దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్నగర్ మత ఘర్షణల కేసులో బీఎస్పీ ఎంపీ ఖదీర్ రాణా, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు మరో ఏడుగురిపై సిట్ చార్జ్షీట్ కేసు దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్నగర్ మత ఘర్షణల కేసులో బీఎస్పీ ఎంపీ ఖదీర్ రాణా, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు మరో ఏడుగురిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) శనివారం చార్జ్షీట్ కేసు దాఖలు చేసింది. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నరేంద్ర కుమార్ ఎదుట సీట్ శుక్రవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. గతేడాది ఆగస్టు 30న ముజఫర్నగర్లోని కల్హపర్ ప్రాంతంలో సదరు ఆ పది మంది ముస్లిం నాయకుల ప్రసంగం మత విద్వేశాలను రెచ్చగొట్టేదిగా ఉందని సీట్ అభిప్రాయపడ్డింది.
నాయకులు ప్రసంగంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.... ఆ ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీసిందని పేర్కొంది. అదే అంశాన్ని సిట్ తన చార్జ్షీట్లో పేర్కొంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు నూర్ సలీం రాణా, మౌలానా జమిల్, కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఉజ్ జామ, అతని కుమారుడు సల్మాన్ సయ్యద్, ముజఫర్నగర్ పట్టణ సభ్యుడు అసద్, నౌషద్ ఖురేషి, వ్యాపారి అహ్షన్ ఖురేషి, సుల్తాన్ ముషిర్, నౌషద్లపై చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో ముజఫర్నగర్లో మత ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో దాదాపు 60 మందికి పైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘర్షణల నేపథ్యంలో అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.