రాష్ట్రంలో పండుగ ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఈ సీజన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ పంట పండుతోంది. ట్రావెల్స్ యాజమాన్యాలు తత్కాల్ పేరిట నిలువు దోపిడీకి తెర తీశాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ కూడా ఇష్టమొచ్చినట్లు టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు వీలుగా ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి సర్కారు పరోక్షంగా సహకరిస్తోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతామని ప్రకటించి వాటిని నడపకపోవడంతో ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది.