మీర్జాపూర్: సాయం చేయాలంటే డబ్బు ఉండవలసిన అవసరం లేదు సహాయం చేయాలనే మంచి మనస్సు ఉంటే చాలంటారు. ప్రతి దానికి డబ్బు అవసరం లేదు. చాలా మంది అవయవాలు సక్రమంగా ఉన్నా తమ ప్రాణాలకు తెగించి విపత్కర సమయంలో పక్కవాళ్లను కాపాడటానికి ముందుకు రారు. కానీ ఒకతను ఒక చేయి లేదు పైగా వరద ఉదృతి అయినా లక్ష్య పెట్టక ముగ్గురు గర్భిణిలను ఆస్పత్రికి తరలించడానికి సాయం చేశాడు.
(చదవండి: తాను విసిరేస్తోంది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్)
వివరాల్లోకెళ్లితే....ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగంగా నది ఒడ్డున ఉన్న కునియా గ్రామాన్ని ఇటీవల కురిసిన వర్షాలకి వరద నీరు చుట్టిముట్టింది. దీంతో ఆ గ్రామంలో ఉంటున్న సుమ, శ్యామ అనే గర్భిణులకు ప్రసవ వేదనతో బాధపడుతున్నారు. వరదల కారణంగా ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేక దిక్కుతోచని స్థితితో ఉండిపోయారు. అదే గ్రామనికి చెందిన రామ్‌నరేష్ ఒక ప్రమాదంలో ఒక చేతిని కోల్పోయినప్పటికీ వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
పైగా ఆ ముంపు ప్రాంతం న ట్రాక్టర్ ట్రాలీలో ఆ గర్భిణీలను మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు ఆస్పత్రికి తరలించే మార్గంలో తన ట్రాక్టర్ పూర్తిగా నీటితో నిండిపోయినప్పటికీ తన ఒంటి చేత్తోనే డ్రైవ్ చేసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ మరుసటి రోజు గోమతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించి సాయం చేశాడు.
అయితే ఆ ముగ్గురు మహిళల్లో ఇద్దరికి మగ బిడ్డలు ఒక్కరికి ఆడపిల్లక పుట్టడమే కాక వారు సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఆ గ్రామ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ సౌరభ్ భట్ అత్యవసర సమయంలో ఆ ముగ్గురు మహిళలకు సహాయం చేసినందుకు నరేష్‌ని అభినందిచటమే కాక అతన్ని సత్కరించమని అధికారులను ఆదేశించారు.
(చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!)
Comments
Please login to add a commentAdd a comment