House maids knee
-
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
ఏమిటీ ‘హౌజ్ మెయిడ్ నీ’ సమస్య?!
ఆ సమస్య పేరే ‘పనిమనిషి మోకాలి నొప్పి’! నిజానికి వైద్య పరిభాషలో ఆ జబ్బు పేరు ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’. ఇంగ్లిష్ వాడుకభాషలో దాన్నే ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. అప్పట్లో ఇంటిని తుడిసేవారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడవడం చేసేవారు. దాంతో మోకాళ్లు దీర్ఘకాలం పాటు ఒరుసుకుపోయి ‘మోకాలి’ నొప్పి వచ్చేది. అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారు (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ) దీనికి గురయ్యేవారు. ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకూ ఈ నొప్పి వస్తుంటుంది. ఎంతమందికి వచ్చినప్పటికీ... ప్రధానంగా ఈ నొప్పి కనిపించేవారి పేరిట ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరే ఖాయం అయ్యింది. ఈ సమస్య వచ్చినవాళ్లకు తొలిదశలో నొప్పి, మోకాలి వాపు ఉన్న ప్రదేశంలో ఐస్ పెట్టడం, నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేస్తారు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందుల్నిస్తారు. క్రీడాకారుల్లో ఈ సమస్యను నివారించేందుకు ‘నీ–ప్యాడ్స్’ వాడటం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు.. మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలతో డాక్టర్లు / నిపుణులు ఉపశమనం కలగజేస్తుంటారు.