ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రవికృష్ణ
Published Mon, Nov 21 2016 11:24 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
నంద్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రవికృష్ణ ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సోమవారం రాష్ట్ర శాఖ ఎన్నికలు నిర్వహించారు. డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ నంద్యాల విభాగం కార్యదర్శి, అధ్యక్షుడిగా పని చేశారు. ఈ ఏడాది సంయుక్త కార్యదర్శిగా.. వచ్చే ఏడాది ఉపాధ్యక్షుడిగా ఆయనను ఏగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఐఎంఏ కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ విజయభాస్కరరెడ్డిని రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, డాక్టర్ అనిల్‌కుమార్‌ని వచ్చే ఏడాది సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement