travels
-
'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..
సోలో లైఫే సో బెటరూ.. అన్నట్లుగా సోలో ట్రిప్పే సో బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మన వ్యక్తిగత వృద్ధికి, మంచి సంబంధాలను నెరపడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. పెళ్లైనా..అప్పుడప్పుడూ సోలోగా ట్రావెల్ చేస్తే..మనస్సుకు ఒక విధమైన రిఫ్రెష్నెస్ వస్తుందట. అంతేగాదు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కుటుంబంతో వెళ్తేనే కదా ఆనందం! మరి ఇలా ఎలా? అనే కదా..!నిజానికి పెళ్లయ్యాక ఒంటరిగా జర్నీ అంటే..సమాజం ఒక విధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇలా సోలో ట్రిప్ చేసే అవకాశం కాదు కదా..ఆ ఆలోచనకే తిట్టిపోస్తారు పెద్దవాళ్లు. కానీ ప్రస్తుత యూత్‌లో ఆ ధోరణి మారింది. పెళ్లైనా..మహిళలు/ పురుషులు సోలోగా ట్రిప్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మానసికి నిపుణులు కూడా దీనికే మద్దతిస్తున్నారు. ఇదే మంచిదని నొక్కి చెబుతున్నారు. ఎందుకు మంచిదంటే..కుటుంబ సమేతంగానే ఇంట్లో ట్రావెల్‌ని ప్లాన్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరింత జోష్‌ఫుల్‌గా ఉంటామని మాననసిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ.. కుటుంబం, పిల్లలు బాధ్యతలతో తలామునకలైపోయి ఉంటాం. మన వ్యక్తిగత అభిరుచిలు, ఇష్టాలు తెలిసి తెలియకుండానే పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్నపాటి జర్నీ మనకు నచ్చినట్లుగా ఉండేలా ట్రావెల్ చేయడం మంచిదట. కుటుంబ సమేతంగా వెళ్లినప్పుడు బడ్జెట్ అనుసారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆయా పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తాం. వాళ్ల రక్షణ బాధ్యత కూమా మీదే అవుతుంది. ఈ టెన్షన్ల నడుమ పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమైనా..అది కూడా ఓ ఆనందం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఫలానా ట్రిప్‌కి తీసుకెళ్లి ఈ మంచి ఫీల్ ఇచ్చాననే ఆనందం మాటలకందనిది. అయితే వ్యక్తిగతంగా అప్పడప్పుడూ సోలోగా టూర్‌కి వెళ్లడం చాలా మంచిదట. దీనివల్ల తమను తాము అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. స్వీయ ఆనందం పొందేందుకు వీలుపడుతుంది. అలాగే ఒక విధమైన స్వేచ్ఛ లభించనట్లుగా ఉంటుంది. దీంతోపాటు స్వీయ సంరక్షణ గురించి కూడా తెలుస్తుంది. కలిగే ప్రయోజనాలు..సోలో పర్యటన వల్ల మానసిక ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. అదికూడా వ్యక్తిగతంగా ఒక మంచి స్పేస్ దొరికనట్లు అనిపిస్తుంది. అలాగే భాగస్వామి నమ్మకాన్ని బలపరుస్తుంది. వ్యక్తిగత ఆనందాలను, అభిరుచులను గౌరవించుకోవడం వల్ల భద్రతగా ఉన్నామనే ఫీల్ భార్యభర్తలిరువురికి కలుగుతుంది. మహిళలకైతే సాధికారత భావాన్ని అందిస్తుంది. కానీ ఇలా సోలోగా పర్యటనలు చేసేవాళ్లు సురక్షితంగా తిరిగొచ్చేలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.(చదవండి: ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..భారత స్థానం ఇది..!) -
మాదాపూర్‌లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం
సాక్షి,హైదరాబాద్ : మాదాపూర్‌లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సాయిచరణ్‌తో పాటు మరో వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి ,రాహుల్ ,సుబ్రహ్మణ్యంలను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది.డ్రగ్స్ సరఫరా దందా జరిగేది ఇలానార్కోటిక్ పోలీసుల వివరాల మేరకు..సాయి చరణ్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించేందుకు నగరంలో పలు ట్రావెల్స్ ఏజెన్సీలకు చెందిన డ్రైవర్లను నియమించుకున్నాడు. వారికి బెంగళూరులో డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.ఇలా, 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాపారస్తులు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారేనని నార్కోటిక్ పోలీసుల విచారణ తేలింది. సాయిచరణ్‌తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. -
వయసు@ 70..సోలో ట్రావెలర్
‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్ ప్రోఫెసర్ జైపూర్‌వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్‌గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. ‘‘ఫసిపిక్లోని గాలా పాగోస్ దీవుల నుండి అట్లాంటిక్ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్‌లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. కల వెనకాల రహస్యం నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్‌కి సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్లతో పాటు నెలల తరబడి బెడ్‌రెస్ట్‌లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. ప్రేమ వారసత్వం కాలేజీలోప్రోఫ్రెసర్గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్ ఫ్రెండ్ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. దృష్టి కోణాన్ని మార్చింది మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్ క్రిస్మస్కి క్రూయిజ్ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను. మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్‌లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్ ఏవీ ఉండవు. అడుగడుగునా ఉత్సుకత నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్ పర్యటన. నార్తర్న్ లైట్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాక్ హోమ్ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్‌లో ప్రతి వ్యక్తికీ వాష్‌రూమ్‌కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్ లాంటిది. అక్కడి బాత్రూమ్లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు అది లాక్ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్రూమ్లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్ వరకు ట్రాన్స్ –సైబీరియన్ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్బోర్న్లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్. -
స్కూలు వ్యానులో తిరుగుతూ.. అత్యధిక ఆదాయం సంపాదిస్తూ..
డబ్బు సంపాదించడం అంత తేలికైన పనేమీ కాదు. ఎంతో కష్టపడితేనే తగిన ఆదాయం వచ్చి, జీవితం సజావుగా సాగుతుంది. అయితే దీనికి భిన్నమైన సిద్దాంతాన్ని అనుసరిస్తున్న ఒక మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ పేరు అలిస్ఎవర్డీన్(32). అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటోంది. అలిస్ గతంలో ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ ఆమె వారానికి 50 నుండి 60 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి విసిగిపోయిన ఆమె ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకుంది. తరువాత ఆమె ఒక స్కూల్ వ్యాన్ కొనుగోలు చేసి, దానిని తన ఇంటిలా మలచుకుంది. ప్రస్తుతం ఆమె ఆ స్కూలు వ్యానులో దేశమంతా తిరుగుతోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతున్న ఆలిస్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ ద్వారా కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తోంది. ఆలిస్ ఫ్రీలాన్సర్ కంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే పనిచేస్తుంది. గతంలో ఆఫీసుకు వెళ్లి సంపాదించిన దానికంటే ఇప్పుడు రెట్టింపు సంపాదిస్తున్నానని అలిస్ తెలిపింది. ఆలిస్ వాయిస్ ఓవర్ వర్క్‌తో పాటు యూజర్ జనరేటెడ్ కంటెంట్ (యూజీసీ)కి సంబంధించిన వీడియోలను కూడా రూపొందిస్తుంటుంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్‌లలోనూ పనిచేస్తుంది. ఫలితంగా ఆమెకు అత్యధిక ఆదాయం వస్తోంది. టెక్సాస్‌లో నివసించడం చాలా ఖరీదైనదని, పాఠశాల బస్సులో నివసించడం ఎంతో చౌక అని అలిస్ తెలిపింది. పార్కింగ్, ఆహారం కోసం మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుందని ఆమె పేర్కొంది. పార్కింగ్‌కు నెలకు ఆరు వేలు, పెట్రోలుకు రూ.80 వేలు, ఆహార ఖర్చులకు 20 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆమె తెలిపింది. ఈ మొత్తం టెక్సాస్‌లో నివసించడం కంటే చౌకైనదని ఆమె వివరించింది. -
వచ్చేవారంలోగా రిఫండ్స్ జరగాలి
న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్లను వచ్చే వారంలోగా (నవంబర్ 3 వారం లోపు) రిఫండ్ చేయాలని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్‌లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్డౌన్ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్‌ల విషయంలో కొందరికి రిఫండ్స్ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈ అంశంపై ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్ మూడవవారంలోపు రిఫండ్స్ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది. వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్‌తో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన. -
ట్రెండ్ ఫాలో అవుతున్న రాహుల్ గాంధీ
-
Delhi Metro: ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ట్రావెల్ ఆపరేటర్ల లాభాలకు బూస్ట్
ముంబై: ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 6–7 శాతం వృద్ధి చెందనున్నాయి. అలాగే కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 90 శాతం ఆదాయాన్ని రికవర్ చేసుకోనున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. కోవిడ్‌పరమైన ఆంక్షల వల్ల ప్రయాణాలు నిల్చిపోవడంతో రెండేళ్ల పాటు నష్టపోయిన ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభదాయకత .. 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో 6–7 శాతం మేర పుంజుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్, విహార ప్రయాణాలు మెరుగుపడటంతో ఆదాయాలూ పెరగగలవని క్రిసిల్ తెలిపింది. కోవిడ్ సమయం నుంచి అమలు చేస్తున్న ఆటోమేషన్, వ్యయ నియంత్రణ విధానాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు తిరిగి మహమ్మారి పూర్వ స్థాయిని (2020 ఆర్థిక సంవత్సరం) దాటేయొచ్చని తెలిపింది. 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటింగ్ సంస్థలు వరుసగా 25.8%, 2.7% మేర నిర్వహణ నష్టాలు ప్రకటించాయి. నివేదికలోని మరిన్ని అంశాలు. ► నిర్వహణ పనితీరు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, నికర రుణ రహితంగా ఉండటం వంటి అంశాలు ఆయా సంస్థలకు సహాయకరంగా ఉండనున్నాయి. ► స్వల్పకాలిక విహార యాత్రలకు.. (ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతాలకు) ప్రాధాన్యం పెరుగుతోంది. యూరోపియన్ దేశాల వీసాల జారీ పుంజుకోవడంతో రాబోయే వేసవి సెలవుల కోసం బుకింగ్‌లు పెరుగుతున్నాయి. అయితే, విహార యాత్రల కోసం అమెరికాకు వెళ్లే ధోరణులు రికవర్ కావడానికి మరింత సమయం పట్టనుంది. ► అంతర్జాతీయ మందగమనం సుదీర్ఘంగా కొనసాగవచ్చన్న ఆందోళనలు తగ్గుముఖం పడుతుండటంతో రాకపోకలు మెరుగుపడనుండటం.. ఆదాయాల వృద్ధికి తోడ్పడనుంది. -
కోవిడ్ తర్వాత మారిన ట్రావెల్ ట్రెండ్స్
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ట్రావెల్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్’ ప్రకారం, 93% మంది భారతీయులు కోవిడ్ ముందుతో పోలిస్తే ప్రయాణాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారతీయులు ఈ ఏడాదిని టూర్స్‌కి మంచి సంవత్సరంగా భావిస్తున్నారు. భారతీయులను ప్రయాణానికి ప్రేరేపించేవాటిలో కొత్త అనుభవాలను కనుగొనడం 48శాతం మందికి ముఖ్యమైందిగా నిలిచింది. పెరిగిన ప్రయాణాలు.. 94 శాతం మంది ఖర్చు అలాగే 46% మంది విశ్రాంతి కోసం చూస్తున్నారు. టూర్స్‌ను ఇష్టపడుతున్నవారిలో 45% మంది కొత్త గమ్యస్థానాలను అన్వేషించారు. ప్రతీ 10 మందిలో ఐదుగురు తమ కలల గమ్యస్థానానికి ఒంటరిగా ప్రయాణించడానికి కూడా సై అంటున్నారు. రెండు ఆందోళనకర కోవిడ్ నేపధ్య సంవత్సరాల తర్వాత, భారతీయ టూర్ ఇష్టులలో ప్రయాణ సెంటిమెంట్ బాగా పుంజుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్.. ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా మారింది. ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్‌గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్,అన్అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ’నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది పనితో పాటే టూర్స్... ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్స్టారీల్స్తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. గత వారం, ఇండోనేషియా మరింత మంది విదేశీ పర్యాటకులను దేశంలోకి ఆహ్వానించడానికి ’డిజిటల్ నోమాడ్స్ వీసా’ని అందించింది. ప్రపంచంలోని ఏ ప్రదేశం నుండి అయినా పని చేయాలని కోరుకునే వారి కోసం మార్చిలో పోర్చుగల్ రెండేళ్ల నివాస వీసాను ప్రకటించింది. ఇటలీ కూడా వర్క్–ఫ్రమ్–ఎనీవేర్ బృందాల కోసం తన ప్రయాణ విధానాన్ని పునర్నిర్మిస్తోంది. వారిలో ఎక్కువ మంది హాలిడే మూడ్‌లో పని చేస్తుండడాన్ని బాగా ఇష్టపడుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు టూర్స్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపేరేటర్స్ చెప్పారు. .వర్క్‌తో పాటే విందు, వినోదం ‘‘మా రిసార్ట్స్‌లో 80శాతం వరకూ వర్కేషన్ కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, , ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’’ అంటూ ఐటీ ఉద్యోగి సూర్య చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. కేవలం పర్యావరణాన్ని ఆస్వాదించడం మాత్రమే కాకుండా వైవిధ్యమైన అభిరుచులను నెరవేర్చుకోవడానికి టూర్ ఇష్టులు తపనపడుతున్నారని క్లబ్ మహీంద్రా ప్రతినిధి చెప్పారు. వీటిలో ఇగ్లూలో బస చేయడం, ట్రీ హౌసెస్ మీద విందు ఆరగించడం, సమకాలీన కళా ప్రదర్శనలు, హార్స్ రైడింగ్, ఎటివి బైక్స్, పెయింట్ బాల్, నేచర్ వాక్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. అభిరుచులు మారాయి... మా 2.6లక్షల మంది సభ్యుల్లో 30శాతం మంది దక్షిణాది నుంచే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దిండిలో భాగస్వాములతో కలిసి ఆతిధ్య కేంద్రం నిర్వహిస్తున్నాం. కోవిడ్ తర్వాత ట్రావెల్ ట్రెండ్స్ బాగా మారాయి. అందుకు అనుగుణంగా మా ప్యాకేజీలు కూడా మారుస్తున్నాం. ఇటీవల బాగా పాప్యులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా రిసార్ట్స్ -
ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
కోవిడ్ తగ్గుముఖం.. ఈసారి సమ్మర్ వెకేషన్లకు తగ్గేదేలే! పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా బెంబేలెత్తిస్తున్న కోవిడ్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ థర్డ్‌వేవ్ అంతమవుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటంతో హాలీడే ట్రిప్‌లు, ఫారెన్ వెకేషన్లకు వెళ్లాలనుకునేవారిలో కొత్తఆశలు చిగురిస్తున్నాయి. రెండు, మూడురోజుల వీకెండ్, షార్ట్ ట్రిప్‌లకు వెళుతున్నవారూ ఉన్నారు. 2020 నుంచి రెండు వేసవికాలాల్లో సరదాగా దూర ప్రాంత విహారాలకు వెళ్లి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమ్మర్ వెకేషన్లకు వెళ్లడానికి ముందు నుంచే చాలామంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 2, 3 రోజుల చిన్న ట్రిప్, వీకెండ్ టూర్, సమ్మర్ వెకేషన్, ఫారెన్ టూర్లకు కుటుంబసభ్యులు, ఆప్తులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులతో వెళ్లాలనే భావన అత్యధికుల్లో పెరిగింది. ఈ అంశాలపై తాజాగా హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ‘ఓయో’కన్జుమర్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యాంశాలు... ♦ తమకు అత్యంత ఆప్తులు, సన్నిహితులతో కలసి వెళ్లేందుకు మూడోవంతు వంతు మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ♦ ఇలాంటి ట్రిప్‌లు తమకు నచ్చిన వారితో అనుబంధం మరింత పటిష్ట పరుస్తాయంటున్నవారు 84 శాతం ♦ దగ్గరలోనే ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు 62 శాతం మంది మొగ్గు ♦ గతంలో పోల్చితే హాలీడే ట్రిప్‌లు, వెకేషన్లపై వెళ్లేందుకు మూడింట రెండు వంతుల మంది సిద్ధం ♦ వాలంటైన్ డే సందర్భంగా ప్రేమికులు, దంపతులు, స్నేహితులు వెళ్లాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో మొదట గోవా ఆ తర్వాతి స్థానంలో మనాలి ఉంది. ♦ తమ ఆప్తులు, దగ్గరివారితో నాణ్యమైన సమయం గడపాలనే భావనలో 38% మంది ♦ రొటీన్ జీవితం నుంచి తప్పించుకుని వెకేషన్లపై వెళ్లాలనుకునేవారు 26 శాతం ♦కొత్త ప్రాంతాలను సందర్శించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నవారు 25 శాతం ♦పారిస్, మాల్దీవులు, స్విట్జర్లాండ్‌కు వెళ్లానుకునేవారు అత్యధికంగా ఉన్నారు. రివెంజ్ టూరిజంలో భాగమే... మార్చి తర్వాత మనదేశంలో, రాష్ట్రంలో హాలీడే వెకేషన్లు, ట్రిప్‌లు పెరగనున్నాయి. ఇప్పటికిప్పుడు వెంటనే విదేశీ ట్రీప్‌లకు వెళ్లేందుకు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ పూర్తిస్థాయిలో సాగితే ఐరోపా, సింగపూర్, థాయ్‌లాడ్, ఇతర దేశాలకు డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువగా గోవా, హిమచల్‌ప్రదేశ్ తదితర చోట్లకు ఎక్కువగా వెళుతున్నారు. టూర్లకు, లగ్జరీ హోటళ్లలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గతంతో పోల్చితే 50, 60 శాతం ఎక్కువగా ఎంక్వైరీలు పెరిగాయి. – అజయ్ రామిడి, ఎండీ లార్వెన్ టూర్స్, ట్రావెల్స్ -
భారత్ సహా 5 దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
సింగపూర్: కోవిడ్–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్ సడలిస్తోంది. తాజాగా, భారత్ సహా ఐదు దక్షిణాసియా దేశాలను బుధవారం నుంచి ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆం క్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది. -
Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..!
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏమో కానీ.. టౌన్లో మాంసం, మందుకు ఒక్కసారిగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా అక్కడ వినిపించే మాటలు ఇవే. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉప ఎన్నికలో రెండో ఘట్టమైన ప్రచారం పర్వం మొదలైంది. పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందుకోసం పక్క నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొన్న వారికి మర్యాదలు కూడా బాగానే చేస్తున్నారు. హోటళ్లు కిటకిట..! కీలకమైన ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇక్కడ కొన్ని వార్డులు, కాలనీలు అప్పగించారు. వారి ఆతిథ్యం మొదలుకుని ప్రచారంలో తాగునీరు, వాహనానికి అయ్యే పెట్రోలు దాకా అన్నీ పార్టీల నాయకులే చూసుకుంటున్నారు. ఇక పగలంతా ప్రచారం చేసి ఏ రాత్రికో వీరు తమకు కేటాయించిన గదుల్లోకి చేరుతున్నా రు. అక్కడ అసలైన మర్యాదలు మొదలవుతున్నా యి. దాదాపు రెండు నెలలుగా ఇక్కడ ప్రముఖ హోటళ్లు, లాడ్జి గదులన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాయి. కరోనా దెబ్బకు అన్ని పట్టణాల్లో టు లెట్ బోర్డులు దర్శనమిస్తుంటే.. బయటి నుంచి వచ్చిన వారితో హుజూరాబాద్‌లోని అద్దె ఇళ్లు, హోటళ్లు కిటకిటలాడిపోతున్నాయి. కోడికూర ఉండాల్సిందే..! హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ మద్యం, మాంసం విక్రయాలు పెరిగాయి. సాధారణంగా హుజూరాబాద్ పట్టణంలో రోజుకు 6 క్వింటాళ్ల చికెన్‌ను వ్యాపారులు విక్రయించేవారు. కానీ.. షెడ్యూలు ప్రకటించాక చికెన్‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రతీరోజూ కార్యకర్తలకు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం మెనూలో చికెన్ కూర తప్పనిసరి. దీంతో చికెన్ డిమాండ్ ఇప్పుడు రోజుకు 10 క్వింటాళ్లకు చేరిందని వ్యాపారులు వెల్లడించారు. ప్రస్తుతం కిలో రూ.240 పలుకుతోంది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.24,000, పది క్వింటాళ్లకు రూ.2,40,000 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా బిర్యానీ, కోడికూరలకు ప్రసిద్ధి చెందిన హోటళ్లు, రెస్టారెంట్లలోనూ చికెన్‌కు డిమాండ్ పెరిగింది. వ్యాక్సిన్ కోసం పరుగులు.. కేంద్ర ఎన్నికల సంఘం రెండో డోస్ తప్పనిసరి చేయడంతో కార్యకర్తల్లో చాలామంది టీకా కోసం పరుగులు తీస్తున్నారు. ప్రచారం చేసేవాళ్లు కూడా రెండు డోసులు వేసుకోవాలి. దీంతో పెద్ద నాయకుల సాయం తీసుకుని మరీ టీకా తీసుకుంటు న్నారు. ప్రచార పర్వం ఆసాంతం కీలకంగా వ్యవహరించే కొందరు నాయకులు, అనుచరులకు వెంటనే రెండో డోసులను బడా నాయకులు దగ్గరుండి వేయిస్తున్నారు. డోసుకు డోసుకు మధ్య తక్కువ వ్యవధి ఉంటుందని అంతా కోవీషీల్డ్ వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తుండటం విశేషం. ధర రూ.1,200 దాటినా సరే వెనకాడడం లేదు. చదవండి: (Huzurabad Bypoll: సింబల్ హడల్!) రాత్రికి విందు తప్పనిసరి ఉప ఎన్నిక పుణ్యమాని అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా ఇక్కడే తిష్టవేశారు. వీరిలో జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఉన్నారు. వీరిలో చాలామంది రాత్రిపూట మందు పార్టీలకు హాజరవుతున్నారు. కొందరికి నేరుగా గదులకే బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ అక్టోబరు 1 నుంచి 9 వరకు రూ.6.17 కోట్ల విలువైన మద్యాన్ని నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో విక్రయించారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జమ్మికుంటలో రూ.2.63 కోట్లు, హుజూరాబాద్‌లో రూ.3.54 కోట్ల మద్యం విక్రయించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యాపారం చేయడం స్థానికంగా మద్యానికి పెరిగిన డిమాండ్‌కు నిదర్శనమని లిక్కర్ వ్యాపారులు తెలిపారు. జోరుగా ట్రావెల్స్ బుకింగ్స్ కరోనా కారణంగా బాగా నష్టాల్లో ఉన్న స్థానిక ట్రావెల్స్ యజమానులు ఉప ఎన్నిక పుణ్యమాని బిజీ అయిపోయారు. ఒక్కో కారును రూ.25,000 నుంచి రూ.35,000 వరకు లీజుకు తీసుకుంటున్నారు. హుజూరాబాద్ వచ్చిన నాయకులను ప్రచారానికి తిప్పడమే వీరు చేయాల్సిన ఏకైక పని. పలు పార్టీల నాయకులు, అభ్యర్థులు ఇక్కడ వాహనాలను ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బుక్ చేసుకోవడంతో వీరంతా చేతి నిండా పనితో రేయింబవళ్లు కష్టపడుతున్నారు. -
శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు: టీటీడీ
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన చెన్నైకి రేవతి పద్మావతి ట్రావెల్స్‌పై కేసు నమోదైంది. రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ
రాంచీ: కరోనా బారినపడిన స్నేహితుడిని కాపాడుకునేందుకు అతడి మిత్రుడు సాహస యాత్ర చేశాడు. 24 గంటల్లో ఏకంగా 1,300 కిలోమీటర్లు నిరంతరం ప్రయాణం చేసి మరీ తన స్నేహితుడికి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చాడు ఓ ఫ్రెండ్. అతడి చేసిన సాహస యాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనే రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మ. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి ఘజియాబాద్‌లోని వైశాలి వరకు ప్రయాణించిన మిత్రుడి కథ చదవండి.. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మకు ఏప్రిల్ 24వ తేదీన స్నేహితుడు సంజయ్ సక్సేనా ఫోన్ చేశాడు. తనకు కరోనా సోకిందని ఆక్సిజన్ కావాలని కోరాడు. వెంటనే స్పందించిన సంజయ్ తన మిత్రుడు రాజన్‌ను సంప్రదించాడు. 24 గంటల్లో ఆక్సిజన్ కావాలని కోరడంతో తన మిత్రుల ద్వారా ఆక్సిజన్ కోసం వెతికాడు. చివరకు 120 కిలోమీటర్ల దూరంలోని బోకారోలో ఆక్సిజన్ అందుబాటులో ఉందని తెలియడంతో అర్ధరాత్రి సంజయ్ బైక్‌పై అక్కడకు వెళ్లాడు. రాకేశ్ కుమార్ గుప్తాకు చెందిన జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్‌లో గ్యాస్ తీసుకుని అనంతరం వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ చేరుకున్నాడు. స్నేహితుడు ఉన్న వైశాలి ప్రాంతానికి చేరుకుని ఆక్సిజన్ సిలిండర్ సకాలంలో అందించాడు. ఈ విధంగా మొత్తం 1,300 కిలోమీటర్లు 24 గంటలు నిరంతరం ప్రయాణం చేసి తన స్నేహితుడి కోసం ఆక్సిజన్ తీసుకొచ్చాడు. చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే.. -
నగరవాసులు పల్లెబాట..
సాక్షి, హైదరాబాద్: నగరవాసిని వాన పొమ్మంది.. పల్లె రమ్మంది.. ఇక్కడుంటే దండగ.. అక్కడైతే పండుగ.. అని పల్లె మూలాలున్న నగరవాసులు భావిస్తున్నారు. వారం, పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెంబేలెత్తిన నగరవాసులు బుధవారం పల్లెబాట పట్టారు. బతుకమ్మ, దసరా వేడుకల కోసం సొంతూరుకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ కనిపించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలకుపైగా స్తంభించిన జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న తరుణంలో భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. వరదలతో కాలనీ, బస్తీలు నీటమునిగాయి. బుధవారం తెల్లవారుజామున సైతం కురిసిన వర్షం ఉదయం తగ్గుముఖం పట్టింది. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖంపడితే మరో రెండు, మూడు రోజులపాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. అరకొర రైళ్లే... ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోవిడ్ కారణంగా రెగ్యులర్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు మాత్రమే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 15 రైళ్లు ఏర్పాటు చేశారు. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాలకు ఉన్న రైళ్లు చాలా తక్కువ. ఇప్పటికే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదైంది. కొన్ని రైళ్లలో సంక్రాంతి వరకు కూడా రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. ఒకవైపు రైళ్ల కొరత, మరోవైపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు, కార్లు తదితర వాహనాలకు గిరాకీ భారీగా పెరిగింది. ఇదే సమయంలో చార్జీల భారం సైతం రెట్టింపైంది. ప్రైవేట్ బస్సుల దోపిడీ తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరించకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, విశాఖ, కడప, చిత్తూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతాల ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు సాధారణరోజుల్లో రూ.350 వరకు ఉంటే ఇప్పుడు రూ.550కిపైగా చార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సాధారణ రోజుల్లో కాకినాడ, విశాఖ వంటి దూరప్రాంతాలకు ఏసీ బస్సుల్లో రూ.900 వరకు చార్జీ ఉంటుంది. ఇప్పుడు అది రూ.1,650 దాటింది. -
100 విమానాలు; సెంచరీ కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల అనంతరం ప్రారంభమైన దేశీయ విమానాల రాకపోకలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ప్రయాణికులు విమాన సేవలను సది్వనియోగం చేసుకుంటున్నారు. మొదట్లో ఒకటి, రెండ్రోజుల పాటు ప్రయాణికులు లేకపోవడంతో పలు నగరాలకు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ముంబై, చెన్నై, తదితర నగరాలకు సైతం అక్కడి ప్రభుత్వాలు అనుమతించకపోవడం వల్ల కూడా ఫ్లైట్లు రద్దయ్యాయి. కానీ ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, విజయవాడ, వైజాగ్, కడప, త్రివేండ్రం, కొచ్చిన్, బెంగళూరు, భోపాల్, లక్నో.. తదితర 70 నగరాలకు 100 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం) దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 55 వేల మందికి పైగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినట్లు అంచనా. మే 25 నుంచి 31 వరకు వారం రోజుల్లోనే సుమారు 28,251 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మరో 28 వేల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. రోజుకు 65 వేల మందికి పైగా ప్రయాణం చేస్తారు. వారిలో 55 వేల మంది దేశీయ ప్రయాణికులే కావడం గమనార్హం. నెమ్మది.. నెమ్మదిగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా మొదట్లో ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు సాగించేందుకు వెనుకడుగు వేశారు. ముఖ్యంగా మొదటి మూడ్రోజులు ప్రయాణికులు లేకపోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సర్వీసులు పెరిగాయి. 2 నెలల లాక్డౌన్ తర్వాత మే 25న మొదటి రోజు 20 విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరగా, 19 విమానాలు నగరానికి చేరుకున్నాయి. సుమారు 3 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని విద్యానగర్‌కు బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో కేవలం 12 మంది బయలుదేరటం విశేషం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచి్చన ఎయిర్ ఏసియా విమానంలో 106 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. మొదటిరోజు పలు సరీ్వసులు ఆకస్మికంగా రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండోరోజు 2,500 మంది రాకపోకలు సాగించారు. మూడోరోజు 3,500 మంది ప్రయాణం చేశారు. 41 విమానాలు వివిధ నగరాలకు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్, తదితర ఎయిర్‌లైన్స్ సంస్థలు కేంద్ర విమానయాన సంస్థ ఆదేశాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. అన్ని మెట్రో నగరాలతో పాటు సూరత్, అహ్మదాబాద్, రాంచీ, బెల్గాం, రాయ్‌పూర్, కొల్హాపూర్, వారణాసి తదితర అన్ని నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. పటిష్టంగా కోవిడ్ నిబంధనలు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, అధికారుల మధ్య భౌతిక దూరం పాటించటంతో పాటు, విమానాల్లోనూ పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు, ప్రయాణికులకు ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు అందజేస్తున్నారు. ప్రతిరోజు విమానాశ్రయాన్ని శానిటైజ్ చేయడంతో పాటు వైరస్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న వారికి కరోనా నిబంధనలకు అనుగుణంగా 14 రోజుల పాటు ఇంట్లోనే హోంక్వారెంటైన్ పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’సేవల్లో భాగంగా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అన్ని క్యాబ్‌లను కూడా శానిటైజ్ చేస్తున్నారు. డ్రైవర్లకూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. -
జేసీ ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడులు
-
పుష్పకయాత్ర
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరం ఒకే ద్వారం గుండా విమానం ఎక్కే చోటికి చేరుకున్నాం.ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా ఈ పుష్పకవిమానంలో ఎక్కాలంటే మాత్రం రాసి పెట్టి ఉండాలి. కొంతమంది విమానం వరకూ వచ్చినా సరే, వారిని తిరిగి వెనక్కి పంపుతున్నారు ద్వారం దగ్గర ఉన్న విచిత్ర వేషధారులు. పాపం దురదృష్టవంతులు. మామూలువిమానం కంటే ఇది ఏంతో భిన్నంగా ఉంది, బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. పూల మీద కాలు పెట్టామా అన్నట్లున్న మెట్లెక్కి విమానంలోకి చేరుకున్నాము. లోపల ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉండేటట్లు ఉంది మరి! కొంతమందిని ఎందుకు వెనక్కి పంపారో అర్ధం అవటంలేదు. చుట్టూ ఇనుప రేకుల బదులు అద్దాలు బిగించినట్టు బయట పరిసరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అద్దాలు కూడా లేవేమో, బయట నుండి మంచి సువాసనలతో కూడిన గాలి వీస్తూ ఉంది. దాని రెక్కలు ఏవో పక్షి రెక్కల లాగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. మేము మొత్తం ముప్పై ఆరుమందిమి పుష్పక ట్రావెల్స్ వారి విమానంలో యాత్రకు బయలుదేరాము. వాళ్ళలో ఇరవై మంది వరకూ నాకు తెలిసిన వాళ్ళే అవడం కాస్త విచిత్రంగా ఉంది. అందరం కూర్చున్నాము. ఉన్నట్టుండి విమానం సమాంతరంగా కాకుండా నిట్టనిలువుగా గాలిలోకి లేచింది. విమానం ముందుకు వెళ్ళే కొద్ది మేఘాలు కిందకు వెళుతున్నాయి. అయినా కూడా దారంతటా కొత్త మేఘాలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఒక్కో ఆకారంలో ఉన్నాయి. విమానం అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశించి ఆగింది. అందరు కిందికి దిగి చూడవచ్చని ఒక కంఠం ప్రకటించింది. ఆగొంతు ఎవరిదో? ఎవరూ కనబడలేదు. ఆకాశంలో ఉద్యానవనం ఏమిటా అని అందరం ఆశ్చర్యంగా చూస్తూ విమానం నుండి కిందికి దిగాము. ఆ వనంలో మరలా ఆకాశానంటుతున్నాయా అన్నట్టుగా ఏపైన చెట్లు,రంగురంగుల పూలు, పూల పుప్పొడిని గ్రోలుతున్నఅందమైనసీతాకోకచిలుకలు, పక్షులు, భారీ ఆకారం గల జంతువులూ తిరుగాడుతున్నాయి. మేము తప్ప ఎక్కడా మనుషులు కనిపించలేదు. అద్భుతపరిమళంతోట అంతటా పరుచుకుని ఉంది. అందరూ ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు పరిచయం లేదు. పరిచయం ఉన్న కొద్దిమంది మాత్రం కచ్చితంగా అంత ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. మొదటగా చూసింది ఈ విమానం ఎక్కక ముందు, బస్సులో మేము చేసిన చార్ధామ్ యాత్రలో మాకు వంట చేసిపెట్టిన అరవవాడు. నేను ఎన్నో సార్లు వాడితో వంటల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడినా, వాడి పేరు నాకు తెలియదు. లేదు నేనడగలేదు. ముతక లుంగీ, మాసిపోయిన బనీను కట్టుకొని ఉండే వాడు కాస్తా, అందమైన తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. ఎన్నో సార్లు వాడి మీద ఆధారపడి ఉండే కుటుంబం గురించి చెప్పేవాడు. నెలలో సగం రోజులు వారికి దూరంగా ఉంటున్నందుకు బాధపడుతూ ఉండే వాడు. ఇప్పుడు వాడి ముఖంలో అటువంటి ఛాయ లేమీ లేవు. కులాసాగా తిరుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లు చెబుతున్నాడు. నాకేసి చూసి నవ్వాడు. అదే వాణ్ని నవ్వుతూ చూడటం. హటాత్తుగా నాకో అనుమానం వచ్చింది, వాడు ఇక్కడ ఉంటే మాకు వంట చేసే వాళ్ళు ఎవరు? చుట్టూ చూశాను అటువంటి ఏర్పాట్లు ఏమీ చేసినట్టు కనిపించలేదు. గంటకోసారి ఏదో ఒకటి తినే నాకు ఆశ్చర్యంగా అస్సలు ఆకలే అనిపించలేదు. ఎవరికీ ఆ ఆలోచన లేనట్టుంది. పాన్పు కంటే మెత్తగా ఉన్న గడ్డి మీద లేడి పిల్లలా గెంతుతూ అగుపడ్డాడు మా బస్సుకు క్లీనర్‌గా వచ్చిన అబ్బాయి. ఇంటి నుండి దూరంగా వచ్చానని ఎప్పుడూ ఉలుకూపలుకూ లేకుండా నత్తలాగుండే పద్నాలుగేళ్ళ కుర్రాడు. వాడు అంత ఆనందంగా ఉండటంచూసి నాకు ఆశ్చర్యమేసింది. మరో వైపున ఉన్న జనాలలో నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగా కబుర్లు చెప్తూ కనబడింది ఆమె. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడంతో ఎప్పుడూ కోపంగా, దిగులుగా, అకారణంగా పోట్లాడుతూ ఒంటరిగా ఉండేది. అలాంటి ఆమె ఇలా అందరితో కలిసి ఉల్లాసంగా కబుర్లాడుతూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆనందమే సుమా అసూయ మాత్రం కాదు, నిజంగా. ఒకచోట కొందరు చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. బస్సులో కదలకుండ గంట కూర్చుంటే కాళ్ళు ఉబ్బిపోయి, గట్టిగా నాలుగు అడుగులు వేస్తే ఆయాసపడే అతడు పూనకం వచ్చిన వాడిలా గాల్లో ఎగిరెగిరి చిందులు వేస్తున్నాడు. ఒకప్పుడు తన ఆటపాటలతో జనాలను ఓలలాడించిన అతనికి, అప్పటి జవసత్వాలు తిరిగి వచ్చినట్టున్నాయి. మైమరిచి ఆడుతున్నాడు అతను. విమానంలోకి తిరిగి రమ్మని గొంతు వినిపించేసరికి అందరూ వచ్చి విమానం లోనికి ఎక్కుతున్నారు. నిన్నటి దాకా నేను చూసిన వాళ్ళలా అగుపించలేదు ఎవరూ. కర్మ ఫలాన్ని రోగాల రూపంలో అనుభవిస్తూ, కడుపున పుట్టిన వారి ఆదరణకు నోచుకోక నిరాశా పూరిత వదనాలతో, ఇష్టమైనది తినలేక, కనీసం ఏదో ఒకటి తినడానికి కూడా సహకరించని వణికే శరీరాలతోఉండేవారు కాస్తా ఇప్పుడు ధవళ వర్ణదుస్తులు ధరించి, వెలిగే కండ్లతో, నిటారుగా నిలిచిన శరీరాలతో, అంతులేని ప్రశాంతత గలిగిన వదనాలతో ఉన్నారు. ఇంత మార్పు ఎలా సాధ్యమైందో తెలియలేదు. కనీసం విమానం వాళ్ళు తాగడానికి కూడా ఏమీ ఇవ్వలేదు, దాని వల్ల ఇలా మారాము అనుకోవడానికి. నేను కూడా అలాగే మారానా? నా శరీరంలో కూడా మార్పు తెలుస్తోంది. ఒకసారి నన్ను నేను అద్దంలో చూసుకుందామని అనుకున్నా. విమాన సహాయకులను అద్దం అడుగుదామని చుట్టూ చూశాను. అటువంటి వారు ఎవరూ కనబడలేదు. అసలు విమానాన్ని నడుపుతున్నట్టు కూడా ఎవరూ కనబడలేదు. కంగారు కలిగిందా, లేదు అస్సలు కలగలేదు. విమానం తిరిగి బయలుదేరి ఎంతో సేపు అయింది. ఇంకా గమ్యం రాలేదు. అయినా చిరాకు కలగలేదు. ఇంత ప్రశాంతత నాలో ఎలా కలిగింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. చుట్టూ చూశాను, అందరూ అలాగే ఉన్నారు. ఎవరూ అలిసిపోయినట్టు, నిద్రపోతున్నట్టు అనిపించలేదు. గమ్యస్థానం చేరుకున్నాము, అందరూ దిగవలసిందిగా కోరుతున్నాం అంటూ మరోసారి ఆ కంఠం వినబడింది.అందరం కిందికి దిగాం. ఇక్కడ ఎటు చూసినా జనమే కనబడుతున్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. దూరంగా కొన్ని కౌంటర్లు, ప్రతి కౌంటర్ ముందు పెద్ద వరుసలో చాలా మంది నిలబడి ఉన్నారు. మేమూ ఆ లైన్లో నిలబడ్డాము. ఆకౌంటర్లలో ఉన్న వ్యక్తులు లైన్లో నిలబడి ఉన్న వాళ్ళను ఏదో అడుగుతూ, లైన్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాక తన దగ్గర ఉన్న కంప్యూటర్ లాంటి దాంట్లో ఏదో రాసుకుంటున్నారు. సమాధానం చెప్తున్న వాళ్ళ ముఖాలు కాసేపు ఆనందంతో, కాసేపు బాధతో రకరకాలుగా మారుతున్నాయి. సమాధానం చెప్పిన తర్వాత పక్కకు వచ్చిన వాళ్ళు రెండు వేరువేరు ద్వారాల గుండా వెళుతున్నారు. కొంతమంది విచిత్ర వేషధారులు వాళ్ళను దగ్గర ఉండి లోపలి తీసుకెళ్తున్నారు. మొదటి ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళు ఆనందంగా వెళుతుంటే, రెండో ద్వారం గుండా వెళ్తున్నవాళ్ళు వడలిన ముఖాలతో వెళుతున్నారు. రెండో ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళలో మళ్ళీకొంతమంది నిర్భయంగా వెళ్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. మా ముప్పై ఆరు మంది వంతు వచ్చింది. మెల్లగా ఒక్కొక్కరు కౌంటర్ దగ్గరకు చేరుకుంటున్నారు. నా వంతు వచ్చింది. నేను కౌంటర్ లోని వ్యక్తి వైపు చూశాను. అత్యంత గంభీరంగా ఉన్న అతని వదనంలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. అతను నా పేరు అడిగాడు. నేను కథకుడు అని చెప్పాను. అతను కథకుడు జననం 1963, మరణం 2019 అని రాసుకున్నాడు. మరణం, మరణమా, అంటే నేను మరణించానా అని ఆశ్చర్యంగా అడిగాను అతన్ని. అతను నా చేతిని అతని దగ్గర ఉన్న పుస్తకంపై ఉంచాడు.అప్పటివరకు నా జీవితంలో జరిగిన ప్రతి విషయం కండ్ల ముందు మెదలసాగాయి. మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రతి సంఘటన కనపడుతున్నది. ఆయా సంఘటనలు నాకు మిగిల్చిన అనుభూతులకు అనుగుణంగా ముఖంలోని రంగులు మారుతున్నాయేమో. పెదవులు నవ్వుతున్నాయి, బిగుసుకుంటున్నాయి, కండ్ల నుండి నీళ్ళు కారుతున్నాయి. చివరగా నేను బస్సులో నిద్రలో ఉన్నాను, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ చీకట్లో చిన్న వెలుగు దగ్గర బస్సు ఆగింది. బస్సు దిగి వెళ్ళిన డ్రైవర్ కాసేపటికి తూలుతూ వచ్చాడు. ఇంకాసేపటికి బస్సు కూడా తూలడం మొదలుపెట్టింది. దాదాపు ఎదురుగా వస్తున్న వాహనాన్నిఢీ కొట్టబోయి తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ ఊగుతూ చివరికి స్టీరింగ్ మీదకు ఒరిగిపోయాడు. బస్సు అదుపుతప్పింది. వందల అడుగుల లోతున్న లోయలోకి దొర్లింది. అందరం నిద్రలో ఉండగానే చనిపోయాము. ఎలా చనిపోయామో కూడా ఎవరికీ తెలియదు. చెయ్యి పుస్తకం పైనుండి తీశాను. మరి విమానం దగ్గరి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిన వారు ఎవరు అని అడిగాను. ఓ అదా వాళ్లు చావు అంచుల దాకా వచ్చి, భూమి మీద ఇంకా నూకలు ఉండి తప్పించుకున్నవారు. అంటే వాళ్లు దురదృష్టవంతులు కారు, అదృష్టవంతులు అని గ్రహించాను. అందరితో పాటూ నేను ద్వారాల వైపు నడవసాగాను.కొందరు విచిత్రవేషధారులు వచ్చి ఒక ద్వారం వైపు నన్ను తీసుకుని వెళ్లి అక్కడి వరుసలో నిలబెట్టారు. అదిఏం ద్వారం అని అడిగాను. స్వర్గానికి వెళ్ళే ద్వారం అని చెప్పాడు. అటు వైపుది నరకానికి వెళ్లే ద్వారం అని చెప్పాడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే నేను నిలబడింది స్వర్గ ద్వారానికి ఎదురుగా. నిలబడి అందరి వైపు చూడసాగాను. ఇప్పుడువాళ్ళ మనసులో విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇంతకూ ఆత్మలకు మనసు ఉంటుందా ఏమో తెలియదు. కాని వాళ్ళు అనుకునే విషయాలు కూడా తెలియసాగాయి.మోకాళ్ళనొప్పులతో బాధ పడే కళాకారుడు,బాధ, నొప్పి నుండి విముక్తి లభించిందని ఆనందంగా ఉన్నాడేమో.పెద్దకొడుకు దగ్గర ఒకరు, చిన్న కొడుకు దగ్గర ఒకరు ఉంటూ యాత్రకు కలిసి వచ్చిన ఆ దంపతులు ఇక ఒకరికిఒకరు దూరంగా ఉండక్కర్లేదని భావిస్తున్నారేమో. పిల్లలకు భారం అవలేదని, ఛీత్కారాలు పడక్కర లేదని ఆ పండు ముదుసలి అనుకుంటుందేమో. దేవుణ్ణి దగ్గర నుంచి చూసేంత దరికి చేరానని, కైవల్యం ప్రాప్తించిందని ఆ పంతులు భావిస్తున్నాడేమో. నరకపు ద్వారం వైపు చూశాను.. అనవసరంగా డబ్బు సంపాదనలో పడి పాపాలు చేసి, కనీసం కడుపుకు కూడు కూడా సరిగా తినలేకపోయానని ఆ వ్యాపారి వగరుస్తున్నాడేమో, నలుగురు మరణించిన ప్రమాదానికి కారణమైన అతను ఫోన్ మాట్లాడుతూ కారు నడపకుండ ఉండాల్సిందని భావిస్తున్నాడేమో, ఇక నుంచి తన సంపాదన గురించి తల్లిదండ్రులు, భార్య వాదులాడుకోనక్కర లేదని ఆ కుర్రాడు సంతోషిస్తున్నాడేమో. అనయాస మరణం లభించిందని ఆ రోగిష్టి వాడు నవ్వులు చిందిస్తున్నాడేమో, నరకప్రాయమైన ఆ జీవితం కంటే ఈ నరకమే మేలేనేమోనని ఆ అతివ స్థిమితంగా ఉందేమో, అంతమంది జీవితాలను నాశనం చేశానని మా బస్సు డ్రైవర్ దుఃఖిస్తున్నాడో. లేక బాధల నుండి అందరికి ముక్తి చేకూర్చానని ఉప్పొంగిన గుండెలతో ఉన్నాడో...అందరూ ఎలా ఉన్నా నాలో ఉన్న కథకుడు మాత్రం నేను చూసిన, చేసిన ఈ మరణాంతర ప్రయాణాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాంక్ష మొదలయింది. ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ కోరిక తీవ్రమైంది. ద్వారం దగ్గరి అద్దాలలో నన్ను చూసుకున్నాను. నా ముఖంలో ఆందోళన ప్రస్పుటంగా కనబడుతోంది. ద్వారం దగ్గర ఉన్న భటుడు నన్ను ఆపాడు. నా ముఖం వైపు చూసి తీవ్రమైన కోరికలతో ఉన్న వాళ్ళు స్వర్గప్రవేశానికి అనర్హులు. కోరికలను తీర్చుకోవడానికి మరొక జన్మ ఎత్తుపో అంటూ తన శూలంతో నన్ను నెట్టి వేశాడు. భూమి మీద మళ్ళీజన్మెత్తాను. నాకు తెలిసిన కథనంతా ప్రపంచమంతా ఎలుగెత్తి చాటుతున్నాను. బతికుండగానే మంచి పనులు చేయండి,మరణిస్తే మీతో పాటూ ఏదీ రాదు అని గొంతు చించుకుని అరుస్తున్నాను. అరిచీ అరిచీ అలిసిపోయి చుట్టూ చూశాను. నన్ను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. తిరిగి మళ్ళీ అరవాలని గొంతెత్తాను. ఛీ ఎదవ కుక్క ఊరికే అరుస్తా ఉంది అంటూ ఎవడో రాయి విసిరాడు. కుయ్ మనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తాను నా నాలుగు కాళ్ళ మీద. - శ్రీకాంత్ రెడ్డి -
వీల్ చెయిర్ కాదు.. విల్ చెయిర్!
పర్వీందర్ చావ్లా వయసు 48 ఏళ్లు. వీల్ చెయిర్‌పై ఇప్పటికి ఆరు ఖండాలను చుట్టేశారు. 23 దేశాలను çసందర్శించారు. ఒక్కో దేశానికి ఒక్కసారి మాత్రమే కాదు, రెండు–మూడుసార్లు కూడా వెళ్లారు. ఆమె టూర్లలో జస్ట్.. అలా చూసి వచ్చేవి మాత్రమే కాదు, ఏదో ఒక సాహసం చేసేవే ఎక్కువగా ఉంటాయి. తైవాన్‌లో పారాగ్లైడింగ్ నుంచి ఈక్వెడార్‌లో జిప్‌లైనింగ్ చావ్లా చేసి వచ్చిన సాహసాలెన్నో! సవాళ్లతో పోరాడటమెలాగో జీవితాన్నుంచి నేర్చుకున్నానని అంటున్న చావ్లాను నిజానికి నడిపించింది వీల్ చెయిర్ కాదు.. ఆమెలోని విల్ పవర్ అనే చెయిర్. ఏడాదిలో ఎన్ని నెలలు పర్యటనల్లో గడిపితే, యాభై ఏళ్ల లోపు ఇన్ని దేశాలు తిరగడం సాధ్యమవుతుంది? ఈవిడేమైనా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారా అనిపిస్తుంది. అవును చావ్లా చక్రాలు కట్టుకుని దేశాలు పర్యటిస్తున్న మాట అక్షరాలా నిజం. నడవడానికి కాళ్లు సహకరించని స్థితిలో చక్రాల కుర్చీలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్న జీవితానికి ఇంతటి సాహసం అవసరమా అని అడిగిన వాళ్లతో ‘ఎప్పుడో ఓ రోజు చనిపోవాల్సిందే కదా? చనిపోతామేమోనని భయపడుతూ ఆసక్తులను చంపుకోవడం ఎందుకు? ప్రపంచంలోని సౌందర్యాన్ని వీక్షిస్తూ, పోయేలోపు ఎన్ని చూడటం సాధ్యమైతే అన్నింటిని చూడవచ్చు’’ అంటున్నారు. పదిహేనేళ్ల వయసులో..! ముంబయిలోని బాంద్రాలో నివసిస్తున్న పర్వీందర్ చావ్లా పుట్టింది లూధియానాలో. తండ్రి హోటల్ నడిపేవారు, తల్లి గృహిణి. నలుగురు పిల్లల్లో చిన్నమ్మాయి పర్వీందర్. పదిహేనేళ్ల వరకు ఆమె అందరిలాంటి అమ్మాయే. అప్పుడు బయటపడింది రుమటాయిడ్ ఆర్రై్థటిస్. అప్పటికే వారి కుటుంబం లూధి యానా నుంచి ముంబయికి మారిపోయింది. చావ్లా అల్లోపతి, హోమియోపతి... రకరకాల వైద్య విధానాలను పాటించారు. స్కూలు చదువు పూర్తయింది, కాలేజ్‌లో చేరింది కూడా. పన్నెండవ తరగతిలో ఫైనల్ పరీక్షలు. చేతి మణికట్టుని కదిలించలేకపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే ఒక ఇంజక్షన్ వేశారు. అది స్టిరాయిడ్స్ అని అప్పట్లో తెలియదు. మళ్లీ.. అక్క పెళ్లిలో! పెళ్లి వేడుక కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంతా. పర్వీందర్కి కూడా డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగింది. ఓ వారం ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు యుక్తవయసు పిల్లలంతా. ఓ రోజు ఉన్నట్లుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేల మీద చతికిలపడిపోయారు పర్వీందర్. ఒక మూల వీల్ చైర్లో కూర్చుని పెళ్లి వేడుకను గమనించిన పర్వీందర్కి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించింది. వీల్ చెయిర్ నుంచి రానురాను మంచానికే పరిమితమైతే... తల్లి మాత్రం ఎంతకాలమని చూస్తుంది? వాష్‌రూమ్ కెళ్లాలన్నా తల్లి సహాయం లేనిదే కదల్లేకపోతోంది. ఈ క్రమంలో ఓ రోజు ఒకరి మీద ఆధారపడి జీవించే స్థితి నుంచి తన కాళ్ల మీద తాను నిలబడి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు చావ్లా. ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీతోపాటు ప్రత్యామ్నాయ వైద్యవిధానాలన్నీ పాటించి తన పనులు తాను చేసుకోగలిగినట్లు దేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తర్వాత కాల్ సెంటర్లో పనిచేశారు. కొంతకాలం ‘బేబీ సిట్టింగ్’ (చంటిబిడ్డ తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లినప్పుడు తిరిగి వాళ్లు వచ్చే వరకు బిడ్డకు తోడుగా ఉండటం) ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. తండ్రి హోటల్ నడుపుతున్నాడు కాబట్టి తనకు అంతో ఇంతో పరిచయమున్న రంగం అదొక్కటే. అందుకే చావ్లా సొంతంగా కేటరింగ్ సర్వీస్ నడిపారు. అన్నింటికంటే ముందు ఏ విషయానికీ భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలగడం అలవాటు చేసుకున్నారు. తన మీద తనకు నమ్మకం కలిగింది. తాను ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన స్థితిలో లేదనే సంతోషం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే మరో మలుపు! కశ్మీర్‌కు టీమ్ టూర్ పర్వీందర్ స్నేహితులు కశ్మీర్‌లోని గుల్మార్గ్ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆమెను కూడా రమ్మని పిలిచారు. నిజానికి పర్వీందర్కు కూడా ఉన్న చోటనే ఉండిపోకుండా ఎక్కడికైనా వెళ్లాలని మనసులో ఉండేది. స్నేహితుల ఆహ్వానంతో సంతోషంగా ఆ టూర్ టీమ్‌తో కలిసిపోయింది. వెళ్లిన చోట స్నేహితులకు తన కారణంగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన వీల్ చైర్‌ను నడిపించడానికి ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారామె. మెత్తని పొడి లాంటి మంచు గడ్డకట్టిపోయి రాయిలా పేరుకుపోయిన గుల్మార్గ్లో ఎల్తైన పాయింట్‌కు చేరడం పర్వీందర్ దృష్టి కోణాన్ని మార్చేసింది. అప్పటి నుంచి పర్యటిస్తూనే ఉన్నారు. అన్నీ సోలో టూర్లే పర్వీందర్ తొలి పర్యటన స్నేహితులతో కలిసి వెళ్లినా కానీ, ఆ తర్వాత ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘నాకైతే కుటుంబం లేదు. వాళ్లకు కుటుంబం, పిల్లలు ఉంటారు. నేను చేసినన్ని పర్యటనలు చేయడం వాళ్లకు సాధ్యం కాదు కదా’ అంటారు నవ్వేస్తూ. ట్రావెల్ కంపెనీల టూర్ ప్యాకేజ్‌లలో చావ్లాను తీసుకెళ్లడానికి చాలా కంపెనీలు ససేమిరా అన్నాయి. ‘మీతోపాటు ఒక సహాయకుడిని తెచ్చుకోవాలి, మీరు ఆ ఖర్చు కూడా భరిస్తేనే సాధ్యమవుతుంది’ అని ఖండితంగా చెప్పేశారు. దాంతో టూర్ ప్యాకేజ్‌ల జోలికి వెళ్లకుండా ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘సోలో ట్రావెల్ చేయాలనుకున్న తర్వాత మలేసియా పర్యటన మాత్రం స్నేహితులతో వెళ్లాను. ఆ ట్రిప్‌లోనే రెండు రోజులు మా ఫ్రెండ్స్ టీమ్‌తో కాకుండా ఒక్కదాన్నే కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకుని వెళ్లాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అన్నీ సోలో పర్యటనలే’ అన్నారు పర్వీందర్. ‘‘గుల్మార్గ్లో ఎల్తైన శిఖరాన్ని చేరినప్పటి అనుభూతిని మాటల్లో చెప్పలేను. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. ఇలాంటి అద్భుతాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, అందమైన ప్రపంచం మొత్తాన్ని చూసి తీరాలనిపించింది. అదే (గుల్మార్గ్)నా పర్యటనలకు ఆది. అప్పటి నుంచి అలా ప్రయాణిస్తూనే ఉన్నాను’’ అని చెప్పారు. బుక్ చేసుకుని వెళితే.. అక్కడ హోటలే లేదు! పర్వీందర్ తన ప్లాన్లను వివరిస్తూ తనకు ఎదురైన క్లిష్టమైన పరిస్థితిని కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘తక్కువ లగేజ్‌తో టూర్ ప్లాన్ చేసుకుంటాను. తక్కువ బడ్జెట్ హోటళ్లలో దిగుతాను. చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా గది తీసుకోకుండా డార్మెటరీల్లో కూడా బస చేస్తాను. ఒకసారైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్లిన చోట.. ఉండాల్సిన హోటల్ లేనేలేదు! దానిని పడగొట్టేశారట. ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లో హోటల్‌కి చేరుకునే సరికి అదీ పరిస్థితి. అప్పుడు టైమ్ రాత్రి పదకొండు. క్షణం సేపు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఒకాయన దేవుడిలా కనిపించాడు. దగ్గరలో నా బడ్జెట్‌కు సరిపోయే హోటల్ ఎంత దూరంలో ఉందో, ఎలా చేరుకోవాలో వివరించి సహాయం చేశాడు’’ అని చెప్పారు.ఇంకా పర్యటన దాహం తీరలేదా అంటే చిరునవ్వుతో ‘‘నా పాస్‌పోర్టు పేజీలు ప్రపంచ పటంలోని అన్ని దేశాల స్టాంపులతో నిండిపోవాలి. అదే నా కల’’ అంటారు చావ్లా. పర్యటనలతో ప్రపంచదేశాల సంస్కృతితోపాటు అనేక విషయాలను తెలుసుకున్న పర్వీందర్ వాటన్నింటినీ తన బ్లాగ్‌లో పొందుపరుస్తున్నారు కూడా. – పర్వీందర్ చావ్లా – మంజీర -
హజ్ యాత్ర పేరుతో ట్రావెల్స్ నిర్వాకం..
సాక్షి, వైఎస్సార్ : ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో హజ్ యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసి కెఎస్ఎస్ ట్రావెల్స్ వారి నుంచి డబ్బులు, పాస్‌పోర్టులు వసూలు చేసి తరువాత నుంచి మొహం చాటేసింది. నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పస్టమైన సమధానం రాకపోవటంతో ప్రయాణికులు మోసపోయామని గ్రహించారు. ఈ విషయంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, వారు కట్టిన నగదును, పాస్‌పోర్ట్‌లను వెనక్కు ఇప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కడప ఎమ్మెల్యే అంజద్ బాషా డిమాండ్ చేశారు. ఈ ఘటనకు భాద్యులైన ట్రావెల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసిఐడి విచారణ జరిపించి, భాదితులకు సత్వర న్యాయం అందించాలని అంజద్ బాషా కోరారు. పోలీసులు ట్రావెల్స్ యజమానులపై కేసు నమోదు చేసి, ధర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ట్రావెల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నగదును పూర్తిగా కాకుండా వారి గురించి పూర్తిగా వాకబు చేసిన తరువాతే అడ్వాన్స్ చెల్లించాలని, ఈ విషయంలో అప్రమత్తత తప్పనిసరని జిల్లా ఎస్పీ సూచించారు. -
ఉమ్రా ముసుగులో ఘరానా మోసం
ప్రొద్దుటూరు క్రైం : ‘రెండు రోజుల్లో కేఎస్ఎస్ ట్రావెల్స్ చైర్మన్ విదేశాలకు చెక్కేసేవాడు. అదృష్టం కొద్దీ ఈ విషయం మాకు తెలిసింది.. లేదంటే బాధితులు మాపై దాడి చేసేవారు’ కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేటర్లు పోలీసుల వద్ద స్వయంగా అన్న మాటలు ఇవి. తక్కువ మొత్తంతో ఉమ్రా (పవిత్ర యాత్ర)కు పంపిస్తానని కేఎస్ఎస్ ట్రావల్స్ తరఫున పెద్ద సంఖ్యలో వసూళ్లు చేసి దగా చేయబోయిన సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ అబిది వ్యవహారం బట్టబయలైంది. వైఎస్ఆర్ జిల్లాలోని కడప కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా కేఎస్ఎస్ ట్రావెల్స్ బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఉమ్రా కోసం ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. వచ్చే ఏడాదిలో వెళ్లాలనుకునే వారి నుంచి రూ.14 నుంచి 25 వేలు, త్వరగా వెళ్లాలనుకునే వారి నుంచి రూ. 30– 35 వేలు వసూలు చేశారు. ఇక రంజాన్ నెలలో ఉమ్రా చేయాలనుకునే వారు రూ.60 వేలకు పైగా చెల్లించాల్సి వస్తుంటుంది. అయితే కేఎస్ఎస్ ట్రావెల్స్ వారు మాత్రం రూ.35 వేల నుంచి 40 వేలకే తీసుకెళతామని ప్రచారం చేయడంతో.. చాలా మంది బుక్ చేసుకున్నారు. అయితే రంజాన్ వచ్చేసినా ఏ తారీఖున పంపిస్తారన్నది తేల్చలేదు. హెడ్ ఆఫీసు నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం లేదని స్థానిక ఉద్యోగులు చెప్పారు. అయితే డబ్బు చెల్లించిన వారి నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ఉమ్రాకు వెళ్లే తేదీలను మార్చడంతో సిబ్బందికి సైతం సందేహాలు మొదలయ్యాయి. సిబ్బంది సాయంతో కేఎస్ఎస్ ట్రావెల్స్ మోసాలు వెలుగులోకి కేఎస్ఎస్ ట్రావెల్స్ చైర్మన్, భాగస్వాములు కలిసి దేశం విడిచి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆపరేటర్లకు సమాచారం అందింది. వాళ్లు విదేశాలకు వెళ్తే ఉమ్రా బాధితులు తమను చంపేస్తారని భావించారు. ఈ క్రమంలోనే చైర్మన్ ఉద్ద ఉన్న ఆపరేటర్ సలహా మేరకు అంతా సమావేశమై చర్చించి ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచనల మేరకు పక్కా ప్రణాళికతో బెంగళూరులో ఉన్న చైర్మన్, ఇతర భాగస్వాములను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆపరేటర్లు, సబ్ ఏజెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా చైర్మన్‌కు సంబంధించిన వ్యక్తులు తరచూ తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆపరేటర్లు వాపోతున్నారు. ఎంఐఎం ఆలీ ఎవరో మాకు తెలియదు.. పోలీసుల అదుపులో ఉన్న ఎంఐఎం ఆలీ ఎవరో తమకు తెలియదని ఆపరేటర్లు అంటున్నారు. అతనికి చైర్మన్ అల్తాఫ్హుస్సేన్ అబిదితో ఉన్న సంబంధం కూడా తెలియదని అంటున్నారు. ‘ఎంఐఎం ఆలీ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని అనేక సార్లు మా చైర్మన్ మాతో అనే వారు.. కొన్ని రోజుల క్రితం కూడా ట్రావెల్స్ డబ్బును అతను తీసుకున్నాడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయండని మా చైర్మన్ చెప్పారు’ అని ఆపరేటర్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ఈ కారణంతోనే ఆలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
క్షణాల్లో కాలిపోయిన బస్సు : తప్పిన ముప్పు
-
ఐదు ప్రైవేటు బస్సులు సీజ్
రంగారెడ్డి: నగరంలోని శంషాబాద్ సమీపంలో ఐదు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది. శుక్రవారం ఉదయం ఆర్టీఏ చేపట్టిన తనిఖీల్లో 23 బస్సులు నిబంధనలు పాటించకుండా దొరికాయి. వీటిలో ఐదు బస్సులను సీజ్ చేసిన అధికారులు మిగిలిన 18 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
మందుల మాఫియా బేరసారాలు
గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన నొప్పి నివారణ, నిద్ర మాత్రలను యథేచ్ఛగా రవాణా చేస్తున్న మాఫియా ముఠా తమ గుట్టు రట్టుకాకుండా ఉండటానికి ఎత్తులు వేస్తోంది. దుబాయ్‌లో 10 రోజుల కింద నిషేధిత మందులతో పట్టుబడిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ కుటుంబంతో రాజీకోసం ఈ ముఠా సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీనివాస్‌కు దుబాయ్‌కు వెళ్లడానికి ముందు మందుల పార్శిల్‌ను ఇచ్చిన వ్యక్తులపై కేసు పెట్టకుండా ఉండటానికి భారీ మొత్తంలో పరిహారం ఇవ్వడానికి ఈ ముఠా సభ్యులు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బాధితుడి భార్య లతిక, ఇతర కుటుంబ సభ్యులు గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ (జీఆర్‌ఎండబ్ల్యూఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చాంద్‌పాషాతో కలిసి తెలంగాణ సచివాలయంలోని ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేశారు. గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల విషయంపై శ్రీనివాస్‌కు ఎలాంటి అవగాహన లేదని, కేవలం సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అతను వారిచ్చిన మందుల పార్శిల్‌ను తీసుకువెళ్లి, పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే గల్ఫ్‌లో నిషేధించబడిన మందులను రవాణా చేయిస్తున్న మాఫియా ముఠా సభ్యులు తక్కువ వ్యవధిలోనే రూ.లక్షలు గడిస్తున్నారు. ఇప్పటివరకు మందుల మాఫియా సూత్రధారులెవరూ అరెస్టు కాలేదు. కేవలం మందుల రవాణా నేరం అని తెలియని అమాయకులే పట్టుబడ్డారు. శ్రీనివాస్ ఉదంతంతో తెలంగాణ ప్రభుత్వం పరిధిలోని ఎన్ఆర్ఐ సెల్ స్పందించింది. మందుల రవాణాపై దష్టి సారించాలని సీబీసీఐడీని ఆదేశించడంతో కేసును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అయితే సీబీసీఐడీ రంగంలోకి దిగితే మందుల మాఫియా సూత్రధారులు బట్టబయలు కావచ్చనే గుబులు మాఫియా ముఠాకు పట్టుకుంది. దీంతో వారు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలను మొదలు పెట్టారు. బాధిత కుటుంబంతో రాజీ చేసుకుంటే తమ బండారం బయటపడకుండా ఉంటుందని ముఠా సభ్యులు భావిస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల పరిహారం చెల్లించడంతోపాటు, జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను విడిపించడం కూడా తమ బాధ్యత అని ముఠా సభ్యులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకవేళ కేసు నమోదు అయితే మందుల మాఫియా గుట్టు రట్టు అవుతుందనే ఉద్దేశంతోనే ముఠా సభ్యులు రాజీ యత్నాలను తీవ్రం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే మందుల పార్శిల్‌ను ఇచ్చిన ముఠా సభ్యులు, శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇచ్చిన ట్రావెల్స్ యజమాని పరారీలో ఉన్నారు. చివరకు వారి సెల్ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం, అధికారులు స్పందించి మందుల మాఫియా గుట్టు రట్టు చేయాలని, మందుల ముఠా వలలో అమాయకులెవరూ చిక్కకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
మోదీ అన్నిదేశాలు ఎలా చుట్టొచ్చారంటే..
న్యూఢిల్లీ: 'దేశాన్ని అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోను' అని ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పించడం నాయకులకు అలవాటే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ఆ మాటను ఆచరించేవారు మాత్రం అరుదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా. దేశాభివృద్ధికి కీలకమైన విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు ఆయన కృషి అమోఘం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక విదేశీ పర్యటనలు చేసిన మోదీ అద్భుతమైన టైమ్ మేనేజ్ మెంట్‌తో క్షణకాలాన్ని కూడా వృధా చేయటంలేదు. ఎలాగంటే.. నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు నేరుగా నిర్దేశిత కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వెంటనే మరో కార్యక్రమం. లేదంటే మరో దేశానికి వెళ్లిపోతారు కానీ ఎక్కడా విశ్రాంతి కోసమో, భోజనం చేసేందుకో హోటళ్లకు వెళ్లరు. అలాంటి బ్రేక్‌ల వల్ల విలువైన సమయం వృథా అవుతుందని మోదీ భావిస్తారు. విదేశీ పర్యటనల సమయంలో ప్రధాని తన విమానం (ఎయిర్ ఇండియా వన్) లోనే నిద్రపోతారు. ఆ విధంగా సమయాన్ని ఆయన తన కంట్రోల్ లో ఉంచుకుంటారు. టైమ్ మేనేజ్ మెంట్ పై పూర్తి అవగాహన ఉండటం వల్లే ఆయన తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పర్యటించగలుగుతున్నారు. ప్రధాని మోదీ మార్చి 30 నుంచి ఏప్రిల్2 వరకు బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బ్రస్సెల్, అక్కడ నుంచి వాషింగ్టన్, అటు నుంచి రియాద్ వరకు ప్రయాణిస్తున్న సమయంలో మూడు రాత్రులు ఎయిర్ ఇండియా వన్ విమానంలోనే నిద్రపోయారు. కేవలం రెండు రాత్రులు మాత్రమే వాషింగ్టన్, రియాద్‌లోని హోటల్లోబస చేశారు. మోదీ విమానంలోనే నిద్రపోవటం వల్లే కేవలం 97 గంటల్లోనే అమెరికాలాంటి దేశాలతో కలుపుకుని మూడు దేశాల్లో పర్యటించడం సాధ్యమైందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలు, చాలా వరకు అంతార్జాతీయ సదస్సులు ఉండేవి. అవి కూడా ఏదో ఒక దేశానికే ప్రయాణించేలా ఉండేవి. రాత్రికి రాత్రి ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు సమయాన్ని హోటళ్లలో వృథా కాకుండా మోదీ విదేశీ పర్యటనలకు ప్రణాళికలు చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. రెండు సంవత్సరాలలో మోదీ 95 రోజులు విదేశాల్లో పర్యటించారు. గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ తొలి రెండు సంవత్సరాలలో 72 రోజులు విదేశాల్లో పర్యటించారు. రెండేళ్లలో 20 పర్యటనల్లో మోదీ 40 దేశాలు చుట్టారు. యూపీఏ1 హయాంలో మన్మోహన్ సింగ్ 15 పర్యటనల్లో 18 దేశాల్లో పర్యటించగా, యూపీఏ 2లో 17 పర్యటనల్లో 24దేశాల్లో మాత్రమే పర్యటించగలిగారు. -
అతడి ఆశయం అలుపెరుగదు!
ఎనభయ్యేళ్లు దాటాక ఎవరైనా ఏం చేస్తారు..? వాలు కుర్చీపై నడుం వాల్చి హాయిగా సేదదీరుతారు. గడచిన కాలాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవితాన్ని బేరీజు వేసుకుంటారు. తమ జ్ఞాపకాల ప్రయాణంలో ఎక్కడో ఓ చోట ఆగి, సంతృప్తి చెందిపోతారు. కానీ, పానిపట్టుకు చెందిన 81 ఏళ్ల ‘బగీచా సింగ్’ అలా కాదు. అతడి శరీరంలో శక్తి ఉన్నన్నాళ్లూ సంతృప్తి అన్న పదానికి తావే లేదంటాడు. అలుపెరుగని ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో 5 లక్షల 70 వేల కిలోమీటర్లు నడిచాడు. ఇంకా నడుస్తూనే ఉంటానని చెబుతున్నాడు. ఇంతకీ ఎందుకీ ప్రయాణం..? దేనికోసం అతడి ప్రయత్నం..?? బగీచా సింగ్‌కు చిన్ననాటి నుంచే దేశానికి సేవచేయాలనే కోరిక ఎక్కువ. తన చదువు పూర్తికాగానే తల్లిదండ్రులతో అదే విషయాన్ని చెప్పేశాడు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాననీ..! చెప్పినట్టుగానే బగీచా వివాహం చేసుకోలేదు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ సేవకు పరితపించాడు. పొగ తాగడం, మద్యాన్ని సేవించడం అత్యంత ప్రమాదకరమని ఆయన బలంగా నమ్మాడు. వీటి కారణంగానే దేశ ప్రగతి కుంటుపడే ప్రమాదముందని గ్రహించాడు. అంతే.. అప్పటి నుంచీ పొగాకు, మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 1993, ఫిబ్రవరి 22 నుంచి ఈయన ప్రయాణం విభిన్నంగా సాగింది. ధూమపానం, మద్యపానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయాలనుకున్నాడు. అయితే, అందుకు సరిపడా సొమ్ము ఆయన దగ్గరలేదు. అంతే.. ఓ పెద్ద బ్యాగులో తనకు కావాల్సిన వస్తువులన్నీ పడేసి, నడుంపై మోసుకుంటూ నడక ప్రారంభించాడు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకూ కాలినడకన తిరిగి మొదటి పర్యటన పూర్తిచేశాడు. అలా గడచిన 23 ఏళ్లలో 22 సార్లు దేశాన్ని చుట్టేశాడు. దాదాపు 5 లక్షల 70 వేల కి.మీ పైచిలుకు దూరాన్ని కాలినడకన తిరిగాడు. మార్గమధ్యంలో కనిపించేవారికి పొగాకు, ఆల్కహాల్, బాల కార్మికులు, అవినీతి లాంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాడు. రెండు జాతీయ జెండాలను కట్టి ఉంచిన తొంభై కేజీల బ్యాగును మోసుకుంటూ.. విభిన్నంగా కనిపిస్తాడు బగీచా. తన ప్రయాణం గురించి అతన్ని ప్రశ్నిస్తే.. ఎన్నో మధుర జ్ఞాపకాలను మనతో పంచుకుంటాడు. తన ప్రయాణంలో ఎందరో రాజకీయ ప్రముఖులను, సెలబ్రిటీలను కలుసుకున్నాడు. ఓ సారి ఏనుగులను కూడా..!! ‘‘తేజ్‌పూర్ నుంచి గువాహటికి వెళ్తున్నప్పుడు ఓ అడవిని దాటాల్సివచ్చింది. ఆ అడవిలో ఏనుగుల గుంపు ఉంటుందని, వాటికి అరటిపండ్లు ఇవ్వకపోతే అడుగుకూడా కదలనివ్వవని విన్నాను. వెంటనే ఆరు కిలోల పండ్లు కొని, ప్రయాణం మొదలుపెట్టాను. ఊహించినట్టుగానే ఏనుగులు నన్ను అడ్డుకున్నాయి. వాటికి నా దగ్గరున్న బహుమతులు అందించాను. అంతే.. సంతృప్తిగా అవి దారినిచ్చాయి. అయితే, కొద్ది సేపటికే నాగా గిరిజనులు నన్ను అడ్డగించారు. నా వస్తువులన్నిటినీ లాక్కున్నారు. సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది. ఏనుగులు నా వెనకే వస్తూ గిరిజనులను చెల్లాచెదురు చేశాయి. నా బ్యాగును మోసుకుంటూ, నాతోపాటే రోడ్డు వరకూ నడిచాయి. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అదే..’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నాడు బగీచా. -
పండక్కి పిండుకుంటున్నారు!
-
పండక్కి పిండుకుంటున్నారు!
► ప్రైవేట్ ఆపరేటర్ల అడ్డగోలు దందా ► తత్కాల్ పేరిట నిలువు దోపిడీ ► రెండు, మూడు రెట్లు అధికంగా బాదుడు ► క్యాబ్‌లు, కార్ల అద్దెలు చుక్కల్లో ► రూ. 100 కోట్లు దండుకునేందుకు సిద్ధం ► ప్రయాణమంటే హడలిపోతున్న జనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండుగ ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఈ సీజన్లో ప్రైవేట్ ట్రావెల్స్ పంట పండుతోంది. ట్రావెల్స్ యాజమాన్యాలు తత్కాల్ పేరిట నిలువు దోపిడీకి తెర తీశాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ కూడా ఇష్టమొచ్చినట్లు టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు వీలుగా ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి సర్కారు పరోక్షంగా సహకరిస్తోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతామని ప్రకటించి వాటిని నడపకపోవడంతో ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న సచివాలయ ఉద్యోగి రామసుబ్బారావు సంక్రాంతి పండుగకు విజయనగరం జిల్లా సాలూరు వెళ్లేందుకు పది రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుందామనుకుని ఆర్టీసీ కౌంటర్‌కు వెళ్లగా, టిక్కెట్లు లేవని చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించాడు. వారు ముందస్తు రిజర్వేషన్లు బ్లాక్ చేశారు. డిమాండ్‌ను బట్టి చార్జీ ఉంటుందని చెప్పడంతో విశాఖపట్నం వరకు నాన్ ఏసీ టిక్కెట్టు రూ.1,900 పెట్టి కొనక తప్పలేదు. ప్రైవేట్ బస్సుల చార్జీలు మండిపోతుండడంతో మరో ఉద్యోగి వేణుగోపాలరావు తన కుటుంబంతో కలిసి సొంతూరు కృష్ణా జిల్లా గుడివాడకు క్యాబ్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్యాబ్ అద్దె రూ.17 వేలు, డ్రైవర్ బత్తా, ఇతరాలన్నీ కలిపి రూ.20 వేలకు తక్కువ కాదని చెప్పడంతో చేసేదేమీ లేక డబ్బులు చెల్లించి, బుక్ చేసుకున్నాడు. రూ.100 కోట్లు దండుకునే ఎత్తుగడ సాధారణ రోజుల్లో ప్రైవేట్ ఆపరేటర్లు రోజుకు దాదాపు రూ.5 కోట్లు వ్యాపారం సాగిస్తారు. క్రిస్మస్ సీజన్ నుంచి సంక్రాంతి ముగిసేవరకు చార్జీలను రెండు మూడు రెట్లు పెంచేసి రూ.100 కోట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సీజన్లో ముందస్తు రిజర్వేషన్లను నిలిపివేసి, తత్కాల్ విధానానికి తెర తీశారు. డిమాండ్‌కు సొమ్ము చేసుకొనేందుకు ప్రణాళిక రచించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ ధర సాధారణ రోజుల్లో రూ.600 ఉంటే, గతేడాది సంక్రాంతి సీజన్లో రూ.1,800 వసూలు చేశారు. ఇప్పుడు ఈ అడ్డగోలు వసూలుకు తత్కాల్ ధర అని ముద్దు పేరు పెట్టారు. డిమాండ్‌ను బట్టి రూ.2,500 పైగా వసూలు చేసేందుకు నిర్ణయించారు. ఇక ఏసీ ధర సాధారణ రోజుల్లో రూ.1,000 కాగా, గత సంక్రాంతి సీజన్లో రూ.2,600 వసూలు చేశారు. ఈసారి రూ.3,000 పైగానే దండుకొనే పరిస్థితి కనిపిస్తోంది. క్యాబ్‌లను కదిలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే కుటుంబ సమేతంగా ప్రయాణం చేసేవారు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి భయపడి క్యాబ్‌లు, కార్లను ఆశ్రయిద్దామనుకుంటే వాటి ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు క్యాబ్‌లో వెళ్లాలనుకుంటే కిలోమీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా ధర నిర్ణయిస్తున్నారు. డ్రైవర్ బత్తా సాధారణంగా రోజుకు రూ.100 నుంచి రూ.200 ఉంటే, ఈ సీజన్లో రూ.2,000 నుంచి రూ.3,000 వేల వరకు చెబుతున్నారు. అడ్డుకోండి చూద్దాం రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. రోడ్లపై తమ బస్సులను ఆపే దమ్ము ఎవరికీ లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు ప్రముఖ ట్రావెల్స్ సంస్థలుండడంతో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయాలంటే జంకుతున్నారు. ప్రైవేట్ బస్సుల చార్జీలను కట్టడి చేసే అధికారం తమకు లేదని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. ప్రైవేట్ ఆపరేటర్లు అధిక చార్జీలను వసూలు చేస్తే సీజ్ చేస్తామని బీరాలు పలికిన ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో ఒక్క బస్సును కూడా సీజ్ చేయలేదు. ఒక్క కేసూ నమోదు చేసిన పాపాన పోలేదంటే వారికి ప్రభుత్వం ఎంతగా సహకరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. -
‘ఆర్ఐఓ’లో అవినీతి దందా
ఇంటర్మీడియట్ ప్రాంతీయ కార్యాలయంలో తాజాగా కారు రూపంలో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా తప్పుడు బిల్లులతో అద్దె వాహనం పేరుతో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేస్తున్నారు. సుమారు రూ.ఎనిమిదిన్నర లక్షల వరకు ఓ అధికారి తప్పుడు బిల్లులతో స్వాహా చేశారు. కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోరుగా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. వివిధ కళాశాల ప్రిన్సిపాళ్లు సైతం ఈ వ్యవహారంపై విస్మయం చెందుతున్నారు. - నిజామాబాద్ అర్బన్ * సొంత కారుకు అద్దెవసూలు * మూడేళ్లుగా కొనసాగుతున్న వైనం.. * సుమారు రూ.8.50లక్షలు స్వాహా జరిగిందిలా.. ఆర్ఐఓ కార్యాలయానికి ఓ అధికారి 2012లో బదిలీపై వచ్చాడు. ఇతను మూడేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్నారు. పరిపాలన విధానం సాధారణంగా ఉండడం, కార్యాలయం సైతం శివారు ప్రాంతంలో ఉండడంతో ఉన్నతాధికారుల పరిశీలన లేకపోవడంతో కార్యాలయంలో ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. ఓ అధికారి తన సొంత కారును అద్దెవాహనంగా చూపిస్తున్నారు. కంఠేశ్వర్‌లోని ఓ ట్రావెల్స్‌కు చెందిన ఇండిక కారును అద్దె పేరిట ఆర్ఐవో కార్యాలయంలో కొనసాగుతున్నట్లు చూపిస్తున్నారు. నెలకు రూ.24 వేలు పొందుతున్నాడు. ఇందుకుగాన బిల్లులును సమర్పించిన కంఠేశ్వర్‌లోని ఓ ట్రావెల్ యజమానికి రూ.3 వేలు ఇస్తున్నారు. మిగితా రూ.21వేలను అధికారి జేబులో వేసుకుంటున్నారు. దీనికిగాను బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని లెక్చరర్, ట్రావెల్ యజమానికి మధ్యవర్థుత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ట్రావెల్స్ యజమాని బిల్లులో ఇండికా కారును ఆ వివరాలను చూపిస్తున్నాడు. కాని సంబంధిత కారు నాలుగు సంవత్సరాల క్రితమే ఆ కారు మరోకరికి విక్రయించడం జరిగింది. ట్రావెల్స్‌లో సంబంధిత నెంబర్లపై ఇండికా కార్లు లేవు. ఇలా అధికారి ట్రావెల్స్నుండి తప్పుడు బిల్లులు తీసుకుంటు అద్దె వాహనం పేరిట రూ.ఎనిమిదన్నర లక్షల రూపాయలను స్వాహా చేశారు. యూజమాన్యాల కానుక జిల్లాకు వచ్చిన ఆర్ఐవో కార్యాలయంలోని ఓ అధికారికి జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు కానుకగా ఒక కారును కొన్నిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రస్తుతం అదేకారులో ఆయన తిరుగుతున్నారు. కాని ట్రావెల్స్ నుండి అద్దె వాహనం సమకూర్చుకున్నట్లు బిల్లులు సృష్టించి డబ్బులు స్వాహా చేస్తున్నాడు. కార్యాలయంలో ఓ ఉద్యోగి తప్పుడు బిల్లులు ఉన్నందున తాను సంతకాలు పెట్టలేనని తీవ్రం గా మండిపడినట్లు తెలిసింది. లెక్చరర్ల సంఘం నాయకుడితో రెండుసార్లు సదరు ఉద్యోగిని హెచ్చరింపజేసినట్లు సమాచారం. మూడేళ్లుగా ఆర్ఐవో కార్యాలయంలో ఈ తతంగంగా కొనసాగుతున్నా బయటకు రాకపోవడం గమనార్హం. కార్యాలయంలోని ఉద్యోగులందరు సమన్వయంతో ఈ అవినీతి బాగోతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సత్వరమే విచారణ జరిపించాలి ఆర్ఐఓ కార్యాలయంలో అద్దె వాహనం పేరిట నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపాలి. సొంత కారుకు అద్దె పేరిట అధికారులు డబ్బులు స్వాహా చేయడం మూడేళ్లుగా లక్షలాది రూపాయలను కాజేయడంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం. - శ్రీనివాస్‌గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
మెట్రో రైలెక్కిన ప్రధాని మోదీ
-
చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు
పెద్దాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని పుట్టగొడుగుల ప్యాక్టరీ వద్ద మంగళవారం జరగింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున ట్రావెల్స్ బస్సు ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో దాన్ని తప్పించడానికి ప్రయత్నించి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. రాత్రి నుంచి వర్షం పడుతుండటం, రోడ్డు చిత్తడిగా ఉండటంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెండు చెట్లను ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జుకాగా.. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
నడిరోడ్డుపై ప్రయాణికులను వదిలేశారు!
-
డిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్లో శనివారం ప్రయాణించారు. దౌలాకువా స్టేషన్ నుంచి ద్వారకా వరకు ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ప్రారంభించడం కోసం వెళ్తూ ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. భద్రతా ఏర్పాట్ల కారణంగా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందిని కలుగుతుందనే ప్రధాని మెట్రోలో ప్రయాణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాల్సిందిగా శ్రీధరన్ తనకు ఎప్పుడూ చెబుతుండేవారని ప్రధాని మెట్రో ప్రయాణం తరువాత ట్వీట్ చేశారు. ఈ రోజు ద్వారకా ప్రయాణం సందర్భంగా తనకు ఈ ఆవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణాన్ని తాను నిజంగా ఆస్వాదించినట్లు వివరించారు. అయితే ప్రధాని మెట్రో పర్యటనపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. నిత్యం మెట్రోలో ప్రయాణించే చాలా మంది మాదిరిగానే ప్రధాని ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తన ప్రయాణం ద్వారా మెట్రోను ప్రజలు తరచుగా వాడాలన్న సందేశాన్ని పంపించారన్నారు. మోదీ తన సహచరులకు సైకిల్ వాడాలన్న సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. -
పోలీస్ టూర్స్ & ట్రావెల్స్
-
పెళ్లి కళ వచ్చేసిందే బాలా..
ఈనెలలో వేలాది వివాహాలు ముస్తాబవుతున్న వేదికలు పరిమిత ముహూర్తాలతో పెళ్లి ఏర్పాట్లకు భారీ డిమాండ్ మూడు ముళ్లు.. ఏడడుగులు.. పెళ్లంటే రెండు మనసులు ఒక్కటయ్యే శుభ ఘడియలు. అందుకే అంత ఆనందం. చూసిన వారికి సైతం ముచ్చట గొలిపే వేడుకది. అందుకే అంత వైభోగం. శ్రావణం మాసం రావడంతో సుముహూర్తాలు సమీపించాయి. వేదికలు సిద్ధమవుతున్నాయి. పట్టు చీరల రెపరెపలు.. సుగంధ పరిమళాలు.. పిండి వంటల ఘుమఘుమలు.. వివాహ మహోత్సవానికి శోభను చేకూర్చే విషయాలు. పెళ్లి సందడిపై ప్రత్యేక కథనం.. విశాఖపట్నం-కల్చరల్ : శ్రావణ మాసం వచ్చింది.. మంచి ముహూర్తాలెన్నో తెచ్చింది. కల్యాణ మండపాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. మూఢం ముగిశాక ఈనెల 13, 14, 15 తేదీల్లో సుముహూర్తాలు ఉండటంతో పెద్దలు పెళ్లి పనుల్లో బిజీబిజీ అయిపోయారు. 19వ తేదీన బలమైన ముహూర్తం కావడంతో ఆరోజు వెయ్యికిపైగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెప్పారు. ఈ రోజుల్లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో నగరంలోని కల్యాణ మండపాలతోపాటు క్యాటరింగ్, వీడియో తీసే వారికి డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు చిన్న, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ఫ్లవర్ డెకరేషన్ ట్రూప్స్‌ను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద హోటల్ రూమ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. నగరంలో 500లకు పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు. ముచ్చటైన వేదికలు పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పెద్దపెద్ద గ్రౌండ్స్‌లో అపురూపమైన సెట్టింగ్‌లు వేసి, ఇంకెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. సెట్టింగులు వేయడానికి చెన్నై నుంచి ఆర్ట్ డెరైక్టర్లను కూడా రప్పిస్తున్నారు. ది పార్క్ హోటల్ లాన్లో ఓపెన్ ఫంక్షన్ హాల్‌ను కళ్లు చెదిరేలా రూపొందిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్నవారు సైతం క్లోజ్‌గా వీక్షించడనాకి ప్రొజెక్టర్తోపాటుగా వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో 270 ఫంక్షన్ హాల్స్‌ను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జీవీఎంసీ.ఓఆర్జీ.ఇన్) ఇక ప్రైవేటుగా సుమారు 1500కుపైగా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ..అందుకే శ్రావణమంటే క్రేజ్ శ్రావణంలో పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సహజంగానే ఈ మాసంలో పెళ్లిని సుముహూర్తంగా భావిస్తారు. అందుకే శ్రావణమంటే క్రేజ్. చాలా అడ్వాన్సుగా శ్రావణం సీజన్ ముహూర్తాలకు వివాహ వేదికలన్నీ బుక్ అయిపోయాయి. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఫంక్షన్ హాళ్లు పెరిగాయి. అయితే కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు ఉండటం లేదు. అవసరం కోసం జనం అడ్జస్టయిపోతున్నారు. వాహనాల పార్కింగు సదుపాయం లేని ఫంక్షన్ హాళ్లకు అనుమతించరాదనే నిబంధన అధికారులు అమలుచేయాలి. - యు.నాగభూషణం, వైశాఖి జల ఉద్యానవనం -
షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ : షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రా ఉస్మానాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 12మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానాబాద్ లోని ఆస్పత్రికి తరలించినట్లు షిర్డీలోని ఎస్వీఆర్ ట్రావెల్స్ ఎండీ బోస్ తెలిపారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో షిర్డీకి తరలించినట్లు ఆయన చెప్పారు. బాబా దర్శనం అనంతరం వారిని హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు. -
టీడీపీ ట్రావెల్స్ దందా