శుభకార్యం కోసం బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిరలో శనివారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పాగోడ మండలం పడవళ్లికి చెందిన గోవింద్‌నాయక్ (43) మడకశిరలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఈ రోజు ఉదయం కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు అతన్ని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతని పై పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.