సింగపూర్: కోవిడ్–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్ సడలిస్తోంది. తాజాగా, భారత్ సహా ఐదు దక్షిణాసియా దేశాలను బుధవారం నుంచి ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆం క్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment