ముజఫర్ నగర్:గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ లో సంభవించిన అల్లర్లలో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మోహిత్, రాహుల్, సన్నీ, సంజీవ్ లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం మీద 22 మంది నిందితులుగా ఉండగా, 5గురు మాత్రం గ్యాంగ్ రేప్ నిందితులిగా గుర్తించారు.
ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 14 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ భారీ అల్లర్లలో 60 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా, 40,000 మంది నిరాశ్రయులైయ్యారు.