uttarapradesh
-
మహాకుంభమేళా ముగింపు.. ఆవిష్కృతం కానున్న మరో అద్భుత ఘట్టం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో ఏడు గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్లు ఒకే సరళరేఖపై రానున్నట్లు తెలుస్తోంది.ఈ గ్రహాల సమన్వయం నెగటివ్ గ్రహ ప్రభావాలను తగ్గించి, ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళా తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది.మహాశివరాత్రిపై గ్రహ ప్రభావంజ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ శుక్లా గ్రహాల కదలికల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, శని కుంభ రాశిలో ఉండగా, బృహస్పతి వృషభ రాశిలో ఉండటం మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26న గ్రహాల శక్తివంతమైన సమన్వయంతో జరగనుంది. ఆరోజు చంద్రుడు, బుధుడు, సూర్యుడు శని కుంభ రాశిలో ఉండగా, శుక్రుడు, రాహు మీన రాశిలో ఉండగానే బృహస్పతి వృషభ రాశిలో ఉండనుంది. ఈ గ్రహాల మార్పుతో ఫిబ్రవరి 28న గ్రహాలు ఒకే సరళరేఖ వైపు పయనిస్తాయని అన్నారు. ఫలితంగా ప్రతికూలతలు తొలిగి శుభపరిణామాలు జరుగుతాయని శుక్లా తెలిపారు. గ్లోబల్ మార్పుఫిబ్రవరి 26, 2025న గ్రహాల సమన్వయంతో ప్రపంచంలో ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ మాట్లాడుతూ.. 2019 నుండి ప్రపంచాన్ని అనేక ప్రతికూల పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. కోవిడ్-19 ,ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం దేశాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే, గ్రహాల మార్పులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. శాంతి, స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. -
40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశంలో 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళాకు సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.12 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు.जहां संस्कृतियों का संगम भी है, श्रद्धा और समरसता का समागम भी है।'अनेकता में एकता' का संदेश देता महाकुम्भ-2025, प्रयागराज मानवता के कल्याण के साथ ही सनातन से साक्षात्कार करा रहा है।#एकता_का_महाकुम्भ pic.twitter.com/kZt5xtBItW— Yogi Adityanath (@myogiadityanath) January 13, 2025 -
ఏడు ఆపరేషన్లు, ఏడు లక్షలు ఖర్చు, చివరికి ఏడడుగులు: ముద్దుగుమ్మల లవ్‌స్టోరీ
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల స్నేహం వీర ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటలోఒక అమ్మాయి తన లింగాన్ని మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయి ఏకంగా ఏడుసార్లు లింగ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లు చేయించుకుంది ఇందుకోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. అంతేకాదు ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగాజరిగిన పెళ్లి వేడుకలో ఏడడుగులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.#UttarPradesh | Two girls got married, with one undergoing a gender change to become a man and taking on the role of the groom.This unique marriage has become the talk of the entire Kannauj district!What are your thoughts about this marriage? pic.twitter.com/w2Jskwytk2— Organiser Weekly (@eOrganiser) December 20, 2024 కన్నౌజ్‌లోని సరయామీరాలో ఉన్న డెవిన్ తోలా ప్రాంతానికి వీరిద్దరూ ఇటీవల కొన్ని రిలేషన్షిప్లో ఉన్నారట. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో తన లింగాన్ని మార్చుకొని మరీ స్నేహితురాల్ని పెళ్లాడింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బదౌన్‌కు చెందిన ఓ యువతి టీచర్ గా పని చేసేందుకు బరేలీకి వచ్చింది. అక్కడ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే పెళ్లి, లేదంటే చావు అన్న స్థితికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల చొరవతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అన్ని అవరోధాలు అధిగమించిన తరువాత వివాహం చేసుకున్నారు. -
UP : ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. #UPDATE कन्नौज: SP अमित कुमार ने बताया, "लखनऊ-आगरा एक्सप्रेसवे पर बस-पानी के टैंकर की टक्कर में 8 लोगों की मौत हो गई है और 19 लोग घायल हुए हैं। सभी घायलों का सैफई मेडिकल कॉलेज में इलाज चल रहा है..." pic.twitter.com/yqTBgCNHQQ— ANI_HindiNews (@AHindinews) December 6, 2024కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని సైఫై ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్,పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగే సమయంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే ఉన్నత వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాల్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని కన్నౌజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. -
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్
లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు. ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. -
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
-
శుభవార్త.. హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు
భారతదేశంలో పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ వాహనాల వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వం నిషేదించింది. దీనికి ప్రధాన కారణం పర్యావరణ హితమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యూపీ ప్రభత్వం తీసుకున్న నిర్ణయంతో మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించలేదు, కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు ఉత్తమ అమాంకాలను పొందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.ప్రస్తుతం గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ధర యూపీలో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కస్టమర్ లాభంపొందవచ్చు. హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్ రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన కేవలం యూపీ ప్రభుత్వం మాత్రమే ప్రకటించింది. ఈ నిరయాన్ని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోడ్లమీద హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. -
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు. 1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు. #WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7 — ANI (@ANI) February 17, 2024 -
దివ్యాంగునిపై పోలీసుల దారుణం.. నీళ్లు అడిగాడని.. వీడియో వైరల్..
లక్నో: దివ్యాంగునిపై ఇద్దరు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నీళ్లు అడిగినందుకు అర్థరాత్రి అతనిపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముడు చక్రాల బండిలో కూర్చున్న వ్యక్తి పేరు సచిన్ సింగ్. 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. స్థానికంగా సిమ్‌లు అమ్మతుంటాడు. ఓ రెస్టారెంట్లో సప్లయర్‌లా కూడా పనిచేస్తాడు. శనివారం రాత్రి పని ముగించుకుని వస్తుండగా.. అతనికి ఓ తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న చెరువులో వదిలి వస్తుండగా.. పోలీసులు ఎదురైనట్లు చెప్పారు. చేతి కడుకోవడానికి నీళ్లు అడిగిన క్రమంలో పోలీసులు ఫైరనట్లు వెల్లడించారు. In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G — Piyush Rai (@Benarasiyaa) July 30, 2023 చేతికి తాబేలు వాసన కారణంగానే తాను నీళ్లు అడినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. విచక్షణా రహితంగా తలపై కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానిక ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరు పోలీసులను రాజేంద్ర మని, అభిషేక్ సింగ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందినవారిగా గుర్తించారు. విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. -
KSR కామెంట్ : తెలంగాణ లో యూపీ తరహా పాలన తెస్తామంటున్న కమలం
-
బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై.. రోజుల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్
BJP MLA Mukesh Verma Quits Party: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణల పరంపర కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన మర్నాడే ధారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత మళ్లీ మరో ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడిన కులాలను విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలను పట్టించుకోలేదని, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచిందని వర్మ ఆరోపించారు. అంతేకాదు ఆయన ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను అణగారిన వర్గాల నాయకుడిగా తన రాజీనామలేఖలో పేర్కొన్నారు. అయితే వర్మ తాను ఏ పార్టీలోకి వెళ్తున్నదీ చెప్పలేదు. ఈ మేరకు రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం ఆ పార్టీకి షాక్‌కి గురిచేసే అంశమే! (చదవండి: బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు) -
‘అధికారంలోకి వస్తే.. విద్యుత్ ఉచితంగా ఇస్తాం’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దూకుడు పెంచారు. అందులో భాగంగానే సామాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామరని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల డొమెస్టిక్ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయంలో ఇబ్బంది కలగకుండా ఉచితం విద్యుత్ అదిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలవలేదని, అది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. వలస కార్మికులు వందల కీలోమీటర్లు రోడ్లపై నడుస్తూ రాష్ట్రానికి చేరుకున్నారని, వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులను నమోదు చేస్తోందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అఖిలేష్ యాదవ్ సంతాపం వ్యక్తంచేశారు. -
దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర
భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినందుకు గుర్తుగా ప్రతి ఏడాది నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఉత్తరాఖండ్‌వాసులు ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ దినోత్సవాన్నిఉత్తరాఖండ్ డే లేదా ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే లేదా ఉత్తరాఖండ్ దివాస్‌గా జరుపుకుంటున్నారు ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర: భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో ఆమోదించబడిన తరువాత యునైటెడ్ ప్రావిన్సులు ఉత్తరప్రదేశ్‌గా మారాయి. ఇది ఆ తరువాత భారతదేశ రాష్ట్రంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసుల అంచనాలను అందుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది గానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులకు సరైన జీవనోపాధి అవకాశాలను అందించడం కోసమే ఉత్తరాఖండ్ క్రాంతి దళం ఏర్పడింది. అంతేకాదు అక్టోబర్ 2,1994న హింసాత్మక ఉద్యమం కారణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ దళంలోని వ్యక్తులను విజయవంతంగా నియంత్రించలేకపోయారు. ఆ తర్వాత చివరకు చాలా సుదీర్ఘ కాల పోరాటం తర్వాత ఉత్తరాఖండ్ వంబర్ 9, 2000న ఉత్తరాంచల్‌గా ఏర్పడింది. ఈ మేరకు ఉత్తరాంచల్ రాష్ట్రం కాస్త జనవరి1, 2007న ఉత్తరాఖండ్గా మారింది. పైగా 2020 మార్చిలో గైర్‌సైన్‌ని ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా పిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ శీతాకాల రాజధానిగా డెహ్రాడూన్‌ని పిలుస్తారు. ఈ రాష్ట్రాన్ని దేవతల భూమి లేదా "దేవభూమి" అభివర్ణిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటివి క్షేత్రాలు కొలువుదీరి ఉండటమే. ఈ మేరకు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి చోటా చార్ ధామ్ అని పిలుస్తారు. పైగా భక్తులు ఈ ఉత్తరాఖండ్ యాత్రను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. ఏవిధంగా జరుపకుంటారంటే: ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్ర ప్రజల ధైర్యసాహసాలను లేదా వారి ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి వెలికతీసి మంచి అవార్డులతో సత్కరించడం ద్వారా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 2016వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రత్న అవార్డును ఏర్పాటు చేసి తమ రాష్ట్రంలో ధైర్యసాహసాలకు చూపిన చాలా మందికి ఈ అవార్డును అందించారు. 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 2018లో,ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య 18వ వార్షిక రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే 2019లో ఈ వేడుక దాదాపు ఒక వారం పాటు జరిగింది. కానీ 2020వ సంవత్సరంలో మాత్రం 20వ వార్షిక రాష్ట్ర స్థాపన దినోత్సవ వేడుకలను కరోనా మహమ్మారికి ముందే ప్రారంభించారు. -
Zika Virus: కాన్పుర్‌లో 25 జికా వైరస్ కేసులు నమోదు
-
వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి
ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్‌కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....గుర్గామ్‌లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్‌కు చేరుకుంది. వారు పంకజ్కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం
మీర్జాపూర్: సాయం చేయాలంటే డబ్బు ఉండవలసిన అవసరం లేదు సహాయం చేయాలనే మంచి మనస్సు ఉంటే చాలంటారు. ప్రతి దానికి డబ్బు అవసరం లేదు. చాలా మంది అవయవాలు సక్రమంగా ఉన్నా తమ ప్రాణాలకు తెగించి విపత్కర సమయంలో పక్కవాళ్లను కాపాడటానికి ముందుకు రారు. కానీ ఒకతను ఒక చేయి లేదు పైగా వరద ఉదృతి అయినా లక్ష్య పెట్టక ముగ్గురు గర్భిణిలను ఆస్పత్రికి తరలించడానికి సాయం చేశాడు. (చదవండి: తాను విసిరేస్తోంది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్) వివరాల్లోకెళ్లితే....ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగంగా నది ఒడ్డున ఉన్న కునియా గ్రామాన్ని ఇటీవల కురిసిన వర్షాలకి వరద నీరు చుట్టిముట్టింది. దీంతో ఆ గ్రామంలో ఉంటున్న సుమ, శ్యామ అనే గర్భిణులకు ప్రసవ వేదనతో బాధపడుతున్నారు. వరదల కారణంగా ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేక దిక్కుతోచని స్థితితో ఉండిపోయారు. అదే గ్రామనికి చెందిన రామ్‌నరేష్ ఒక ప్రమాదంలో ఒక చేతిని కోల్పోయినప్పటికీ వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. పైగా ఆ ముంపు ప్రాంతం న ట్రాక్టర్ ట్రాలీలో ఆ గర్భిణీలను మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు ఆస్పత్రికి తరలించే మార్గంలో తన ట్రాక్టర్ పూర్తిగా నీటితో నిండిపోయినప్పటికీ తన ఒంటి చేత్తోనే డ్రైవ్ చేసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ మరుసటి రోజు గోమతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించి సాయం చేశాడు. అయితే ఆ ముగ్గురు మహిళల్లో ఇద్దరికి మగ బిడ్డలు ఒక్కరికి ఆడపిల్లక పుట్టడమే కాక వారు సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఆ గ్రామ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ సౌరభ్ భట్ అత్యవసర సమయంలో ఆ ముగ్గురు మహిళలకు సహాయం చేసినందుకు నరేష్‌ని అభినందిచటమే కాక అతన్ని సత్కరించమని అధికారులను ఆదేశించారు. (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) -
ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
-
స్కోడా వోక్స్‌వ్యాగన్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజిల్ కారులో ఉద్గార నిబంధనలను తారుమారు చేసేందుకు మోసపూరిత పరికారాన్ని (చీట్ డివైజ్) కంపెనీ ఏర్పాటు చేసిందంటూ ఉత్తరప్రదేశ్‌లో ఓ వినియోగదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా కోరుకున్న ఫలితం దక్కలేదు. వాహనాల్లో చీట్ డివైజ్‌ల ఏర్పాటుపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేవేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ ఎందుకు కొనసాగించరాదంటూ ఈ నెల 4న విచారణలో భాగంగా ప్రశ్నించిన ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ‘చీట్’ లేదా ‘డిఫీట్ డివైజ్’ అన్నది సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఓ పరికరం. దీన్ని ఆటో ఇంజన్లలో అమర్చడం ద్వారా కాలుష్యం విడుదల పరీక్షల ఫలితాలను తారుమారు చేయగలదు. ఈ విషయంలో అంతర్జాతీయంగా వోక్స్వ్యాగన్ కొన్నేళ్ల క్రితం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నది. ఈ కేసులో స్కోడా వోక్స్వ్యాగన్ రూ.671.34 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. -
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లకీంపూర్లో గురువారం ఉదయం మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. బుధవారం కనిపించకుండా పోయిన చిన్నారి శవమై కనిపించింది. పాపకు పోస్ట్‌మార్టం నిర్వహించగా తనపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పాప తండ్రి మాట్లాడుతూ తనపై పగతోనే ఇలా చేశారని ఆరోపించారు. గత 20 రోజులలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు మూడు చోటుచేసుకున్నాయి. ఒక పదిహేడేళ్ల అమ్మాయి స్కాలర్షిప్ కోసం వెళ్లగా ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె ఊరికి 200 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది. దీనికి ముందు పదమూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు యోగీ ఆదిత్య సర్కార్‌పై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని మండిపడుతున్నారు. దీంతో మహిళలు, పిల్లల భద్రతపై సీనియర్ పోలీసు ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసింది. చదవండి: తల్లి, సోదరుడ్ని కాల్చి చంపిన బాలిక -
డాక్టర్ యోగిత హత్య కేసు నిందితుడు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) హత్య కేసులో అనుమానితుడిగా గుర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో యోగిత గౌతమ్ వైద్యురాలిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సీనియర్ డాక్టర్ అయిన ఒక వ్యక్తి యోగితను పెళ్లి చేసుకుంటానని సంవత్సరం నుంచి వేధిస్తున్నాడని ఆమె తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి యోగిత సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి యోగిత కనిపించపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఆమె తలపై బలమైన రాడ్‌తో కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. आगरा के एसएन मेडिकल कॉलेज में एक महिला डॉक्टर के अपहरण एवं हत्या की घटना दुखद है. भाजपा के राज में प्रदेश की नारी न तो शहरों में सुरक्षित है, न बस्ती, न गाँव में. प्रतीत होता है कि अब उप्र में अपराध ही सत्ताधीश बन गया है. pic.twitter.com/c4yBN5jQf4 — Akhilesh Yadav (@yadavakhilesh) August 20, 2020 ఈ విషయంలో పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా యోగితతో ఏడు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నట్లు చెప్పాడని, మరింత లోతుగా దర్యాప్తు చేయగా నిందితుడు పోలిక లేని సమాధానాలు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ డాక్టర్ యోగిత గౌతమ్ హత్య పట్ల విచారం వ్యకం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పట్టణాలలో, నగరాలలో , చివరికి పల్లెల్లో కూడా మహిళలకు రక్షణ లేకండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటేనే క్రైమ్ ఉత్తరప్రదేశ్‌ని పాలిస్తున్నట్లు అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేశారు. చదవండి: వైద్య విద్యార్థిని కిడ్నాప్, దారుణ హత్య -
నడిరోడ్డులో జర్నలిస్ట్‌పై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తరువాతే ఇలా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్ జోషిని ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు . విక్రమ్ జోషి, సోమవారం రాత్రి తన కుమార్తెతో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చదవండి: నెల క్రితం వివాహం.. వధువు మృతి విక్రమ్‌జోషి మేనకోడలితో కొంతమంది అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారిపై విక్రమ్ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో తమ మేనకోడలిని ఏడిపించిన దుండగులే ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారాని విక్రమ్ జోషి సోదరుడు తెలిపాడు. కాల్పుల్లో విక్రమ్ జోషి తలకు బులెట్ తగిలింది. వెంటనే అతనిని ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి ఇంత వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని విక్రమ్‌జోషి సోదరుడు తెలిపాడు. దీనిపై స్పందించిన పోలీసులు విజయ్‌నగర్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దవండి: అత్తింటి వేధింపులకు వివాహిత బలి -
ఔరాయ ప్రమాదానికి కారణం వారే: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఔరాయ ప్రమాదంపై బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. యూపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె మండిపడ్డారు. వారి వల్లే ఔరాయ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ వద్ద కొంత మంది వలసకూలీలు రాజస్థాన్ నుంచి గోరఖ్‌పూర్ ట్రక్‌లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొని 24 మంది మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) ఈ విషయం పై మాయావతి శనివారం మీడియాతో మాట్లాడుతూ ...‘రాష్ట్రంలోకి వచ్చే, వెళ్లే వారికి సంబంధించి అన్ని బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని ఆమె ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా మాయవతి కోరారు. దీంతోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని విన్నవించారు. అదేవిధంగా వలసకూలీలు ఎవరూ కాలినడకన రావొద్దని, రైల్వే స్టేషన్లకు వెళ్లి తమను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలందరికి రక్షణ కల్పించాలని, ఆహారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు') -
‘ఆ విషయం కాదు ముందు దీని సంగతి చూడండి’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పీపీఈ కిట్ల పంపిణీ కలకలం రేపుతోంది. యూపీలోని మెడికల్ కాలేజీలకు, డాక్టర్లకు పంపిన పీపీఈ కిట్లు నకిలివి అంటూ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర జనరల్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తరువాత ఆ విషయం బహిర్గతమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం యోగీ ఆదిత్యనాధ్ సర్కార్‌ను నిలదీశారు. నకిలీ పీపీఈ కిట్ల స్కామ్ వ్యవహారంలో ఎవరు ఉన్నారో తెలుసుకొని వారిని శిక్షించాలని కోరారు. కరోనా యుద్దంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లని, వారికి నకిలీ కిట్లను సరఫరా చేస్తూ వైద్యుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. వైద్యుల భద్రత విషయంలో రాజీపడకూడదని సూచించారు. (చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వాడొద్దు : ఐసీఎంఆర్) यूपी के कई सारे मेडिकल कालेजों में खराब PPE किट दी गई थीं। ये तो अच्छा हुआ सही समय पर वो पकड़ में आ गईं तो वापस हो गईं और हमारे योद्धा डाक्टरों की सुरक्षा से खिलवाड़ नहीं हुआ। लेकिन हैरानी की बात ये है कि यूपी सरकार को ये घोटाला परेशान नहीं कर रहा है बल्कि .. 1/2 pic.twitter.com/ef4PHpE1lb — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2020 యోగి సర్కారు మాత్రం నకిలీ కిట్ల వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం తెలుసుకోవడం కంటే ముఖ్యంగా ఈ విషయం ఎవరి వల్ల బయటకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. మొదటి అసలు విషయం ఎలా బయటకి వచ్చి అని తెలుసుకోవడం పక్కన పెట్టి నకిలీ కిట్ల స్కామ్ వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని కోరారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడం ద్వారా మంచి జరిగిందని లేకపోతే దీనిని మరుగున పడేసేవారని ప్రియాంక ఆరోపించింది. దీనికి సంబంధించిన విషయాలను ప్రియాంక తన ట్విటర్ ఖాతాలో హిందీలో పేర్కొన్నారు. (ల్యాబ్‌లు పెరిగినా టెస్ట్‌ల సంఖ్య పరిమితం..) ..ये परेशान कर रहा है कि खराब किट की खबर बाहर कैसे आ गई। ये तो अच्छा हुआ कि खबर बाहर आ गई वरना खराब किट का मामला पकड़ा ही नहीं जाता और ऐसे ही रफा-दफा हो जाता। क्या दोषियों पर कार्यवाही होगी? 2/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2020 -
ఆరని మంటలు
లక్నో/న్యూఢిల్లీ: ‘దిశ’ ఘటనపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తుతున్నా నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై గురువారం వేకువజామున దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అగ్నికీలలు దహించి వేస్తుండగానే రక్షించాలంటూ ఆమె దాదాపు కిలోమీటరు దూరం పరుగులు పెట్టారు. చివరకు బాధితురాలే 112 నంబర్‌కు పోలీసులకూ ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసిన తర్వాతే అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకొంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను ప్రభుత్వం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు..ఏడాది క్రితం ఆమెను రేప్ చేసి, అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై వచ్చిన వ్యక్తి కావడం గమనార్హం. బాధితురాలి పరిస్థితి విషమం బాధితురాలిని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, తర్వాత జిల్లా ఆస్పత్రికి, ఉదయం పదింటికి లక్నో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అశుతోష్ దుబే చెప్పారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం యూపీ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించింది. ఆమెను సత్వరమే ఆస్పత్రిలో చేర్పించేందుకు వీలుగా అధికారులు లక్నో ఆస్పత్రి– అమౌసీ ఎయిర్‌పోర్టు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు– సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మార్గాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్లో తనపై జరిగిన అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దయాశంకర్ ఎదుట బాధితురాలు వాంగ్మూలమిచ్చారు. 4.30 గంటలపుడు తన ఇంటి దగ్గర్లోని గౌరా మలుపు వద్ద హరిశంకర్ త్రివేది, రామ్‌కిశోర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, శివం త్రివేది, శుభం త్రివేదిలు పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు పేర్కొన్నారు. వీరిలో శివం, శుభం 2018 డిసెంబర్లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించగా ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా మరొకరు నవంబర్ 25న బెయిల్‌పై బయటకు వచ్చారు. ఘటనాస్థలి వద్ద ఆధారాల సేకరణ ఖండించిన రాజ్యసభ ఉన్నావ్ రేప్ బాధితురాలిపై జరిగిన దాడి ఘటన రాజ్యసభలో దుమారం రేపింది. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఘటనను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ఖండించారు. ‘యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సరైన చర్యలుతీసుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న హింసకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందించాలని, బాధితురాలికి సరైన వైద్యం అందించాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నంపై 12వేల మంది ట్విట్టర్లో ఆగ్రహం వెలిబుచ్చారు. రేపిస్ట్లు బెయిలుపై దర్జాగా తిరగడాన్ని కొందరు తప్పుబట్టారు. ►యూపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని కేంద్ర హోంమంత్రి, యూపీ సీఎం నిన్న అబద్ధమాడారు. నిత్యం ఇలాంటి ఘటనలను చూస్తుండటం ఆగ్రహం తెప్పిస్తోంది. – ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ -
వైరల్: ఇంగ్లిష్ రెండు లైన్లు చదవలేని టీచర్
లక్నో: కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గానీ.. ఆ ఇంగ్లిష్ టీచర్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలోని కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేక అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సికందర్పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ పాండే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు. -
అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకొచ్చింది..
ఉత్తరప్రదేశ్: అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకు వచ్చిందంటే ఇదేనేమో..! ఉత్తరప్రదేశ్‌లో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న వ్యక్తికి ఏకంగా రూ. 25లక్షల విలువ చేసే ఆభరణాలు దొరికాయి. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు...నిధి దొరికిందని సంబరపడేలోపే విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లడంతో సదరు వ్యక్తి నుంచి పోలీసులు ఆ నిధిని స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. కాగా వందేళ్ల క్రితానికి చెందినవిగా భావిస్తున్న 650 గ్రాముల బంగారం, 4.53 కిలోల వెండి ఆభరణాలుగా గుర్తించారు. హార్డోయి ఎస్పీ అలోక్ ప్రియదర్శి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆ వస్తువులకు పురావస్తు ప్రాముఖ్యత ఉన్నందున వాటిని సదరు వ్యక్తి నుంచి స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. ఆభరణాలకు సంబంధించి ఎవరి వద్ద ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని నిర్ధారించారు. పరిసర ప్రాంతాల్లో ఈ విషయం వ్యాపించడంతో చాలా మంది ఆ నిధిని పొందడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆభరణాలను కనుగొన్న వ్యక్తి మొదట ఈ సంఘటనను గూర్చి చెప్పడానికి నిరాకరించినా, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వాటి గురించి తెలియజేశాడు. ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్-1878, ప్రకారం తవ్వకాలలో బయటపడిన ఏవైనా ఆభరణాలు లేదా ఖరీదైన వస్తువులను చట్టబద్ధంగా ‘నిధి’ అని పిలుస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ఆ నిధి దొరికిన వ్యక్తి రెవెన్యూ అధికారికి తెలియజేయాలి. విచారణ అనంతరం చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఆ నిధి ఎవరికి సంబంధించింది కాదని పోలీసులు నిర్ధారిస్తే ఆ నిధిని కనుగొన్న వ్యక్తి వాటిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. -
మహ్మద్ ఘోరి V/S ఫక్కర్ రామాయని@17..
సాక్షి, ఉత్తరప్రదేశ్: అతని పేరు.. ఫక్కర్ రామాయని. వయసు 73 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ మధురలోని గాల్టేశ్వర్ ఆలయ ప్రధాన పూజారి అయిన ఈయన 17వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ స్వామీజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మరోసారి మథుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రారంభం రోజునే ఆయన భక్తులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇన్ని ఎన్నికల్లో ఓడిపోయినా తాను నిరాశ పడటం లేదని, ఓటర్లు ఎప్పటికైనా తనను గుర్తిస్తారన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామాయని రెండు అంశాల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఒకటయితే, యమునా నదిని కాలుష్యరహితం చేయడం రెండోది. రామాయణాన్ని కంఠతా పట్టేసిన ఈయనకు పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అందువల్ల ప్రచారానికి కారు ఉపయోగిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కారు, ఎన్నికల ఖర్చు కూడా ఆయన భక్తులే భరిస్తున్నారట. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా రామాయని ముందుగా యమునా నదికి హారతి పట్టి ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 18న మధురలో పోలింగు జరగనుంది. -
అదృష్టం
ఉత్తరప్రదేశ్‌లోని మథుర స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో పొరపాటున తల్లి ఒడిలోంచి జారి ట్రాక్‌కు, రైల్వే ప్లాట్‌ఫామ్‌కు మధ్యనున్న చిన్నపాటి గ్యాప్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు దక్కించుకున్న దృశ్యమిది. -
యూపీలో టైం బాంబ్ కలకలం
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇస్మాయిల్గంజ్లో టైంబాంబ్ కలకలం రేగింది. రెవెన్యూ అధికారి రవీంద్రవర్మ ఇంటి ముందు గురువారం ఉదయం ఓ ప్యాకెట్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో టైం బాంబు అని తేలడంతో బాంబు స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేయడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. -
యూపీలో ఏ గతి పట్టిందో ఆ గతే పడుతుంది
హైదరాబాద్: యూపీలో కుల రాజకీయాలు చేసిన పార్టీకి ఏ గతి పట్టిందో ఇక్కడ కూడా అదే గతి పడుతుందని టీఆర్ఎస్ నుద్ధేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. కుల, మత రాజకీయాలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చెయ్యాలని, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేస్తే.. గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని అన్నారు. ముస్లిం జనాభాను బీసీల్లో చేరిస్తే బీసీలు అంతా తిరగబడతారని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వ ఏక పక్ష ఒంటెద్దు పోకడలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అసెంబ్లీ లోపల బయట పోలీసులతో ప్రభుత్వం నడపాలని చూస్తే తగిన శాస్తి జరుగుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా.. రేపు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరకంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేని చెప్పారు. -
రికార్డు స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీ ఎన్నికల్లో ఈసారి అత్యధికంగా మహిళలు గెలుపొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది సరికొత్త రికార్డుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేశారు. కాగా మీడియా కథనాలు ప్రకారం 38మంది మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 43మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా, వారిలో 32మంది విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నుంచి చెరో ఇద్దరు, సమాజ్‌వాదీ, అప్నా దళ్ పార్టీల నుంచి ఒకొక్కరు గెలుపొందారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలు ఉండగా...గెలుపొందిన మహిళల శాతం వీరి గెలుపు శాతం (9.2) పది కంటే తక్కువగా ఉంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూపీలో పెద్ద మొత్తంలో మహిళలు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. Glad that a new record has been set of highest women MLAs elected in UP Assembly. Congratulations to all women MLAs. https://t.co/o6s2dh7eD4 — Narendra Modi (@narendramodi) 13 March 2017 -
ఓట్ పంచ్
-
సత్తా చాటే సమయం లేదిక..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో అగ్నిపరీక్ష..! కాంగ్రెస్‌కు కానరాని శుభ శకునాలు గుజరాత్, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లోనూ కష్టాలే? సాక్షి, న్యూఢిల్లీ : శతాబ్దానికి పైగా చరిత కలిగిన కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో పోయిందేమీ లేదు. ఉత్తరాఖండ్‌లో పట్టు జారి పోయినా.. పంజాబ్ పగ్గాలు చేతికొచ్చాయి. గోవా, మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలోకి వచ్చింది. అయినా ఆ పార్టీలో ఉత్సాహం లేదు. మరో రెండేళ్లలో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు. వాటిని ఎదుర్కోవాలంటే ఆలోపు వచ్చే శాసన సభల ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చూపాలి. లేదంటే మళ్లీ చతికిలిపడాల్సిందే. కాంగ్రెస్‌లో ఇదే కలవరం. ఒకవైపు కమలం పార్టీ ప్రతి ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తుంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి బలహీనతే బయటపడుతూ వస్తోంది. 2013లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ ఎన్నికల నాటి నుంచి దాదాపు అన్ని ఎన్నికల్లో కుదేలవుతూ వస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.. ఇలా వరుసగా రాష్ట్రాలన్నింటిలోనూ చతికిల పడుతూ వచ్చింది. బిహార్‌లో కొన్ని సీట్లు దక్కించుకుని అధికార కూటమిలో చేరింది. ఉత్తర ప్రదేశ్‌లో ఇదే తరహాలో వ్యూహాన్ని అమలుపరిచినా.. ఫలించలేదు. ఎట్టకేలకు పంజాబ్‌ను దక్కించుకుని ఒకింత పరువు నిలబెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ దాని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. పార్టీని పటిష్టం చేయలేదు. క్షేత్రస్థాయి ప్రజాందోళనలకు నాయకత్వం వహించే స్థితిలో కూడా లేదు. వచ్చే రెండేళ్లలో ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు సానుకూల సమాధానం కనిపించడం లేదు. ముందున్నదీ ముళ్ల బాటే... తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది.. 2004 నుంచి పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోదీ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. 2019లో మరోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తే అంతకుముందే పలు కీలక రాష్ట్రాల్లో అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే మరో పది రాష్ట్రాల శాసన సభలకు గడువు తీరుతుంది. ముందుగా ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తదుపరి వచ్చే ఏడాది మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండింటిలో గుజరాత్‌ను ఆశించడం కాంగ్రెస్ సాహసమే అవుతుంది. ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికే అనేక వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బిందువై ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ తదుపరి 2018 నవంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాలు సాధిస్తూ వస్తోంది. రాజస్థాన్‌లో అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ప్రత్నామ్నాయంగా కాంగ్రెస్ గట్టి శక్తిగా నిలబడలేకపోతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర తదితర చిన్న రాష్ట్రాల్లో కూడా 2019 సార్వత్రిక ఎన్నికల్లోపే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటి ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై అంతగా ఉండకపోయినా.. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఉన్న నిరుత్సాహంతో ఈ రాష్ట్రాల్లో బీజేపీని ఎదురొడ్డి నిలవడం కష్టమే. 2019లో దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలంటే ఈ సమయం సరిపోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ నాయకత్వ లేమి..! బీజేపీ విజయాల వెనక నరేంద్రమోదీ, అమిత్‌షాల మాయాజాలం, సామాజిక సమీకరణాలు, అభివృద్ధి ఎజెండా ఉన్నా... ప్రాంతీయ నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించింది. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్, శర్వానంద సోనోవాల్ ఈ కోవలోని వారే. కానీ కాంగ్రెస్‌లో నెహ్రూ, గాంధీ కుటుంబం చరిష్మా మినహా ప్రాంతీయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగే వారు కరవయ్యారు. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ చరిష్మా పార్టీకి అదనపు బలమైంది. గతంలో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నాయకులు బలంగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ సమయం మాత్రమే ఉన్నందున 2019 నాటికే చేతులెత్తేస్తుందా? లేక కదనోత్సాహంతో ఎదుర్కొంటుందా అని వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
-
కుప్పకూలిన ఇంటిపైకప్పు :5మంది మృతి
-
వ్యక్తి ఆత్మహత్య
కొత్తూరు : కుటుంబ కలహాల కారణగంగా భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నరేందర్‌కుమార శుక్లా (30), సౌమ్య దంపతులు రెండేళ్ల క్రితం కొత్తూరు మండలం తిమ్మాపూర్‌కు వలస వచ్చారు. అప్పటి నుంచి భర్త శివారులోని డురోలిన్ పరిశ్రమలో షిఫ్ట ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, కుటుంబ కలహాలతో అతను తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. చివరకు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ రంగయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
రివాల్వర్ విక్రయించేందుకు వచ్చి..
పోలీసులకు చిక్కిన ఉత్తరప్రదేశ్వాసి కోనరావుపేట: తుపాకులు విక్రయించేందుకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కుమార్ తివారీ రెండు నెలల క్రితం కరీంనగర్ జిల్లా కోనరావుపేటకు చెందిన ముదాం ప్రసాద్, మనుక రాజుకు రివాల్వర్ విక్రయించాడు. ఆదివారం మళ్లీ ఇదే ప్రాంతంలో మరో రివాల్వర్ విక్రయించేందుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న వేములవాడ పోలీసులు ఆయన పట్టణంలోని రాజధాని దాబా పరిసరాల్లో అడుపులోకి తీసుకున్నారు. అతనినుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మాధవి, ఎస్సై రమేశ్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు. -
కదులుతున్న కారులో శృంగారం..
- ట్రక్కు ఢీకొని ప్రియుడి దుర్మరణం, ప్రియురాలికి తీవ్ర గాయాలు - ఫిలిబిత్- పురాన్ పూర్(యూపీ) హైవేపై ఘటన ఫిలిబిత్: ప్రియురాలిని సొంత ఊరిలో దింపేందుకు కారులో బయలుదేరిన ప్రియుడు.. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా కారు నడుపుతూ ప్రియురాలితో శృంగారంలో పాల్గొనడం తనుచేసిన ఘోరతప్పిదం. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్- పురాన్ పూర్ హైవేపై బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ప్రియురాలు ప్రాణాలతో బయటపడగలిగింది. గజ్రౌలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేశ్ యాదవ్ తెలిపిన వివరాలను బట్టి.. పురాన్ పూర్ కు చెందిన 24 ఏళ్ల యువతి.. ఫిలిబిత్ లో నివసిస్తూ ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమైన 31 ఏళ్ల యువకుడితో స్నేహం ప్రేమగా మారింది. అత్యవసర పని నిమిత్తం ఆ యువతి తన సొంతింటికి వెళ్లాల్సి రావడంతో యువకుడు తన కారులో ఆ అమ్మాయిని దిగబెట్టేందుకు పురాన్ పూర్ బయలుదేరాడు. ఉద్రేకం ఆపుకోలేక కారులో ప్రయాణిస్తూనే ఇద్దరూ శృంగార చర్యకు దిగారు. డ్రైవింగ్ పై పట్టుకోల్పోయిన ఆ యువకుడు.. తన కారును ఎదురుగా వచ్చిన ట్రక్కుపైకి పొనిచ్చేశాడు. కఠానా బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరినీ చూసి అవాక్కయ్యారు. ప్రియుడు, ప్రియురాలి ఒంటిపై నూలుపోగు లేకపోవడం, కారులో వారు ఇరుక్కుపోయిన భంగిమ, ట్రక్కు డ్రైవర్ వివరణనుబట్టి.. ఆ ఇద్దరూ కారులో శృంగారానికి పాల్పడటంవల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రియుడు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డ ప్రియురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు చెప్పారు. -
కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు!
-
కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆదివారం 77వ ఏట అడుగుపెట్టారు. ములాయం జన్మదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం సైఫైలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత అట్టహాసంగా శనివారం సాయంత్రం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన 77 కిలోల కేక్‌ను కట్ చేశారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యంత భారీ రీతిలో జరిగిన ములాయం జన్మదిన వేడుకలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొని రైతులు అల్లాడుతున్న సమయంలో ఇంత భారీ ఖర్చు, ఆర్భాటంతో ఆయన వేడుకలు జరుపుకోవడమేమిటని ప్రత్యర్థి పార్టీలు దుయ్యబడుతున్నాయి. కరువుతో యూపీ ప్రజలు అల్లాడుతున్నా ములాయం వేడుకలు మానుకోవడం లేదని విమర్శించాయి. ఈ ఆరోపణలపై ములాయం కోడలు, ఎంపీ డింపుల్ యాదవ్ స్పందిస్తూ.. కరువు ఉన్నంతా మాత్రాన ములాయం జన్మదిన వేడుకలు ఆపాల్సిన పనిలేదని, కరువు బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు. -
''దాద్రి' వెనుకా 'ముజఫర్' నిందితులే'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 'దాద్రి' హత్య ఘటనకు ఓ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కుట్రపన్నారని, ఆ ముగ్గురికీ ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లతోనూ సంబంధముందని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. 'దాద్రి' ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు తమ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చినా లెక్కచేయబోమని ఆయన పేర్కొన్నారు. యూపీలోని 'దాద్రి'లో గోవుమాంసం తిన్నారన్న కారణంగా ఒక వ్యక్తిని దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఏడుగురు వ్యక్తులు స్థానిక బీజేపీ నేతకు చెందినవారని, నిందితులలో సదరు నేత కొడుకు కూడా ఉన్నారని తెలుస్తున్నది. -
కోడలు కాదు రాక్షసి
-
'అబ్బే.. అలాంటివారికి చోటివ్వం, సీట్లివ్వం'
లక్నో: ప్రజలను అవమానించేవారికి, వారిని బాధ పెట్టేవారికి తమ పార్టీలో చోటు ఉండదని, సీట్లు అంతకంటే ఇవ్వబోమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లలో ఉన్నారో తెలియజేయాలంటూ పార్టీ నేతలను ప్రశ్నించారు. 'పంచాయతీ ఎన్నికల సీట్ల కోసం చాలా పెద్ద క్యూ ఉంది. అంతకంటే ముందు ఈ క్యూలో ఉన్నవారంతా తాము మంచివారిమని నిరూపించుకోవాలి. ఏ మచ్చ లేకుండా కనిపించాలి. ఎందుకంటే ఈ క్యూలో ఉన్నవారిలో కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా ప్రజలను అవమానించేవారే. ఇబ్బందులు పెట్టేవారే. అందుకే మేం వీరికి సీట్లు ఇవ్వం' అని ములాయం చెప్పారు. తమ పార్టీ, ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్‌లో సరైన స్పందన రాలేదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నేతలు సమర్థంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 9, డిసెంబర్ 15న జరగనున్నాయి. -
తప్పతాగి చిందులేసిన పోలిస్
-
ఎమ్మెల్యే కారును ఓవర్ టేక్ చేశారని..
ఆగ్రా: ఎమ్మెల్యే కారును బర్రెలను తీసుకెళ్తున్న ఓ ట్రక్ ఓవర్ టేక్ చేయడం ఆయనకు కోపం తెప్పించింది. స్పీడుగా వెళ్లి ట్రక్‌ను ఓవర్ టేక్ చేయాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించాడు. ఎమ్మెల్యే ట్రక్‌ను ఆపి అందులో ఉన్న 30 బర్రెలను బయటకు తోలారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ యాదవ్ చేసిన నిర్వాకమిది. రాజ్‌కుమార్ రాజస్థాన్‌లోని కోటా నుంచి తన నియోజకవర్గం సాదార్కు వెళ్తున్నారు. తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ట్రక్‌లో ఉన్న బర్రెలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వీటిని చూసిన గ్రామస్తులు తొలుత ఆశ్చర్యపోయినా, తమకు దొరికినందుకు సంతోషించి ఇళ్లకు తోలుకుపోయారు. యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామాల్లో ప్రతి ఇల్లూ గాలించి బర్రెలను గుర్తించారు. కాగా బర్రెలను కబేళానికి తీసుకెళ్తుంటే ట్రాక్‌ను ఆపానని, గ్రామస్తులు వాటిని విడిపించారని ఎమ్మెల్యే చెప్పగా.. స్థానిక డైరీకి తీసుకెళ్తున్నామని యజమానులు చెప్పారు. చివరకు ఎమ్మెల్యే, బర్రెల యజమానుల మధ్య రాజీకుదరడంతో కేసును ఉపసంహరించుకున్నారు. -
నేలపై రోగులు బెడ్స్‌పై ఖాకీలు
-
యూకేలో సిక్కుపై దాడి.. విచారణకు ఆదేశం
లండన్: బ్రిటన్‌లో ఓ సిక్క్తుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. బర్మింగ్హమ్ నగరంలో రద్దీగా ఉన్న వీధిలో సిక్కుపై అందరూ చూస్తుండగానే దారుణంగా దాడి చేసిన వీడియోను ‘డైలీ సిక్ అప్డేట్స్’ అన్న ఫేస్బుక్ పేజీలో సంచలనం సృష్టించింది. బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. సిక్కుపై దాడి జరుగుతున్న చుట్టూ ఉన్న వ్యక్తులెవరూ పట్టించుకోలేదు. కొద్ది దూరంలో మరో వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. బహుశా అతను మొదటి బాధితుడై ఉంటాడనిఅనుమానిస్తున్నారు.