''దాద్రి' వెనుకా 'ముజఫర్' నిందితులే' | Muzaffarnagar Riots and Dadri Killing Linked, Says Mulayam Singh | Sakshi
Sakshi News home page

''దాద్రి' వెనుకా 'ముజఫర్' నిందితులే'

Published Thu, Oct 8 2015 3:46 PM | Last Updated on Mon, Jul 30 2018 8:10 PM

''దాద్రి' వెనుకా 'ముజఫర్' నిందితులే' - Sakshi

''దాద్రి' వెనుకా 'ముజఫర్' నిందితులే'

లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన 'దాద్రి' హత్య ఘటనకు ఓ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కుట్రపన్నారని, ఆ ముగ్గురికీ ముజఫర్నగర్లో జరిగిన అల్లర్లతోనూ సంబంధముందని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. 'దాద్రి' ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు తమ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చినా లెక్కచేయబోమని ఆయన పేర్కొన్నారు.

యూపీలోని 'దాద్రి'లో గోవుమాంసం తిన్నారన్న కారణంగా ఒక వ్యక్తిని దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఏడుగురు వ్యక్తులు స్థానిక బీజేపీ నేతకు చెందినవారని, నిందితులలో సదరు నేత కొడుకు కూడా ఉన్నారని తెలుస్తున్నది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement