సోలో లైఫే సో బెటరూ.. అన్నట్లుగా సోలో ట్రిప్పే సో బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మన వ్యక్తిగత వృద్ధికి, మంచి సంబంధాలను నెరపడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. పెళ్లైనా..అప్పుడప్పుడూ సోలోగా ట్రావెల్ చేస్తే..మనస్సుకు ఒక విధమైన రిఫ్రెష్‌నెస్ వస్తుందట. అంతేగాదు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కుటుంబంతో వెళ్తేనే కదా ఆనందం! మరి ఇలా ఎలా? అనే కదా..!
నిజానికి పెళ్లయ్యాక ఒంటరిగా జర్నీ అంటే..సమాజం ఒక విధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇలా సోలో ట్రిప్ చేసే అవకాశం కాదు కదా..ఆ ఆలోచనకే తిట్టిపోస్తారు పెద్దవాళ్లు. కానీ ప్రస్తుత యూత్‌లో ఆ ధోరణి మారింది. పెళ్లైనా..మహిళలు/ పురుషులు సోలోగా ట్రిప్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మానసికి నిపుణులు కూడా దీనికే మద్దతిస్తున్నారు. ఇదే మంచిదని నొక్కి చెబుతున్నారు.
ఎందుకు మంచిదంటే..
కుటుంబ సమేతంగానే ఇంట్లో ట్రావెల్‌ని ప్లాన్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరింత జోష్‌ఫుల్‌గా ఉంటామని మాననసిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ.. కుటుంబం, పిల్లలు బాధ్యతలతో తలామునకలైపోయి ఉంటాం. మన వ్యక్తిగత అభిరుచిలు, ఇష్టాలు తెలిసి తెలియకుండానే పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్నపాటి జర్నీ మనకు నచ్చినట్లుగా ఉండేలా ట్రావెల్ చేయడం మంచిదట.
కుటుంబ సమేతంగా వెళ్లినప్పుడు బడ్జెట్ అనుసారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆయా పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తాం. వాళ్ల రక్షణ బాధ్యత కూమా మీదే అవుతుంది. ఈ టెన్షన్‌ల నడుమ పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమైనా..అది కూడా ఓ ఆనందం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఫలానా ట్రిప్‌కి తీసుకెళ్లి ఈ మంచి ఫీల్ ఇచ్చాననే ఆనందం మాటలకందనిది.
అయితే వ్యక్తిగతంగా అప్పడప్పుడూ సోలోగా టూర్‌కి వెళ్లడం చాలా మంచిదట. దీనివల్ల తమను తాము అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. స్వీయ ఆనందం పొందేందుకు వీలుపడుతుంది. అలాగే ఒక విధమైన స్వేచ్ఛ లభించనట్లుగా ఉంటుంది. దీంతోపాటు స్వీయ సంరక్షణ గురించి కూడా తెలుస్తుంది.
కలిగే ప్రయోజనాలు..
సోలో పర్యటన వల్ల మానసిక ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది.
అదికూడా వ్యక్తిగతంగా ఒక మంచి స్పేస్ దొరికనట్లు అనిపిస్తుంది.
అలాగే భాగస్వామి నమ్మకాన్ని బలపరుస్తుంది.
వ్యక్తిగత ఆనందాలను, అభిరుచులను గౌరవించుకోవడం వల్ల భద్రతగా ఉన్నామనే ఫీల్ భార్యభర్తలిరువురికి కలుగుతుంది.
మహిళలకైతే సాధికారత భావాన్ని అందిస్తుంది.
కానీ ఇలా సోలోగా పర్యటనలు చేసేవాళ్లు సురక్షితంగా తిరిగొచ్చేలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.
(చదవండి: ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..భారత స్థానం ఇది..!)
Comments
Please login to add a commentAdd a comment