breaking news
Madha pur
-
మాదాపూర్‌లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం
సాక్షి,హైదరాబాద్ : మాదాపూర్‌లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సాయిచరణ్‌తో పాటు మరో వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి ,రాహుల్ ,సుబ్రహ్మణ్యంలను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది.డ్రగ్స్ సరఫరా దందా జరిగేది ఇలానార్కోటిక్ పోలీసుల వివరాల మేరకు..సాయి చరణ్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించేందుకు నగరంలో పలు ట్రావెల్స్ ఏజెన్సీలకు చెందిన డ్రైవర్లను నియమించుకున్నాడు. వారికి బెంగళూరులో డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.ఇలా, 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాపారస్తులు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారేనని నార్కోటిక్ పోలీసుల విచారణ తేలింది. సాయిచరణ్‌తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. -
హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ‘స్వర్ణ నఖషీ’
‘స్వర్ణ నఖషీ’ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదంటే వూదాపూర్ నోవాటెల్ హోటల్లో నిర్వహిస్తున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌కు వెళ్లాల్సిందే. ‘స్వర్ణ నఖషీ’ అనేది రాజస్థాన్ జోధ్‌పూర్ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన హస్తకళ. బంగారాన్ని తాపడం చేసి విభిన్న రకాల ఆకృతులు, ఆభరణాలను రూపొందించే ఈ ఆర్ట్‌కు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఉంది. ఈ అపురూప గోల్డ్ ఎంబోజింగ్ కళాఖండాలు రెండు వేలు మొదలుకుని తొంభై వేల రూపాయుల వరకు అందుబాటులో ఉన్నాయి. ఒడిశా నుంచి తరలివచ్చిన పటచిత్ర వస్త్రశైలులు, ముంబై నుంచి తెచ్చిన డిజిటల్ ప్రింటెడ్ బ్యాగులు, మొబైల్ ప-చ్‌లు (రూ.300 నుంచి రూ.2,000), ఉత్తరప్రదేశ్ టెర్రాకోటా, స్టోన్ప-డర్, పాలిస్టోన్ల మేళవింపుతో రూపొందిన గ-తమబుద్ధ తదితర ఆకృతులు (రూ.750 -రూ.2.50 లక్షలు) ఆకర్షణీయుంగా ఉన్నారుు. వీటితో పాటు డిజైనర్ దుస్తులు, ఇతర ఉత్పత్తులు కూడా కొలువుదీరిన ఈ వుూడు రోజుల ప్రదర్శనను ఉదయుం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.