నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Fri, Feb 24 2017 8:06 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నకిరేకల్‌(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న కెమికల్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి.

వివారాలు.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన జిల్లాలోని నకిరేకల్‌ మండలం ఐటిపాముల సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement