gang rape convicts
-
ఆ పాశవికులు మరో కేసులో దోషులు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థినిపై పాశావిక లైంగిక దాడి కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులు మరో కేసులో నిందితులుగా తేల్చారు. ఢిల్లీలోని కిందిస్థాయి కోర్టు వారు అదే రోజు దొంగతనానికి పాల్పడినట్లు నిర్థారించింది. 2012 డిసెంబర్ 16న రాత్రి ఓ పారామెడికల్ విద్యార్థినిపై ఈ నలుగురు వేగంగా నడుస్తున్న బస్సులో అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె స్నేహితుడిని కొట్టి ఇద్దరిని వివస్తృలుగా చేసి నడిరోడ్డుపక్కన పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ దారుణానికి పాల్పడటానికి కొన్ని గంటలముందు ఇదే నలుగురు ఓ కార్పెంటర్ దంపతుల ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇదే కేసును తాజాగా విచారించిన కోర్టు వారిని ఈకేసులో కూడా దోషులుగా తేల్చింది. -
నలుగురు గ్యాంగ్ రేప్ నిందితులు అరెస్ట్
ముజఫర్ నగర్:గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ లో సంభవించిన అల్లర్లలో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మోహిత్, రాహుల్, సన్నీ, సంజీవ్ లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం మీద 22 మంది నిందితులుగా ఉండగా, 5గురు మాత్రం గ్యాంగ్ రేప్ నిందితులిగా గుర్తించారు. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 14 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ భారీ అల్లర్లలో 60 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా, 40,000 మంది నిరాశ్రయులైయ్యారు. -
ఆ కీచకులు దోషులే
ముంబై: ముంబైలోని శక్తిమిల్స్‌లో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులను స్థానిక సెషన్స్‌కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులకు మరణశిక్షకూడా విధించేందుకు అవకాశముంది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సవరించిన సెక్షన్ 376(ఈ) ప్రకారం విజయ్ జాదవ్ (19), కాసిమ్ బెంగాలి (21), మహమ్మద్ సలీమ్ అన్సారీలను(28) దోషులుగా నిర్ధారిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలిని ఫన్సల్కర్ జోషి గురువారం తీర్పుచెప్పారు. కాగా ఈ ముగ్గురు నిందితులకు ఓ టెలిఫోన్ ఆపరేటర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు ఇప్పటికే యావజ్జీవ శిక్ష పడింది. తాజా కేసులో అదేతరహా నేరానికి మరోసారి పాల్పడినందుకు సవరించిన సెక్షన్ ప్రకారం శిక్ష విధించనున్నారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన అనంతరం ఐపీసీలో సెక్షన్ 376(ఈ)ను పొందుపరిచారు. దీని ప్రకారం శిక్షను పెంచేందుకు వీలుంటుంది. సెషన్స్‌కోర్టు శుక్రవారం వీరికి శిక్షను ప్రకటించే అవకాశముంది. దేశంలో తొలిసారిగా ఈ సెక్షన్ ప్రకారం శిక్షను ప్రకటించనున్నారు. హేయమైన నేరాలకు పాల్పడే ధోరణికి అడ్డుకట్ట వేయడానికి శాసన కర్తలు ఈ సెక్షన్‌ను రూపొందించారని జడ్జి షాలిని జోషి పేర్కొన్నారు. తాజా కేసులో చార్జిషీటు నమోదు చేసేనాటికే నిందితులకు గత నేరానికి సంబంధించిన కేసులో శిక్ష పడిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ నిందితులు గతంలో కూడా ఇదే తరహాలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, శిక్షకూడా పడిందని ప్రాసిక్యూషన్ నిరూపించినట్టు జడ్జి పేర్కొన్నారు. అదే అకృత్యం పాడుపడిన శక్తిమిల్స్‌లోనే ఈ నిందితులు గత ఏడాది జూలైలో ఓ 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే ఏడాది ఆగస్టు 22న శక్తిమిల్స్ ఆవరణలోనే 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.