
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 196మంది డాక్టర్లు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) శనివారం ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది జనరల్ ప్రాక్టీషనర్లు ఉన్నారని తెలిపింది.
(చదవండి : ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి పాజిటివ్)
ప్రతిరోజూ వైద్యులు వ్యాధి బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఐఎంఏ వెల్లడించింది. వైద్యుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఎంఏ లేఖ రాసింది. అన్ని రంగాలలోని వైద్యులతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment