house maid
-
డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభుత్వ ఉద్యోగం
'పుష్ప 2' రిలీజ్ టెన్షన్‌తో డైరెక్టర్ సుకుమార్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. రిలీజ్‌కి మరో 10 రోజులే ఉంది కానీ ఇప్పటికే షూటింగ్ నడుస్తోంది. మూవీ టెన్షన్ అంతా పక్కనబెడితే సుకుమార్ ఇంట్లో హ్యాపీనెస్ చోటుచేసుకుంది. తమ దగ్గర పనిమనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని స్వయంగా సుకుమార్ భార్య బయటపెట్టింది.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)'సినిమా హంగామాలోనూ మేమంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఎందుకంటే మా ఇంట్లో పనిచేస్తూ చదువు పూర్తి చేసిన దివ్య.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఈ సందర్భంగా మేం ఆమెని మనస్పూర్తిగా అభినందించాం. దివ్య.. మేం నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం' అని సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.డైరెక్టర్ సుకుమార్ భార్య చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'పుష్ప 2' చేస్తున్న సుకుమార్.. దీని తర్వాత మూడో భాగం కూడా తీస్తారని సమాచారం. రామ్చరణ్తోనూ మరో మూవీ లైన్లో ఉంది.(ఇదీ చదవండి: సుకుమార్ నిర్మాతగా చైతూ 'మిథికల్ థ్రిల్లర్') View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
పని మనిషి బర్త్‌డే.. ఓనరమ్మ సర్ప్రైజ్
ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మధుర క్షణాలు పదిలంగా ఉండిపోతాయి. వాటి వెనుక చిన్న చిన్న చర్యలు కూడా ఉండొచ్చు!. తమ ఇంటి బండి నడిచేందుకు.. నాలుగు ఇళ్లలో పని చేసుకునే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లను గౌరవంగా చూసే ఓనర్లు ఎందరుంటారు?.. అయితే ఇక్కడ తమకు సాయంగా ఇంటి పనులు చేసే ఆమెను.. ఇంట్లో మనిషిగానే భావించింది ఆ ఓనరమ్మ. అందుకే.. ఆమె జీవితంలో ఏ పుట్టినరోజుకు అందుకోని సర్ప్రైజ్ ఇచ్చింది. వీళ్లకు విలువైన కానుకలు అక్కర్లేదు. ఇలాంటి ప్రత్యేక క్షణాల్లో ప్రేమ, ఆనందం పంచితే సరిపోతుంది. ఈ నగరంలో ఆమె భర్తతో ఒంటరిగా ఉంటోంది. అందుకే ఆమె పుట్టినరోజును ముఖంలో చిరునవ్వులు పూయించాలనుకున్నాం. మా మామగారు ఆమె కోసం కేక్ తెచ్చారు. అంతా కలిసి ఆమెను సర్ప్రైజ్ చేశాం. కొన్నిసార్లు ఎదుటివాళ్లను నవ్వించేందుకు.. మీరు చిన్న చిన్న పనులు మీతో ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ క్యాప్షన్ ఉంచింది సదరు ఓనరామె. అంతే మీ వల్లే మా ఇల్లు శుభ్రంగా, సొగసుగా ఉంటోందని.. హ్యపీయెస్ట్ బర్త్‌డే మౌషీ అంటూ క్యాష్షన్ ఉంచారామె. అంతేకాదు.. ఎప్పుడూ తన కోసం టీ పెట్టే ఆమె కోసం.. ఈసారి ఆ ఓనర్ ప్రత్యేకంగా టీ చేసి ఇచ్చింది. తన జీవితంలో ఇప్పటిదాకా పుట్టినరోజు జరుపుకోలేదని.. ఈ క్షణాలు తనకు ఎంతో భావోద్వేగాన్ని పంచాయంటూ కంటతడి పెట్టుకుందామె. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు
రాంచీ: బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జార్ఖండ్ మహిళా నాయకురాలు సీమ పాత్రను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గరిజన తెగకు చెందిన పనిమనిషిని చిత్రహింసలు పెట్టిందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తామని అధికారులు చెప్పారు. సీమపాత్ర ఇంట్లో పనిచేసే గిరిజన మహిళ సునీత ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. రోజూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పింది. తనతో టాయిలెట్‌ను నాకించడమే గాక.. వేడి వేడి వస్తువులతో వాతలుపెడుతూ సీమ పాత్ర వికృత చర్యలకు పాల్పడుతున్నారని సునీత వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీమ పాత్ర కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆమె పరారైంది. చివరకు పోలీసులు ఆమెను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ సీమపాత్ర రోడ్డుపైనుంచి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా పట్టుకున్నారు. సునీత ఆరోపణల అనంతరం జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై స్పందించింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ పారదర్శకంగా చేపట్టాలని సూచించింది. మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర సతీమణి అయి ఉండి సీమ పాత్ర ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు.. -
పట్టపగలే మహిళ పై అఘాయిత్యం... అరుపులు,కేకలు..
అమీర్‌పేట: డీఎస్పీ ఇంట్లో పనిచేసే మహిళ పట్ల నడి రోడ్డుపై ఓ కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాజీ డిప్యూటి మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ వద్ద సహాయకుడిగా పనిచేసే షేక్ ఖలీల్‌గా గుర్తించారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్ సమీపంలోని రాయల్ ఫంక్షన్ హాలు వద్ద శనివారం మధ్నాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం..బోరబండకు చెందిన 21 ఏళ్ల షేక్ ఖలీల్ శనివారం ఉదయం పనిమీద కూకట్పల్లి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి మధ్నాహ్నం బోరబండకు బయలుదేరాడు. అదే సమయంలో రాజీవ్‌నగర్ సమీపంలోని రాయల్ ఫంక్షన్ హాలు పక్కనే ఓ ఇంట్లో ఉంటున్న డీఎస్పీ వద్ద వంట మనిషిగా పనిచేసే మహిళ నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. ఆమెను రోడ్డుపైనే అటకాయించిన ఖలీల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగ్గా అందుకు నిరాకరించడంతో..రెచ్చిపోయిన ఖలీల్ ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖలీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖలీల్ వెకిలి చేష్టలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని, నిందితుడికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అన్నకోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: బాలుడి ప్రాణం తీసిన చున్నీ) -
ఏమిటీ ‘హౌజ్ మెయిడ్ నీ’ సమస్య?!
ఆ సమస్య పేరే ‘పనిమనిషి మోకాలి నొప్పి’! నిజానికి వైద్య పరిభాషలో ఆ జబ్బు పేరు ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’. ఇంగ్లిష్ వాడుకభాషలో దాన్నే ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. అప్పట్లో ఇంటిని తుడిసేవారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడవడం చేసేవారు. దాంతో మోకాళ్లు దీర్ఘకాలం పాటు ఒరుసుకుపోయి ‘మోకాలి’ నొప్పి వచ్చేది. అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారు (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ) దీనికి గురయ్యేవారు. ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకూ ఈ నొప్పి వస్తుంటుంది. ఎంతమందికి వచ్చినప్పటికీ... ప్రధానంగా ఈ నొప్పి కనిపించేవారి పేరిట ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరే ఖాయం అయ్యింది. ఈ సమస్య వచ్చినవాళ్లకు తొలిదశలో నొప్పి, మోకాలి వాపు ఉన్న ప్రదేశంలో ఐస్ పెట్టడం, నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేస్తారు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందుల్నిస్తారు. క్రీడాకారుల్లో ఈ సమస్యను నివారించేందుకు ‘నీ–ప్యాడ్స్’ వాడటం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు.. మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలతో డాక్టర్లు / నిపుణులు ఉపశమనం కలగజేస్తుంటారు. -
పాపం అని ఉద్యోగం ఇస్తే.. అదును చూసి..
మలక్‌పేట(హైదరాబాద్): పని కల్పించిన ఓ యజమాని ఇంటికే కన్నం వేసిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. డీఐ నానునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌కుమార్ అనే వ్యాపారవేత్త మూసారంబాగ్ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నేపాల్‌కు చెందిన అశోక్, రేఖ అనే ఇద్దరు వ్యక్తులను కొంత కాలంగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గురువారం కుటుంబ సభ్యులు పని మీద బయటకి వెళ్లారు. ఇంట్లోని ఓ గదిలో వృద్ధురాలు మాత్రమే ఉంది. ఇదే అదనుగా భావించిన వారు మరో గదిలో ఉన్న బీరువా తాళాలు తెరచి అందులో ఉన్న రూ.10లక్షల నగదు దొంగలించి పరారయ్యారు. ఇంటికి వచ్చిన యజమాని కుటుంబ సభ్యులు తెరిచి ఉన్న బీరువా చూసి కంగుతున్నారు. అందులో ఉన్న రూ.10లక్షలు కన్పించలేదు. విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ ఘటన స్ధలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
పని మనిషే హత్య చేసింది..
సాక్షి, జిన్నారం(పటాన్చెరు) : కళ్లల్లో కారంచల్లి ఓ వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసిన కేసును బొల్లారం పోలీసులు ఛేదించారు. పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. బొల్లారం గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉస్కేబావి అంతమ్మ ఇంట్లో స్వరూప అనే మహిళ పని చేస్తుంది. అంతమ్మ ఇంట్లో ఎప్పుడూ డబ్బు, బంగారు నగలను గమనిస్తున్న స్వరూప వాటిని అపహరించాలని పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి అంతమ్మతో పాటు ఇంట్లోనే స్వరూప నిద్రించింది. అంతమ్మ నిద్రలోకి చేరుకున్న తర్వాత స్వరూప నిద్ర లేచి అంతమ్మ కళ్లల్లో కారం చల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఇంట్లో ఉన్న 18 తులాల బంగారంతో పాటు రూ. 6లక్షల నగదును ఎత్తుకెళ్లింది. అంతమ్మ హత్యకు గురి కావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి ఓ మహిళ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అంతమ్మ ఇంట్లో పనిచేస్తున్న స్వరూపను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తానే హత్య చేసి నగదు, డబ్బును ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకుంది. నగదుతో పాటు బంగారంను స్వాధీనం చేసుకొని స్వరూపను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించేలా దర్యాప్తు జరిపిన సీఐ ప్రశాంత్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు. -
ఇళ్లలో పనిచేసుకుంటూ.. 85% మార్కులు!
కుటుంబ పరిస్థితులు ఆ చిన్నారి పట్టుదలను సడలించలేకపోయాయి. చదువుకోవాలన్న తన ఆకాంక్షకు పేదరికం ఏమాత్రం అడ్డు కాలేదు. అందుకే.. ఐదారిళ్లలో పని చేసుకుంటూ కూడా ఖాళీ సమయాల్లో చదువుకుని ఇంటర్ పరీక్షల్లో ఏకంగా 85 శాతం మార్కులు సాధించింది. ఆ చదువుల తల్లి పేరు షాలిని. కుటుంబాన్ని పోషించడం కోసం ఇళ్లలో పని చేసుకుంటూ ఉండేది. అలాగే చదువుకుంటూ ఇటీవల కర్ణాటక బోర్డు నిర్వహించే పీయూసీ పరీక్షలు రాసి.. వాటిలో 85 శాతం మార్కులు సంపాదించింది. ఎట్టకేలకు తన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె ఆనందంగా చెప్పింది. రెండేళ్ల క్రితం పదోతరగతిలో కూడా ఆమెకు 86 శాతం మార్కులు వచ్చాయి. ఆమె తండ్రి ఆర్ముగం దాదాపు దశాబ్దం క్రితం ఓ భవనం మీద నుంచి పడిపోయి.. అప్పటి నుంచి మంచానికే అతుక్కుపోయాడు. ఆమె తమ్ముడు సూర్య బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. షాలిని తల్లి దాదాపు పది- పన్నెండు ఇళ్లలో పనులు చేసుకుంటుంది. ఆమె ఒక్కర్తే సంపాదిస్తే కుటుంబం నడవడం కష్టమని షాలిని కూడా తనకు చేతనైనంత పని చేస్తుంటుంది. తన యజమానులు కూడా తాను ఇంగ్లీషులో మాట్లాడుతుంటే అబ్బురపడతారని, తన మార్కుల గురించి విని, పత్రికలు, టీవీలలో చూసి ఎంతగానో అభినందించారని షాలిని తెలిపింది. తమ ఇంట్లో పనిచేస్తూ కూడా ఎలా చదవగలిగావని వాళ్లు అడిగారంది. ఇప్పుడు ఆమె ఇంజనీరింగ్ చదివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేయాలని ఉత్సాహపడుతోంది. ట్రస్టులు, స్కాలర్షిప్పులు, విరాళాలతో ఎలాగోలా తాను ఇంజనీరింగ్ చదివి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.