Muzaffarnagar riots
-
Muzaffarnagar riots: ఆ ఎమ్మెల్యే సభ్యత్వం ఊడింది
లక్నో: యూపీలోని కతౌలీ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీకి న్యాయస్థానం రెండేళ్లు శిక్ష విధించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఫలితంగా ఆ సీటు ఖాళీ అయినట్లు సోమవారం విడుదల చేసిన నోటిఫికేషనలో ధ్రువీకరించింది. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో సైనీతో పాటు మరో 11 మందికి ప్రత్యేక ప్రజాప్రతినిధుల న్యాయస్థానం అక్టోబర్ 11న రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఇది రెండవ అనర్హత వేటు. ఎస్పీ నాయకుడు మరియు రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై కూడా అక్టోబర్ 28 న ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై అంతా షాక్ -
యూపీ : హింసకు కారణమైన వారి 67 ఆస్తులు సీజ్
లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముజఫర్‌నగర్‌లో గురువారం జరిగిన ఆందోళనలు, నిరసనలలో ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేసింది. ఇప్పటి వరకు ముజఫర్‌నగర్‌లో 67 దుకాణాలను సీజ్ చేయగా, త్వరలో వాటిని వేలం వేసి వచ్చిన ఆదాయంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అంతేకాక, తర్వాతి రోజు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో ముజఫర్‌నగర్, లక్నో, సంభాల్ ప్రాంతాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. 10 బైకులు, పలు కార్లు దహనమవడంతో పాటు 12 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హింసకు కారణమైన వారిని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలలో బంధించిన ప్రభుత్వం జరిగిన నష్టాన్ని వారితోనే భర్తీ చేయించే విధంగా చర్యలు చేపడుతోంది. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమైన వారి ఆస్తులను వేలం వేసైనా సరే, జరిగిన నష్టాన్ని పూడ్చుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు హింసకు కారణమైన వారిని గుర్తించి వారి ఆస్తులను సీజ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. లక్నోలో బాధ్యులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని స్థానిక పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆందోళనలో 13 మంది చనిపోయారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పోలీసులు 705 మందిని అరెస్ట్ చేసి, 124 కేసులు నమోదు చేశారు. అయితే ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను సీజ్ చేసి జరిగిన నష్టాన్ని పూడ్చడంపై ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి చట్టం లేకపోవడం గమనార్హం. చదవండి : వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం -
''దాద్రి' వెనుకా 'ముజఫర్' నిందితులే'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 'దాద్రి' హత్య ఘటనకు ఓ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కుట్రపన్నారని, ఆ ముగ్గురికీ ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లతోనూ సంబంధముందని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. 'దాద్రి' ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు తమ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చినా లెక్కచేయబోమని ఆయన పేర్కొన్నారు. యూపీలోని 'దాద్రి'లో గోవుమాంసం తిన్నారన్న కారణంగా ఒక వ్యక్తిని దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఏడుగురు వ్యక్తులు స్థానిక బీజేపీ నేతకు చెందినవారని, నిందితులలో సదరు నేత కొడుకు కూడా ఉన్నారని తెలుస్తున్నది. -
నలుగురు గ్యాంగ్ రేప్ నిందితులు అరెస్ట్
ముజఫర్ నగర్:గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ లో సంభవించిన అల్లర్లలో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మోహిత్, రాహుల్, సన్నీ, సంజీవ్ లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం మీద 22 మంది నిందితులుగా ఉండగా, 5గురు మాత్రం గ్యాంగ్ రేప్ నిందితులిగా గుర్తించారు. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 14 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ భారీ అల్లర్లలో 60 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా, 40,000 మంది నిరాశ్రయులైయ్యారు. -
కళంకిత నేతల తరఫున రాందేవ్ ప్రచారం
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్లలో నిందితులుగా ఉన్న బీజేపీ నాయకుల తరఫున యోగా గురువు రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్నారు. ముజఫర్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న సంజీవ్ బలియాన్, బిజ్నోర్ నుంచి పోటీ చేస్తున్న భరతేందు సింగ్ ఇద్దరి తరఫున ఆయన ప్రచారం చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అలాగే స్విస్ బ్యాంకులలో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని కూడా చెప్పిందని ఆయన ఈ అభ్యర్థులిద్దరినీ తలోపక్క కూర్చోబెట్టుకుని విలేకరుల సమావేశంలో చెప్పారు. బలియాన్, భరతేందు సింగ్ ఇద్దరూ ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బెయిల్ మీద విడుదలై ఇప్పుడు లోక్‌సభకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ఇదే కేసులో పేరున్న మరో నిందితుడు హుకుమ్ సింగ్ కూడా కైరానా లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫునే పోటీ చేస్తున్నారు. హుకుమ్ సింగ్, సంజీవ్ బలియాన్ ఇద్దరిపైనా రెండేసి కేసులు ఉన్నట్లు వారి నామినేషన్ల అపిడవిట్లలోనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లలో 67 మంది మరణించారు. 85 మంది గాయపడగా, 51వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ముజఫర్‌నగర్ అల్లర్లు: ఎంపీ, ఎమ్మెల్యేలపై చార్జ్‌షీట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌నగర్ మత ఘర్షణల కేసులో బీఎస్పీ ఎంపీ ఖదీర్ రాణా, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు మరో ఏడుగురిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) శనివారం చార్జ్‌షీట్ కేసు దాఖలు చేసింది. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నరేంద్ర కుమార్ ఎదుట సీట్ శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గతేడాది ఆగస్టు 30న ముజఫర్‌నగర్‌లోని కల్హపర్ ప్రాంతంలో సదరు ఆ పది మంది ముస్లిం నాయకుల ప్రసంగం మత విద్వేశాలను రెచ్చగొట్టేదిగా ఉందని సీట్ అభిప్రాయపడ్డింది. నాయకులు ప్రసంగంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.... ఆ ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీసిందని పేర్కొంది. అదే అంశాన్ని సిట్ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు నూర్ సలీం రాణా, మౌలానా జమిల్, కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఉజ్ జామ, అతని కుమారుడు సల్మాన్ సయ్యద్, ముజఫర్‌నగర్ పట్టణ సభ్యుడు అసద్, నౌషద్ ఖురేషి, వ్యాపారి అహ్షన్ ఖురేషి, సుల్తాన్ ముషిర్, నౌషద్లపై చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో దాదాపు 60 మందికి పైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘర్షణల నేపథ్యంలో అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. -
నమ్మకం పోయింది... ఎన్నికలు బహిష్కరిస్తున్నాం
రానున్న లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ముజఫర్‌నగర్ అల్లర్లతో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలు ప్రకటించాయి. అల్లర్లు వల్ల ముజఫర్‌నగర్ జిల్లాలోని లంక్, సిసొలి, బిట్వాడ గ్రామాల నుంచి పలు కుటుంబాలు బల్వా గ్రామానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ సందర్భంగా అయా గ్రామాల ప్రజలు శనివారం బల్వాలో మాట్లాడుతూ... రాజకీయ నాయకులపై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని తెలిపారు. రాజకీయ నాయకులకు ఓటు వేసి గెలిపించిన తమకు ఒరిగేది లేదని వారు నిరాసక్తత వ్యక్తం చేశారు. అనాటి ఘటనలు గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమైయ్యారు. ఆ ఘటన తమ హృదయాలపై బలంగా ముద్రితమైందన్నారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తాము తేరుకోలేదన్నారు. ఆ సంఘటన జరిగన తర్వాత కనీసం ఒక్కనాయకుడు కూడా వచ్చి మేమున్నామంటూ తమకు భరోసా కల్పించలేదని ఆరోపించారు. అయితే అల్లర్లు కారణంగా తమ గ్రామానికి వచ్చి ఆశ్రయం పొందుతున్న దాదాపు 66 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని బిల్వ గ్రామ అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. వారందరికి ఓటర్లు జాబితాలో పేర్లు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో మంది నిరాశ్రయులైయ్యారు. ఆ అల్లర్లకు భయపడి అనేక మంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. -
విచ్ఛిన్న శక్తులతో జాగ్రత్త: మన్మోహన్
ప్రజలకు ప్రధాని మన్మోహన్ సూచన నరేంద్ర మోడీపై పరోక్ష విమర్శలు న్యూఢిల్లీ: భారతదేశ లౌకికవాదానికి ముప్పుగా పరిణమిస్తున్న విచ్ఛిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం నాడిక్కడ జరిగిన వివిధ రాష్ట్రాల మైనార్టీ కమిషన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో మాటల యుద్ధం తారస్థాయికి చేరినవేళ మన్మోహన్ మరోసారి ఆయనపై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. లౌకికవాదానికి సరికొత్త భాష్యం చెబుతూ భారత లౌకిక విధానానికి గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రస్తావిస్తూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో మెజార్టీ, మైనార్టీ వర్గాల మధ్య సామరస్య సంబంధాలు ఉన్నాయని, అయితే ఇటీవలి కొన్ని ఘటనలతో అవి విషమపరీక్షను ఎదుర్కొంటున్నాయన్నారు. మత, భాష, సంస్కృతిపరమైన భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీస్తూ మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సదస్సులో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహమాన్ ఖాన్ మాట్లాడుతూ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచనల మేరకు ఓబీసీలకు కేటాయించిన మొత్తం 27 శాతం రిజర్వేషన్లో 15 శాతం ముస్లింలు, క్రైస్తవులకు కేటాయించి 12 శాతాన్ని ఓబీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశావసరాలకు అణు విద్యుత్తే ఆధారం: పీఎం గోరఖ్‌పూర్ (హర్యానా): సత్వర ఆర్థికాభివృద్ధి లక్ష్యం సాధించడానికి, పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అణు విద్యుత్తే ఆధారపడ తగినదని, ఉత్తమ ఎంపికని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. హర్యానాలోని ఫతేహబాద్ జిల్లా గోరఖ్‌పూర్‌లో 2,800 మెగావాట్ల అణు విద్యుత్తు కేంద్రానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 700 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లను రూ. 23,502 కోట్ల వ్యయంతో హర్యానా అణు విద్యుత్ పరియోజన ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం గోరఖ్‌పూర్‌లో 847 కుటుంబాలకు చెందిన 1,503 ఎకరాల భూమిని సేకరించింది. -
అఖిలేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులను శిబిరాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ మానవహక్కుల కార్యకర్తలు గురువారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హద్దులను దాటింది. రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకొని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులపట్ల మొండిగా ప్రవర్తించింది. అఖిలేశ్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా వ్యవహరించింద’ని జేటీఎస్ఏ ప్రతినిధి మనీశ్ సేథీ పేర్కొన్నారు. ‘ఇంత చల్లటి వాతావరణంలో బాధితులను శిబిరాల్లోని గుడారాల నుంచి ఎలా బయటకు పంపుతారు? ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమే’నని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయి, నీమ్ ఖేరీ, భోరా శిబిరాల్లోని గుడారాల నుంచి బాధితులను పోలీసులు బలవంతంగా పంపించివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపడంతో రాజధానిలోని యూపీ భవన్ ముందు జేటీఎస్ఏ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితుల కళ్లముందే గుడారాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అడ్డుకున్నవారిని చితకబాదారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులకు, అఖిలేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేశ్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు.‘శిబిరాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగానే వెళ్లిపోతున్నారని చెబుతున్న యూపీ సర్కార్ మాటలు పచ్చి అబద్ధమ’ని ఏఎన్హెచ్ఏడీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని, బాధితులకు రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ యూపీ గవర్నర్ బన్వరీలాల్ జోషికి వినతిపత్రం సమర్పించారు. శిబిరాల కూల్చివేతను వెంటనే నిలిపివేయాలని కోరారు. -
నమ్మకమైన జీవితం నాది: అజాంఖాన్
ముజఫర్‌నగర్ మతఘర్షణలపై దర్యాప్తు నెమ్మెదిగా చేయాలని ఆదేశించినట్టు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రమంత్రి అజాం ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడయింది. అయితే ఈ ఆరోపణలను అజాం ఖాన్ తోసిపుచ్చారు. ముజఫర్‌నగర్ మతఘర్షణలపై దర్యాప్తు విషయంలో తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తాను నిజాయితీ, నమ్మకంతో కూడిన జీవితం గడుపుతున్నానని చెప్పారు. తాను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రటిష్ఠను దెబ్బతీసేందుకు సదరు టీవీ చానల్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ముజఫర్‌నగర్ మతఘర్షణలకు కారణమైన వారిని కాపాడేందుకు తాను ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తన చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమన్నారు. ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడనని చెప్పారు. శూల శోధనలు(స్టింగ్ ఆపరేషన్స్) ప్రజాస్వామ్యానికి మంచివి కావని అజాంఖాన్ అభిప్రాయపడ్డారు. -
అల్లర్లు జరగటం దురదృష్టకరం: మన్మోహన్
-
అల్లర్లు జరగటం దురదృష్టకరం: మన్మోహన్
ముజఫర్ నగర్ : అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. అల్లర్ల బాధితులు తలదాచుకుంటున్న బాసి కలాన్ సహాయక శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. సహాయక శిబిరంలో వారికి అందుతున్న సహయ చర్యల గురించి వాకబు చేశారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైతే కేంద్ర సహాయం చేస్తుందని.. ప్రధాని మన్మోహన్సింగ్ వారికి హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణం నెలకొనటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలు సహకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన బాధితులు ప్రధానికి తమ వినతి పత్రాలను అందజేశారు. తమపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ముజఫర్‌నగర్ బాధితులను పరామర్శించడానికి ప్రధాని మన్మోహన్ రాష్ట్రానికి వస్తే... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బాధితులను పరామర్శించడాన్ని కూడా సీఎం రాజకీయం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ముజఫర్ నగర్లో హిందువుల్లోని జాట్ తెగకు ముస్లిం మతస్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న సంఘటన చినికిచినికి గాలివానగా మారింది.ఆ ఘర్షణలో దాదాపు 48 మంది మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
ముజఫర్‌నగర్‌లో 16న ప్రధాని పర్యటన
ముజఫర్ నగర్ : మత ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో ఈ నెల 16న ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటించనున్నారు. యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా మన్మోహన్‌తో కలిసి పర్యటించవచ్చని సమాచారం. అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా పర్యటించనున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ముజఫర్ నగర్లో కర్ఫ్యూ సడలించారు. మహా పంచాయితీ పేరుతో రెండు వర్గాల వారు సమావేశం కాబోతుండగా కొందరు రాళ్ళ దాడి జరపడంతో అల్లర్లు మొదలయ్యాయి. క్రమంగా విస్తరించడంతో ముజఫర్ నగర్లో 40 మందికి పైగా చనిపోయారు. 80 మంది గాయపడ్డారు. 300 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్ ఎంపీపై కేసులు బుక్ చేశారు. అఖిలేష్ సర్కారు అల్లర్లను అదుపుచేయలేకపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
ముజఫర్‌నగర్ మృతులు 40
ముజఫర్‌నగర్, చుట్టుపక్కల పట్టణాల్లో చెలరేగిన మతఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 40కి చేరింది. ఒక్క ముజఫర్‌నగర్‌లోనే 34 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కమల్సక్సేనా లక్నోలో చెప్పారు. మీరట్‌లో ఇద్దరు, హాపూర్, బాఘ్పట్, సహరాన్పూర్, షామ్లీల్లో ఒక్కొక్కరు మరణించినట్లు తెలిపారు. మొత్తం 81 మంది గాయపడగా.. ఈ ఘటనలకు సంబంధించి 366 మందిని అరె స్టు చేసినట్లు వెల్లడించారు. పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో ముజఫర్‌నగర్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో మంగళవారం కర్ఫ్యూ సడలించారు. తాజా హింసాకాండ గురించిన ఎలాంటి సమాచారం అందకపోవడంతో కొత్వాలి, సివిల్ లైన్స్, నై నంది ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రెండుగంటల పాటు కర్ఫ్యూ సడలించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ కుశాల్‌రాజ్ తెలిపారు. మరోవైపు అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జి విష్ణుసహాయ్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేసింది. రెండునెలల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. రాష్ట్రంలో మతఘర్షణలు సృష్టించి వాతావరణాన్ని కలుషితం చేయాలని ప్రయత్నించినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. సరైన సమయంలో చర్యలు చేపట్టి హింసాకాండను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ధ్వజమెత్తాయి. కఠిన చర్యల ద్వారా పరిస్థితిని అదుపులోకి తేకపోతే ఘర్షణలు ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందని ఆర్ఎల్డీ నేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ పేర్కొన్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ముజఫర్‌నగర్ హింసాకాండలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో వ్యాఖ్యానించారు. కాగా, ముజఫర్‌నగర్ హింసాకాండలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మంగళవారం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
ముజఫర్‌నగర్ మృతులు 40
ముజఫర్‌నగర్, చుట్టుపక్కల పట్టణాల్లో చెలరేగిన మతఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 40కి చేరింది. ఒక్క ముజఫర్‌నగర్‌లోనే 34 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కమల్సక్సేనా లక్నోలో చెప్పారు. మీరట్‌లో ఇద్దరు, హాపూర్, బాఘ్పట్, సహరాన్పూర్, షామ్లీల్లో ఒక్కొక్కరు మరణించినట్లు తెలిపారు. మొత్తం 81 మంది గాయపడగా.. ఈ ఘటనలకు సంబంధించి 366 మందిని అరె స్టు చేసినట్లు వెల్లడించారు. పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో ముజఫర్‌నగర్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో మంగళవారం కర్ఫ్యూ సడలించారు. తాజా హింసాకాండ గురించిన ఎలాంటి సమాచారం అందకపోవడంతో కొత్వాలి, సివిల్ లైన్స్, నై నంది ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రెండుగంటల పాటు కర్ఫ్యూ సడలించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ కుశాల్‌రాజ్ తెలిపారు. మరోవైపు అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జి విష్ణుసహాయ్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేసింది. రెండునెలల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. రాష్ట్రంలో మతఘర్షణలు సృష్టించి వాతావరణాన్ని కలుషితం చేయాలని ప్రయత్నించినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. సరైన సమయంలో చర్యలు చేపట్టి హింసాకాండను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ధ్వజమెత్తాయి. కఠిన చర్యల ద్వారా పరిస్థితిని అదుపులోకి తేకపోతే ఘర్షణలు ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందని ఆర్ఎల్డీ నేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ పేర్కొన్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ముజఫర్‌నగర్ హింసాకాండలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో వ్యాఖ్యానించారు. కాగా, ముజఫర్‌నగర్ హింసాకాండలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మంగళవారం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.