ఆ సమస్య పేరే ‘పనిమనిషి మోకాలి నొప్పి’! నిజానికి వైద్య పరిభాషలో ఆ జబ్బు పేరు ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’. ఇంగ్లిష్ వాడుకభాషలో దాన్నే ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. అప్పట్లో ఇంటిని తుడిసేవారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడవడం చేసేవారు. దాంతో మోకాళ్లు దీర్ఘకాలం పాటు ఒరుసుకుపోయి ‘మోకాలి’ నొప్పి వచ్చేది. అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారు (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ) దీనికి గురయ్యేవారు. ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకూ ఈ నొప్పి వస్తుంటుంది. ఎంతమందికి వచ్చినప్పటికీ... ప్రధానంగా ఈ నొప్పి కనిపించేవారి పేరిట ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరే ఖాయం అయ్యింది.
ఈ సమస్య వచ్చినవాళ్లకు తొలిదశలో నొప్పి, మోకాలి వాపు ఉన్న ప్రదేశంలో ఐస్ పెట్టడం, నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేస్తారు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ నొప్పి నివారణ మందుల్నిస్తారు. క్రీడాకారుల్లో ఈ సమస్యను నివారించేందుకు ‘నీ–ప్యాడ్స్’ వాడటం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు.. మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలతో డాక్టర్లు / నిపుణులు ఉపశమనం కలగజేస్తుంటారు.
ఏమిటీ ‘హౌజ్ మెయిడ్ నీ’ సమస్య?!
Published Sun, Nov 28 2021 3:08 PM | Last Updated on Sun, Nov 28 2021 3:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment