
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
#UPDATE कन्नौज: SP अमित कुमार ने बताया, "लखनऊ-आगरा एक्सप्रेसवे पर बस-पानी के टैंकर की टक्कर में 8 लोगों की मौत हो गई है और 19 लोग घायल हुए हैं। सभी घायलों का सैफई मेडिकल कॉलेज में इलाज चल रहा है..." pic.twitter.com/yqTBgCNHQQ
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని సైఫై ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్,పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగే సమయంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే ఉన్నత వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాల్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని కన్నౌజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు.