
సాక్షి,హైదరాబాద్ : మాదాపూర్‌లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సాయిచరణ్‌తో పాటు మరో వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి ,రాహుల్ ,సుబ్రహ్మణ్యంలను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ సరఫరా దందా జరిగేది ఇలా
నార్కోటిక్ పోలీసుల వివరాల మేరకు..సాయి చరణ్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించేందుకు నగరంలో పలు ట్రావెల్స్ ఏజెన్సీలకు చెందిన డ్రైవర్లను నియమించుకున్నాడు. వారికి బెంగళూరులో డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.ఇలా, 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాపారస్తులు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారేనని నార్కోటిక్ పోలీసుల విచారణ తేలింది. సాయిచరణ్‌తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment