
కర్ణాటక, బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో సామాన్య ప్రజల వద్ద వందల కోట్ల రూపాయలతో ఉడాయించిన ప్రముఖ జువెలరీ అధినేత, ఐఎంఏ సంస్థ యజమాని మన్సూర్‌తో సీఎం కుమారస్వామి కలిసి భోజనం చేస్తున్న ఫొటోను బీజేపీ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘నేను తింటున్నాను... నీవు తిను’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. మన్సూర్ లాంటి మోసగాడు ఇక్కడ ప్రజలను మోసగించి పరారయ్యాడు అంటూ బీజేపీ తన ట్విటర్‌లో ట్వీట్ చేసింది. దీనికి సమాధానంగా సీఎం కుమారస్వామి ఇలా పాత ఫొటోను పెట్టుకుని ప్రజలను తప్పుదా రి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలా చేయడం బాధ కలిగించదని ట్విటర్‌లో పేర్కొన్నారు.బీజేపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయం చేయడం మంచిది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment