అమీర్‌పేట: డీఎస్పీ ఇంట్లో పనిచేసే మహిళ పట్ల నడి రోడ్డుపై ఓ కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాజీ డిప్యూటి మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ వద్ద సహాయకుడిగా పనిచేసే షేక్ ఖలీల్‌గా గుర్తించారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్ సమీపంలోని రాయల్ ఫంక్షన్ హాలు వద్ద శనివారం మధ్నాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం..బోరబండకు చెందిన 21 ఏళ్ల షేక్ ఖలీల్ శనివారం ఉదయం పనిమీద కూకట్‌పల్లి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి మధ్నాహ్నం బోరబండకు బయలుదేరాడు. అదే సమయంలో రాజీవ్‌నగర్ సమీపంలోని రాయల్ ఫంక్షన్ హాలు పక్కనే ఓ ఇంట్లో ఉంటున్న డీఎస్పీ వద్ద వంట మనిషిగా పనిచేసే మహిళ నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. ఆమెను రోడ్డుపైనే అటకాయించిన ఖలీల్ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగ్గా అందుకు నిరాకరించడంతో..రెచ్చిపోయిన ఖలీల్ ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖలీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖలీల్ వెకిలి చేష్టలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని, నిందితుడికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అన్నకోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
(చదవండి: బాలుడి ప్రాణం తీసిన చున్నీ)
Comments
Please login to add a commentAdd a comment