వ్యక్తి ఆత్మహత్య | man suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Sep 4 2016 11:53 PM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

man suicide

కొత్తూరు : కుటుంబ కలహాల కారణగంగా భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నరేందర్‌కుమార శుక్లా (30), సౌమ్య దంపతులు రెండేళ్ల క్రితం కొత్తూరు మండలం తిమ్మాపూర్‌కు వలస వచ్చారు. అప్పటి నుంచి భర్త శివారులోని డురోలిన్‌ పరిశ్రమలో షిఫ్‌ట ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, కుటుంబ కలహాలతో అతను తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. చివరకు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ రంగయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement