తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం.
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం.
ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment