య చరిత్రను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఐఎంఏ సిద్దంగా ఉందని’ తెలిపారు. పబ్లిక్ హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలని, అవసరమైతే ఈ విషయంలో ప్రైవేట్ సెక్టార్‌తో కలిసి పనిచేయాలని డాక్టర్ రాజన్ శర్మ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. (కంగ్రాట్స్ సీఎం సార్) -
పోంజి స్కామ్.. కర్ణాటకలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని పలువు రు సీనియర్ అధికారుల నివాసాలు, కార్యాల యాలపై సీబీఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఐఎమ్ఏ (ఐ–మానిటరీ అడ్వైజరీ) పోంజి స్కామ్‌తో సంబంధం ఉన్న అధికారుల ఇళ్లపై సోదాలు జరిపింది. బెంగళూరులోని 11 ప్రాంతాలు, మాండ్య, రామనగరా, బెల్గాంలలో ఒక్కో ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోదాలు నిర్వహించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్లో ఎకనామిక్స్ అఫెన్సెస్ విభాగం ఐజీ హేమంత్ నింబాల్కర్, డీఎస్పీ ఈబీ శ్రీధర, ఈస్ట్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ హిలోరీ సహా పలువురు అధికారుల నివాసాలపై సీబీఐ శుక్రవారం సోదాలు జరిపింది. -
‘హీరా’ టు ‘ఐఎంఏ’
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు కేంద్రంగా చోటు చేసుకుని దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన పోజీ స్కామ్ ఐ మానిటరీ అడ్వైజరీకి (ఐఎంఏ) మూలం హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌గా తెలుస్తోంది. నౌహీరా షేక్‌కు చెందిన ఈ సంస్థల్లో కొన్నాళ్ళు పని చేసిన మన్సూర్ఖాన్ బెంగళూరు వెళ్లి సొంతంగా ఐఎంఏను ప్రారంభించినట్లు సమాచారం. ఇతడి విషవృక్షం విస్తరించడంలో అక్కడి రాజకీయ నాయకులు, మత గురువుల పాత్ర సైతం ఉందని బాధితుడు, రిటైర్డ్ గెజిటెడ్ లెక్చరర్ ఎం.మహబూబ్ బాష ‘సాక్షి’కి తెలిపారు. నగరానికి సంబంధించి ఆరుగురు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముగ్గురు బాధితులకు బుధవారం నోటీసులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన మన్సూర్ ఖాన్ కొన్నాళ్లు నగరంలో నివసించాడు. అప్పట్లో మాసబ్‌ట్యాంక్‌లోని హీరా గ్రూప్ కార్యాలయంలో కన్సల్టెంట్‌గా పని చేశాడు. పోజీ స్కామ్స్ నిర్వహణలో ఉండే లోటుపాట్లను తెలుసుకున్న మన్సూర్ ఆపై తన మకాంను బెంగళూరుకు మార్చాడు. అక్కడి శివాజీనగర్‌లో ఐఎంఏ కార్యాలయాన్ని స్థాపించి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు. బంగారం వ్యాపారం చేయడంతో పాటు ప్రింటింగ్ ప్రెస్, హాస్పిటల్, మెడికల్ షాపులు, స్కూల్, అపార్ట్మెంట్స్, సూపర్మార్కెట్స్ సైతం నిర్వహించింది. వివిధ స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించింది. శివాజీనగర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, కొందరు రాజకీయ నాయకులతో పాటు మతగురువులు సైతం మన్సూర్‌కు సహకరించారని మహబూబ్‌బాష తెలిపారు. వారు చెప్పడం, బెదిరించడం తదితర చర్యల కారణంగా అనేక మంది అప్పటికే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉన్న తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకుని ఐఎంఏలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఐఎంఏ కర్ణాటక మొత్తం విస్తరించిందని, ఆపై దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వరంగల్, మెదక్, నిర్మల్‌ల్లోనూ బాధితులు ఉన్నారు. ఇప్పటికే హీరా గ్రూప్ చేసిన నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంఐఎం నేత షాబాజ్ అహ్మద్ ఖాన్ ఐఎంఏ బాధితులకూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రానికి షాబాజ్‌ను 57 మంది బాధితులు సంప్రదించారు. వీరికి అవసరమైన న్యాయసహాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని షాబాజ్ ఖాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆరుగురు బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) బుధవారం మహబూబ్ బాషతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెకు నోటీసులు జారీ చేశారు. గురువారం సీసీఎస్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు అ«ధికారి ఎదుట హాజరుకావాలని, ఐఎంఏలో పెట్టుబడులకు సంబంధించిన పూర్తి ఆధారాల అసలు ప్రతులు, గుర్తింపు కార్డులు తీసుకురావాలని అందులో కోరారు. వీరి నుంచి గురువారం వాంగ్మూలాలు సైతం నమోదు చేసే అవకాశం ఉంది. -
నగరంలో ఐఎంఏ ప్రకంపనలు
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా చోటు చేసుకుని దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఐ మానిటరీ అడ్వైజరీ (ఐఎంఏ) పోజీ స్కామ్ ప్రకంపనలు సిటీలోనూ వెలుగు చూశాయి. వివిధ స్కీముల పేరుతో దాదాపు రూ.4 వేల కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుందే. ఇదే రోజు ఆరుగురు బాధితుల ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఓ కేసు నమోదైంది. ఈ బాధితులు ఐఎంఏ గోల్డ్ స్కీమ్‌లో రూ.48 లక్షల మేర పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పోలీసులు చెప్తున్నారు. కర్నూలుకు చెందిన మహ్మద్ మక్సూద్ అహ్మద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసి గెజిటెడ్ హోదాలో ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం నగరంలోని సైదాబాద్‌లో నివసిస్తున్న ఈయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ఏడాది జూన్‌లో అందాయి. అదే సమయంలో తన పాత స్టూడెంట్స్‌ను కలవడానికి భార్యతో కలిసి బెంగళూరు వెళ్ళిన ఈయనకు ఐఎంఏ సంస్థ లావాదేవీల విషయం తెలిసింది. ఆ సంస్థ బంగారం వ్యాపారం చేయడంతో పాటు ప్రింటింగ్ ప్రెస్, హాస్పిటల్, మెడికల్ షాపులు, స్కూల్, అపార్ట్మెంట్స్, సూపర్మార్కెట్స్ సైతం నిర్విహిస్తోందని, వివిధ స్కీముల్లో డిపాజిట్లు సేకరించి తన 17 సంస్థల్లో పెట్టుబడులు పెడుతోందని తెలుసుకున్నారు. దీంతో అక్కడి శివాజీనగర్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్ళి ఆరా తీశారు. అందులో ఉన్న హంగు ఆర్భాటాలతో పాటు సిబ్బంది ప్రవర్తన, మాట తీరు ఎంతో ఆకట్టుకున్నాయి. తమ పూర్తి స్థాయి చట్టబద్దత ఉన్న సంస్థగా చెప్పిన ఐఎంఏ ఉద్యోగులు డిపాజిట్లుగా స్వీకరించిన మొత్తంతో లండన్ నుంచి బంగారం దిగుమతి చేసుకుంటామని ఆయనతో పేర్కొన్నారు. దీన్ని ఆభరణాలుగా మార్చి దేశంలోని వివిధ నగరాల్లో విక్రయిస్తామని, తాము తయారు చేసే గాజులకు కోల్‌కతాలో, నగలకు సూరత్‌లో ఇతర వస్తువులకు ముంబై తదితర చోట్ల మంచి డిమాండ్ ఉందంటూ వివరించారు. ఈ వ్యాపారంలో తమ సంస్థకు నెలకు 20 శాతం లాభం వస్తుందని, అందులో నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు తదితరాలు పోను పెట్టుబడిదారులకు 3 నుంచి 4 శాతం లాభం పంచుతామని నమ్మబలికారు. ఐఎంఏ సంస్థల్లో మొత్తం 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, మీ లాంటి వాళ్ళు డిపాజిట్ చేస్తేనే వాళ్ళు బతకడంతో పాటు ఇతర స్వచ్చంద కార్యక్రమాలు నడుస్తాయంటూ నమ్మించారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో మహ్మద్ మక్సూద్ అహ్మద్ రూ.10.51 లక్షలు, ఆయన భార్య రూ.12.51 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఐఎంఏ సంస్థ వీరి నుంచి నగదు కాకుండా చెక్కుల రూపంలోనే తీసుకోవడంతో మరింత నమ్మకం కలిగింది. ఐఎంఏ వీరికి పాస్‌పుస్తకాలు, బాండ్లు తదిరాలు జారీ చేసి వీరి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంది. కచ్చితంగా ప్రతి నెలా ఒకటో తారీకున వీరిద్దరి బ్యాంకు ఖాతాల్లోకి ఐఎంఏ నుంచి పెట్టుబడికి సంబంధించిన లాభం బదిలీ అయ్యేది. దీంతో వీరికి పూర్తి నమ్మకం కలిగి తమ కుమార్తె, కుమారుల్ని ప్రోత్సహించి వారితోనే పెట్టుబడులు పెట్టించారు. ఇలా వీరి కుటుంబమే మొత్తం రూ.38.5 లక్షలు పెట్టుబడిగా పెట్టగా... వీరికి పరిచయస్తుడైన సికింద్రాబాద్‌కు చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి గులాం గౌస్ మరో రూ.9.51 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. బెంగళూరులో ఐఎంఏపై కేసు నమోదు కావడంతో వీరంతా పునరాలోచించుకున్నారు. ఈలోపు దుబాయ్‌కి పారిపోయిన దాని నిర్వాహకుడు, ప్రధాన సూత్రధారి మన్సూర్ ఖాన్‌తో పాటు 22 మందిని బెంగళూరుకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. దీంతో మహ్మద్ మక్సూద్ అహ్మద్ కుటుంబ సభ్యులు, గౌస్ ఇటీవల హీరా గ్రూప్ విక్టిమ్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంఐఎం నేత షాబాజ్ అహ్మద్ ఖాన్‌ను సంప్రదించారు. ఆయన సూచనల మేరకు బాధితులు సీపీ అంజనీకుమార్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. కొత్వాల్ సిఫార్సుతో మంగళవారం సీసీఎస్ పోలీసులు ఐఎంఏపై కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన మరో 12 మంది బాధితులు సైతం పోలీసులకు ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఐఎంఏ సూత్రధారి మన్సూర్ ఖాన్ సహా మిగిలిన నిందితుల్ని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న మహ్మద్ మక్సూద్ అహ్మద్ 2012–13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇంటర్మీడియట్ హిందీ పాఠ్యపుస్తకం రాసిన బృందంలో ఒకరు. -
స్విమ్మింగ్ పూల్ కింద 300 కిలోల గోల్డ్!
సాక్షి, బెంగళూరు: ఓ స్విమ్మింగ్ పూల్ కింద దాచి ఉంచిన 300 కేజీల నకిలీ బంగారు కడ్డీలను ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు బుధవారం బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. వేల కోట్ల విలువైన ఐఎంఏ గ్రూప్ పోంజీ స్కామ్ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఐఎంఏ గ్రూప్ అధిపతి మొహమ్మద్ మన్సూర్ ఖాన్‌కు చెందిన బెంగళూరులోని ఓ భవంతి ఆరో అంతస్తులో డీసీపీ గిరీశ్ ఆధ్వర్యంలో సిట్ సోదాలు నిర్వహించింది. అక్కడ గల స్విమ్మింగ్‌పూల్ కింద గతంలో మన్సూర్ దాచిన 5,880 నకిలీ బంగారం కడ్డీలను సిట్ స్వాధీనం చేసుకుంది. తన గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టండంటూ ఈ నకిలీ బంగారం కడ్డీలు చూపించి ఇన్వెస్టర్లను మన్సూర్ మోసం చేసేవాడని సిట్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఐ మానిజటరీ అడ్వైజరీకి చెందిన దాదాపు రూ. 209 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొంది. సుమారు 40 వేల మంది డిపాజిట్‌దారులకు వంచించిన మన్సూర్ ఖాన్‌కు చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ.197 కోట్ల స్థిరాస్తి, రూ.12 కోట్లు నగదు ఉన్నట్లు పత్రికా ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మన్సూర్ ఖాన్‌కు వ్యవతిరేకంగా బ్లూకార్నర్ నోటీస్ జారీచేశారు. ఇటీవల మన్సూర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఇంటర్ పోల్‌కు ప్రతిపాదన సమర్పించింది. వేలాదికోట్ల వంచన కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర గత ప్రభుత్వం ఎలాగైనా డబ్బు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. ఇదే సందర్భంలో ఐఎంఏ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో విదేశీ లావాదేవీలు కూడా జరిగిందన్న అంశాన్ని కనుగొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మన్సూర్ భారత్‌కు వచ్చేస్తానంటూ మరో వీడియో విడుదల చేశాడు. ఇందులో భాగంగా దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయనను ఎయిర్‌పోర్టులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు ఇటీవల సిట్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది. దుబాయ్‌లో తలదాచుకున్న మన్సూర్ భారత్‌కి వచ్చి, కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పించినట్లు సిట్ అధికారులు తెలిపారు. -
వందల కోట్లు లంచంగా ఇచ్చా
యశవంతపుర (బెంగళూరు): కర్ణాటకలో ముఖ్యమైన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులకు రూ. 400 కోట్లను లంచంగా ఇచ్చానని ఐఎంఏ జ్యువెల్స్ సంస్థ యజమాని మహ్మద్ మన్సూర్ ఖాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడించినట్లు సమాచారం. రూ. 4 వేల కోట్ల డిపాజిట్లను మన్సూర్ ఖాన్ ప్రజల నుంచి సేకరించి మోసం చేయడం తెలిసిందే. ఈ కేసులో మన్సూర్‌ను ఈడీ శనివారం కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో పలువురు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో తాము ఇరుక్కుపోతామా? అని భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఒక ఐఏఎస్ అధికారిని సిట్ ఇప్పటికే అరెస్టు చేసింది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను విచారించింది. కాగా, ఛాతిలో నొప్పి రావడంతో మన్సూర్ ఖాన్‌ను ఆదివారం రాత్రి సర్ జయదేవ ఆస్పత్రికి తరలించారు. దుబాయ్ నుంచి వచ్చిన మన్సూర్ ఖాన్‌ను శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. జూలై 23 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. (చదవండి: జువెల్లరీ గ్రూప్ యజమాని రూ. 209 కోట్ల ఆస్తి జప్తు!) -
ఐఎంఏ జ్యువెల్స్ అధినేత అరెస్టు
సాక్షి, బెంగళూరు: రూ. వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఐఎంఏ జ్యువెల్లరీ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్ అరెస్టయ్యారు. దుబాయ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న ఆయనను ఎయిర్‌పోర్టులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు సిట్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది. దుబాయ్‌లో తలదాచుకున్న మన్సూర్ భారత్‌కి వచ్చి, కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పించినట్లు సిట్ అధికారులు తెలిపారు. అధిక వడ్డీలు ఇస్తామనీ, తమ కంపెన్లీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఐఎంఏ గ్రూప్ ద్వారా దాదాపు లక్ష మంది నుంచి మొత్తంగా రూ. 4,084 కోట్లను మన్సూర్ వసూలు చేశాడు. తర్వాత తాను తీవ్రంగా నష్టపోయాననీ, ఆత్మహత్యే శరణ్యమని ఒక ఆడియో టేప్‌ను జూన్ మొదటివారంలో విడుదల చేసి అదృశ్యమయ్యారు. (చదవండి : ‘ఇండియా వదిలి వెళ్లడమే నా పెద్ద తప్పు’) -
‘నేను పెద్ద తప్పు చేశా.. ఇండియాకు వచ్చేస్తున్నా’
బెంగళూరు : దేశం నుంచి వెళ్లిపోయి తాను పెద్ద తప్పు చేశానని ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్ యజమాని మహమ్మద్ మన్సుర్ ఖాన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 24 గంటల్లో స్వదేశానికి తిరిగి వస్తానని అయితే తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులకు విఙ్ఞప్తి చేశాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేశాడు. అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మందిని మోసగించిన మన్సుర్ ఖాన్.. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..‘ దేవుడి అభీష్టం మేరకు 24 గంటల్లో నేను ఇండియాకు తిరిగి వస్తాను. ఈ కేసులో చట్టబద్ధంగా పోరాడుతా. కనీసం నాకు లాయర్ కూడా లేడు. అయితే భారత న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. భారత్‌ను వదిలిపెట్టి రావడమే నేను చేసిన పెద్ద తప్పు. కానీ ఆ పరిస్థితుల్లో అంతకంటే మంచి మార్గం కనిపించలేదు. ప్రస్తుతం నా కుటుంబం ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. రెండు రోజుల క్రితమే బెంగళూరు వద్దామనుకున్నా. కానీ ఆరోగ్యం సహకరించలేదు’ అని వీడియోలో పేర్కొన్నాడు. కాగా అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఐ మానిజటరీ అడ్వైజరీకి చెందిన దాదాపు రూ. 209 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొంది. సుమారు 40 వేల మంది డిపాజిట్‌దారులకు వంచించిన మన్సూర్ ఖాన్‌కు చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ.197 కోట్ల స్థిరాస్తి, రూ.12 కోట్లు నగదు ఉన్నట్లు పత్రికా ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు. ఇక ఐఎంఏ వంచన కేసులో తలదాచుకున్న మన్సూర్ ఖాన్ వ్యవతిరేకంగా బ్లూకార్నర్ నోటీస్ జారీచేశారు. ఇటీవల మన్సూర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఇంటర్ పోల్‌కు ప్రతిపాదన సమర్పించింది. వేలాకోట్ల వంచన కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా డబ్బు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును ఎస్ఐటీకి అప్పగించింది. ఇదే సందర్భంలో ఐఎంఏ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో విదేశీ లావాదేవీలు కూడా జరిగిందన్న అంశాన్ని కనుగొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మన్సూర్ భారత్‌కు వచ్చేస్తానంటూ వీడియో విడుదల చేయడంతో ఈ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేసిన మన్సూర్ తిరిగి రావడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే అంశం చర్చనీయాంశమైంది. -
కలెక్టర్‌కు కటకటాలు
బెంగళూరు: వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి బోర్డుతిప్పేసిన బెంగళూరు ఐఎంఏ గ్రూప్ కుంభకోణంలో మరో సంచలనం నమోదైంది. రూ.1.5 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ బీఎం. విజయ్‌శంకర్‌ను అరెస్టు చేసిన సిట్ పోలీసులు మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం మళ్లీ ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనుకూల నివేదిక ఇవ్వడానికి ముడుపులు సిట్ అభియోగాల ప్రకారం... 2016 చివర్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఐఎంఏ కంపెనీ నిర్వహించిన కోట్లాది రూపాయల వ్యవహారాలపై భారతీయ రిజర్వు బ్యాంక్‌కు అనుమానం రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేపీఐడీ చట్టం ప్రకారం విచారణ చేపట్టాలని బెంగళూరు ఉత్తర ఉపవిభాగాధికారికి సూచించింది. కానీ ఆ విచారణను జిల్లా కలెక్టర్ విజయ్‌శంకర్, ఉపవిభాగాధికారి ఎల్సీ.నాగరాజుతో కలిసి చేపట్టారు. ఐఎంఏ కంపెనీ డైరెక్టర్ నిజాముద్దీన్ రెవిన్యూ భవన్లో కలెక్టర్ విజయ్‌శంకర్ ను కలిసి ఐఎంఏ కంపెనీకి అనుకూలంగా ఆర్బీఐకి నివేదిక పంపితే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టాడు. ఇందుకు కలెక్టర్ రూ.2 కోట్లు లంచానికి డిమాండ్ పెట్టారు. చివరికి ఇరువురి మధ్య రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బుతో భూముల కొనుగోలు నిజాముద్దీన్ ఒకటిన్నర కోటి నగదును విజయ్‌శంకర్ సూచనల మేరకు ఆర్వీ.రోడ్డులోని బిల్డర్ కృష్ణమూర్తికి చేర్చాడు. ఈ డబ్బు ఐఎంఏ కంపెనీకి చెందినదని బిల్డర్ కృష్ణమూర్తి కి తెలియదు. కొద్దిరోజుల అనంతరం ఆ బిల్డర్‌కు మరో రూ.1.5 కోట్ల ను విజయ్‌శంకర్ ముట్టజెప్పాడు. ఈ డబ్బుతో ఆ బిల్డర్ విజయ్‌శంకర్ భార్య పేరుతో జేపీ.నగర, నందికొండలో భూమిని కొనుగోలు చేశాడు. ఇక ఐఎంఏ అక్రమాలను దాచిపెట్టి, ఆ కంపెనీ అధినేత మన్సూర్ఖాన్కు అనుకూలంగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. ఈ కేసులో ఉపవిభాగాదికారి నాగరాజు కూడా ఐఎంఏ నుంచి రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల నాగరాజ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా విజయ్‌శంకర్ హస్తం ఉన్నట్లు వెలుగులోకి రావడంతో సోమవారం ఎస్ఐటీ అధికారులు ఆయనను విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏకంగా కలెక్టర్ అరెస్టులో అధికార వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. -
తల్లి లేకుండానే ఈ లోకంలోకి వచ్చారా?
అన్నిరంగాల్లో మహిళలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారు. అడుగడుగునా ఎదురవుతున్న ప్రతిబంధకాలను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ సమాన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అతివలు వడివడిగా ముందుకు సాగుతున్నారు. అయితే ప్రగతి పథాన పరుగిడుతున్న పడతులకు ప్రతిచోటా ప్రోత్సహించే పరిస్థితులు కనబడటం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో జీర్ణించుకుపోయిన పురుషాంహకారం మహిళలకు ఆటంకాలు సృష్టిస్తుండటం నేటికీ ఆగలేదు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. ‘రాజ్ మెడికాన్ 2019’ సదస్సు చివరి రోజు ప్రేరణాత్మక ప్రసంగం చేసేందుకు వచ్చిన మోటివేషనల్ గురు స్వామి జ్ఞానవాత్సల్య చిటపటలాడుతూ వెళ్లిపోయారు. ఆయనగారి అసహనానికి కారణం మహిళామణులు. స్వాములోరు అక్కడకు రావడమే ఒక షరతు మీద వచ్చారు. ఆయన పెట్టిన నిబంధనకు నిర్వాహకులు కూడా ఒప్పుకున్నారు. జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు గురించి తెలియక తరుణీమణులంతా ‘ముందుకు’ రావడంతో ఆగ్రహించిన ఆయన అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్–సర్వీసెస్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏఆర్‌ఐఎస్‌డీఏ) సంయుక్తంగా జూన్ 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు 26వ ‘రాజ్ మెడికాన్ 2019’ సదస్సును నిర్వహించాయి. నేటి సమాజంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపాలన్న లక్ష్యంతో జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో ఈ సదస్సును జరిపారు. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా స్వామి జ్ఞానవాత్సల్య ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రసంగించేందుకు ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన ఆయన.. ముందు వరుసలో మహిళలు కూర్చొని ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆడిటోరియంలోని ముందు వరుసల్లో మహిళలు కూర్చోవడానికి వీల్లేదని కార్యక్రమం ప్రారంభం కావడానికే ముందే నిర్వాహకులకు ఆయన హుకుం జారీచేశారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా జరగడంతో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. ముందు ఏడు.. తర్వాత మూడు ‘‘స్వామి జ్ఞానవాత్సల్య ప్రేరణాత్మక మాటలు వినేందుకు చాలామంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చుకున్నారు. మహిళలు మొదటి ఏడు వరుసల్లో కూర్చోరాదని హఠాత్తుగా నిర్వాహకులు ప్రకటన చేశారు. మొదటి మూడు వదిలిపెట్టి నాలుగో వరుస నుంచి వనితలు కూర్చోవాలని తర్వాత మరోసారి ప్రకటించారు. ఈ గందరగోళం ఏంటని నిర్వాహకులను మహిళా వైద్యులు అడగ్గా.. ఇది స్వామి జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు అని సమాధానమిచ్చారు. ‘‘పోనీలే పెద్దాయన ప్రసంగం బాగా చేస్తాడు కదా అని ఆయన పెట్టిన నిబంధనకు అంగీకరించేందుకు మేమంతా సిద్ధమయ్యాం. డిమాండ్లు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రసంగం చేయకుండా జ్ఞానవాత్సల్య వెళ్లిపోయారు!’’ అని ఆయన నిర్వాకాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన డాక్టర్ రీతు చౌదరి వివరించారు. మహిళలు ముందు వరుసలో ఆసీనులయ్యారన్న అసహనంతోనే జ్ఞానవాత్సల్య ప్రసగించకుండానే వెనుదిరిగారని ఏఆర్‌ఐఎస్‌డీఏ ప్రతినిధి డాక్టర్ అజయ్ చౌదరి ధ్రువీకరించారు. మా జోలికి రాకండి స్వామి జ్ఞానవాత్సల్య పురుషాధిక్య వైఖరిపై మహిళా వైద్యులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తాము ముందు కూర్చున్నామన్న ఒకే ఒక్క కారణంతో ఆయన వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. అందరికీ సుద్దులు బోధించే స్వామిజీలు కూడా ఆడవాళ్లను చులకనగా చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని నిరసించారు. ‘‘మహిళలపై వివక్షను ఒప్పుకోబోము’’ అన్నారు అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, లిబరేషన్ మాస పత్రిక సంపాదకురాలు కవితా కృష్ణన్. ‘‘స్త్రీలను ద్వేషించే ఇటువంటి ఆజ్ఞలు సైన్స్, మెడికల్ రంగంలోనే కాదు ఎక్కడా అనుమతించం. తాము 19వ శతాబ్దంలోనే ఉన్నట్టే ఉంటామని ఎవరైనా అంటే అటువంటి వారిని అలాగే ఉండిపొమ్మంటాం. కానీ మహిళలను ఇందులోకి లాక్కండి. వివక్షకు గురిచేసే ఆదిమ కాలం నాటి భావజాలాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక వనితలు ఉండరు. వైద్య, సాంకేతిక రంగాలకే కాదు అన్నిటికీ ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి’’ అని కవితా కృష్ణన్ గళమెత్తారు. వివక్ష తగునా..? స్వామి జ్ఞానవాత్సల్య వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను వివక్షకు గురిచేయకుండా స్వామికి సెల్ఫ్ మోటివేషన్ అవసరమని, చేసుకోవాలని చురకలు అంటించారు. ఇటువంటి వారు చెప్పే ప్రబోధాలను బహిష్కరించాల్సిన అవసరముందన్నారు. విద్యాధికులైన డాక్టర్లే ఇటువంటి వివక్షను ఎదిరించకపోతే వారి కంటే నిరక్షరాస్యులే నయమనిపిస్తారని నినదించారు. ఇలాంటి స్వాములు చెప్పే హితవచనాల కన్నా తాము చేసే సేవలే అమూల్యమైనవని డాక్టర్లు గుర్తించాలని సూచించారు. ఇరుకు మనస్తత్వం కలిగిన ఇలాంటి స్వాములు మహిళలకు జీవనగమ్యాలను నిర్దేశిస్తామనడం గర్హనీయమని కుండబద్దలు కొట్టారు. ‘తల్లి లేకుండానే ఆయన ఈ లోకంలోకి వచ్చారా?’ అని ట్విటర్లో ఓ మహిళ ఘాటుగా ప్రశ్నించారు. స్త్రీల పట్ల వివక్ష భావన కలిగిన ఇటువంటి వ్యక్తిని వైద్యులు తమ సదస్సుకు ఆహ్వానించకుండా ఉంటే బాగుండేదని మరొకరు అభిప్రాయపడ్డారు.ఈ మొత్తం వ్యవహారంపై స్వామి జ్ఞానవాత్సల్య ఇప్పటివరకు స్పందించలేదు. – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
రూ. 400 కోట్లు లంచమిచ్చా; రూ. 209 కోట్ల ఆస్తి జప్తు!
సాక్షి, బెంగళూరు : అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మందిని మోసగించి.. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్ యజమాని మహమ్మద్ మన్సుర్ ఖాన్‌కు చెందిన రూ.209 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం స్వాధీనం చేసుకొంది. దీనిద్వారా ఐఎంఏ వంచన కేసులో ఈడీ అధికారికంగా రంగ ప్రవేశం చేసింది. బోగస్ లావాదేవీలు, హవాలా కార్యకలాపాలు చేపట్టినట్లు తెలియడంతో అధికారులు ఐఎంఏ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 40 వేల మంది డిపాజిట్‌దారులకు వంచించిన మన్సూర్ ఖాన్‌కు చెందిన రూ.209 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ.197 కోట్ల స్థిరాస్తి, రూ.12 కోట్లు నగదు ఉన్నట్లు పత్రికా ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బెంగళూరు, దావణగెరె, కల్బుర్గి, మైసూరు, కేరళ, న్యూఢిల్లీతో పాటు దేశంలో ఐఎంఏ శాఖలకు చెందిన నగదు, బంగారు, వజ్రాలు, భవనాలు, ఇళ్లు, సంబంధించిన బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లతో పాటు మహమ్మద్ మన్సూర్ ఖాన్ పేరులో ఉన్న 130 బ్యాంకు ఖాతాలతో పాటు ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఐఎంఏ వంచన కేసులో తలదాచుకున్న మన్సూర్ ఖాన్ వ్యవతిరేకంగా బ్లూకార్నర్ నోటీస్ జారీచేశారు. ఇటీవల మన్సూర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఇంటర్ పోల్‌కు ప్రతిపాదన సమర్పించింది. వేలాకోట్ల వంచన కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా డబ్బు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును ఎస్ఐటీకి అప్పగించింది. ఇదే సందర్భంలో ఐఎంఏ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో విదేశీ లావాదేవీలు కూడా జరిగిందన్న అంశాన్ని కనుగొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఐఎంఏ సంస్థకు చెందిన ఏడుగురు డైరెక్టర్లను ఎస్ఐటీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు జయనగర, శివాజీనగర జ్యూవెలరీల్లో అధిక ప్రమాణంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని సమాచారాన్ని అందజేశారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకొని రెండు శాఖల అధికారులు ఈ నెల 18న జయనగర జ్యువెలరీ శాఖ, మన్సూర్ ఖాన్ మూడో మాజీ భార్య ఇంటిపై కూడా సోదాలు జరిపారు. ఈ సమయంలో జ్యూవెలరీలో రూ.13 కోట్లు విలువచేసే 43 కేజీల బంగారు, రూ.17 కోట్లు విలువచేసే 5864 క్యారెట్ డైమండ్, రూ.1.5 కోట్లు విలువచేసే 520 కేజీల వెండి, రూ.1.5 కోట్లు విలువచేసే సైల్పర్ డైమండ్ లభించింది. అలాగే భార్య ఇంట్లో రూ.39 లక్షలు విలువచేసే 1.5 కేజీల బంగారు, రూ.2.5 లక్షల నగదు లభించింది. రెండు వారాల నుంచి ఈ కేసును తనిఖీ చేస్తున్న ఎస్ఐటీ ఐఎంఏకు చెందిన ఆస్తి–పాస్తులను స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం ఈడీ కేసు తనిఖీని చేపట్టడంతో అతని ఆస్తిని స్వాధీనం చేసుకొంది. గత రెండు వారాల క్రితం రహస్య స్థలంలో ఉంటూ మన్సూర్ ఖాన్ రెండు వీడియోలు విడుదల చేశారు. ఇందులో తనకు ఎవరెవరు మోసం చేశారు. తాను ఎందుకు దేశం విడచిపెట్టి రావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. త్వరలోనే బెంగళూరుకు వస్తాను. తన సంస్థలో డిపాజిట్ చేసినవారు ఆందోళన చెందొద్దు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ తగిన భద్రత కల్పిస్తే వస్తాను. తాను భారతదేశానికి వస్తే డిపాజిట్‌దారులు తన కుటుంబాన్ని ప్రాణాలతో వదలరని ఖాన్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి : బయటపడ్డ భారీ స్కాం.. ఆందోళనలో బాధితులు ఐఎంఏ ఫార్మసీలపై కొనసాగుతున్న దాడులు ఐఎంఏ కంపెనీకి చెందిన ఫ్రంట్‌లైన్ ఫార్మసీలపై ఎస్ఐటీ శుక్రవారం కూడా దాడులు కొనసాగించింది. గురువారం రెండు సూపర్ మార్కెట్, ఫార్మసీ గోదాములపై ఎస్ఐటీ అధికారులు బృందం దాడి చేసి లక్షలాది రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకొంది. ఫార్మసీ గోదాములపై దాడిచేసి కోట్లాది రూపాయల ఔషధాలు, సౌందర్య సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఐఎంఏ వేల కోట్ల వంచన కేసుపై తనిఖీ చేపడుతున్న ఎస్ఐటీ బృందం, ఐఎంఏ సంస్థ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్‌కు చెందిన ఆస్తులను కనుగొని, శుక్రవారం కూడా ఫార్మసీలపై దాడి కొనసాగించి కీలక ఆధారాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గిరీశ్ మీడియాకు తెలిపారు -
‘రూ.400 కోట్లు లంచమిచ్చా..ఆత్మహత్యే దిక్కు’
రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన డబ్బును ఐఎంఏలో డిపాజిట్ చేశాం, మా డబ్బులు మాకు ఇప్పించండి సార్.. అని బాధితుల విలాపం. ఎవరిని కదిపినా ఇదే ఆవేదన. బెంగళూరు శివాజీనగరలోని ఐఎంఏ గ్రూప్ సుమారు వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించి బోర్డు తిప్పేయడం సంచలనాత్మకమైంది. ఐటీ సిటీ ఆర్థిక నేరాల అడ్డాగా మారుతోందనే విమర్శలకు ఊతమిస్తోంది. బెంగళూరు : ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్ మన్సూర్ ఖాన్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌తో కర్ణాటక అట్టుడికి పోతుంది. అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రోషన్ బయాగ్ వంటి వారందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని ఆత్మహత్యే శరణ్యమంటూ ఐఎంఏ గ్రూప్ అధినేత మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమయిపోయారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. దాంతో పెద్ద ఎత్తున జనాలు శివాజీనగరలోని ఆఫీసు వద్దకు చేరుకుని.. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం రూపాయి రూపాయి దాచుకున్నామని, డబ్బులు పోతే ఆత్మహత్యలే శరణ్యమని రోదించారు. ఓ వైపు వేల సంఖ్యలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చెందుతుండగా.. మరో వైపు కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వెల్లువలా వస్తున్న బాధితులు బాధితుల రద్దీని తట్టుకోవడానికి శివాజీనగరలో సంస్థ కార్యాలయంలోనే పోలీసులు ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని తెరవాల్సి వచ్చింది. పలువురు బాధితులు తమ సొమ్మును ఎలాగైనా ఇప్పించాలని గొడవకు దిగటంతో పోలీసులు వారిని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. పెద్దసంఖ్యలో బాధిత మహిళలు ఉదయం నుంచే తమ పసిబిడ్డలను ఎత్తుకొని వచ్చి సొమ్ము డిపాజిట్ చేసి మోసపోయామని, బ్యాంకులో పెట్టిన సొమ్మును తీసి వారి చేతిలో పెట్టామని వాపోయారు. కూడబెట్టుకున్న సొమ్మును కోల్పోయి తమ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిందని విలపించారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. మీ సొమ్ము మీకు లభిస్తుందని బాధితులతో చెప్పసాగారు. ఈ క్రమంలో వైద్యుడొకరు ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినపుడు అస్వస్థతకు గురై మూర్ఛపోగా, తక్షణమే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐఎంఏలో డిపాజిట్ చేసిన వందలాది మంది ఫిర్యాదులు చేయటానికి గ్రూపులు గ్రూపులుగా వస్తునే ఉన్నారు. సుమారు 3, 4 వేల మంది ఫిర్యాదులు చేశారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఖాతాల్లోకి కోట్లాది నగదు ప్రవాహం మన్సూర్ఖాన్ అదృశ్యం, డిపాజిటర్ల ఫిర్యాదుల నమోదు అయిన తరువాత కూడా సోమవారం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు నగదు ఐఎంఏ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు కమర్షియల్ స్ట్రీట్ పోలీసుల తనిఖీల్లో తెలిసింది. ఈ కేసులో సుమారు 10 మందికి పైగా బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బ్యాంకు లావాదేవీల పరిశీలన సందర్భంలో మన్సూర్, డైరెక్టర్లు, ఐఎంఏ ఖాతాకు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కోట్లాది రూపాయాలు వినియోగదారులు డిపాజిట్ చేసినట్లు వెల్లడైంది. స్కాం నేపథ్యంలో మేల్కొన్న పోలీసులు ఐఎంఏ ఖాతాలను సీజ్ చేసి, ఎవరూ డిపాజిట్ చేయరాదని ప్రజలకు విన్నవించారు. ఆన్లైన్లో సొమ్ము సేకరించేవారి గురించి పోలీసులు సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. వెనుక ఎవరున్నా విచారణ జరపాలి ఐఎంఏ జ్యువెల్స్ యజమాని అదృశ్య కేసుకు సంబంధించి దీని వెనుక ఎవరున్నా తగిన తనిఖీ జరుపాలని, ప్రభావం కలిగిన రాజకీయ నాయకులున్నా కూడా క్షమించరాదని వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. ఈ విషయమై హోమ్ మంత్రి ఎంబీ పాటిల్‌ను కలుసుకున్న తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇదొక అతిపెద్ద వంచన కేసని అన్నారు. దీనిపై సిట్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు జరుపాలని విన్నవించినట్లు తెలిపారు. ఐఎంఏ జ్యూవెల్స్ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్‌కు చెందిన నగలను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిపాజిటర్లకు సొమ్మును ఇప్పించాలని హోంమంత్రిని కోరానని తెలిపారు. – మంత్రి జమీర్ అహ్మద్ డైరెక్టర్ల కోసం గాలింపు ఐఎంఏ కంపెనీకి చెందిన నలుగురు డైరెక్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మన్సూర్ ఖాన్ గత గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నలుగురు డైరెక్టర్లు పాల్గొన్న విషయాన్ని పోలీసులు సేకరించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో ఏయే సంగతులను చర్చించారనేది ఆరా తీస్తున్నారు. సమావేశం తరువాత డైరెక్టర్ల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మన్సూర్ ఎక్కడ దాక్కున్నాడనేది డైరెక్టర్లకు తెలిసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. కేసును సెంట్రల్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించినట్లు తెలిపారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో బీజేపీ.. కుమారస్వామి, ఐఎంఏ కంపెనీ అధినేత మన్సూర్ ఖాన్ కలిసి ఉన్న ఫోటోలను ట్విట్ర్లో షేర్ చేసింది. దాంతో పాటు ఈ మోసగాడు మీకు చాలా కాలం నుంచి తెలుసు. ఇప్పుడతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా బాధితుల మాదిరి విలపిస్తే ఫలితం ఉండదంటూ విమర్శించింది.