న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థినిపై పాశావిక లైంగిక దాడి కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులు మరో కేసులో నిందితులుగా తేల్చారు. ఢిల్లీలోని కిందిస్థాయి కోర్టు వారు అదే రోజు దొంగతనానికి పాల్పడినట్లు నిర్థారించింది.
2012 డిసెంబర్ 16న రాత్రి ఓ పారామెడికల్ విద్యార్థినిపై ఈ నలుగురు వేగంగా నడుస్తున్న బస్సులో అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె స్నేహితుడిని కొట్టి ఇద్దరిని వివస్తృలుగా చేసి నడిరోడ్డుపక్కన పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ దారుణానికి పాల్పడటానికి కొన్ని గంటలముందు ఇదే నలుగురు ఓ కార్పెంటర్ దంపతుల ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇదే కేసును తాజాగా విచారించిన కోర్టు వారిని ఈకేసులో కూడా దోషులుగా తేల్చింది.
ఆ పాశవికులు మరో కేసులో దోషులు
Published Thu, Aug 27 2015 6:02 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement