
న్యూఢిల్లీ : యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ యాక్షన్(ఐఎమ్‌ఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి మందులపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. యోగా గురుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో... యోగా గురు రామ్‌దేవ్ బాబా అల్లోపతి మందులను పనికి రాని వాటిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది. గతంలోనూ ఆయన డాక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారని, వండర్ డ్రగ్స్ విడుదల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ముందే డాక్టర్లను హంతకులన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏది ఏమైనప్పటికీ, రామ్‌దేవ్ ఆయన సహచరుడు బాలక్రిష్ణ జీలు అనారోగ్యం పాలైనప్పుడు అల్లోపతి వైద్యమే చేయించుకుంటున్నారని తెలిపింది. తప్పుడు, నిరాధార ఆరోపణలు, ప్రకటనలు చేస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ‘‘ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్’’ కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని, విచారణకు ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య శాఖను డిమాండ్‌చేసింది.
Comments
Please login to add a commentAdd a comment