![3 Years Girl Molested and Assassinated in Uttarpradesh - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/4/ppa.gif.webp?itok=fp5K8A2a)
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లకీంపూర్‌లో గురువారం ఉదయం మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. బుధవారం కనిపించకుండా పోయిన చిన్నారి శవమై కనిపించింది. పాపకు పోస్ట్‌మార్టం నిర్వహించగా తనపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పాప తండ్రి మాట్లాడుతూ తనపై పగతోనే ఇలా చేశారని ఆరోపించారు. గత 20 రోజులలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు మూడు చోటుచేసుకున్నాయి.
ఒక పదిహేడేళ్ల అమ్మాయి స్కాలర్‌షిప్ కోసం వెళ్లగా ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె ఊరికి 200 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది. దీనికి ముందు పదమూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు యోగీ ఆదిత్య సర్కార్‌పై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని మండిపడుతున్నారు. దీంతో మహిళలు, పిల్లల భద్రతపై సీనియర్ పోలీసు ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment