december 16
-
ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికలు
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం లిమిటెడ్(క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ) ఎన్నికలు వచ్చే నెల 16న జరగనున్నాయి. ఈ మేరకు సీసీఎస్ కార్యదర్శి ఎన్వీ రాఘవరెడ్డి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సభ్యులు డిసెంబరు2 నుంచి 8వ తేదీ వరకు ఆయా డిపోల్లో నామినేషన్ దాఖలు చేయాల్సివుంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబరు 13 అని రాఘవరెడ్డి చెప్పారు. 13 జిల్లాల్లో పనిచేస్తున్న 55,462 మంది ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎస్ ఎన్నికల్లో పాల్గొని 242 మంది డెలిగేట్స్‌ను ఎంపిక చేసుకుంటారు. సీసీఎస్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదరరావులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై లైంగికదాడి(2012 డిసెంబర్ 16) చేసి అత్యంతపాశవికంగా ప్రవర్తించి ఆమె చావుకు కారణమైన ప్రధాన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి తిహార్ జైలులో ఉండగా వారిలో వినయ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత పెయిన్ కిల్లర్స్ తీసుకొని అనంతరం టవల్ తో ఉరిపెట్టుకున్నాడు. అది గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని తప్పించి ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. 2013 ప్రారంభంలో తనపై తిహార్ జైలులోని తోటి ఖైదీలు దాడి చేశారని తనకు అదనపు భద్రత కల్పించాలని వినయ్ శర్మ అప్పట్లో డిమాండ్ చేశాడు. కాగా, ఈ కేసులో ఉన్న నిందితులు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందే అదే ఏడాది(2013) మార్చి నెలలో బస్సు డ్రైవర్ రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని చనిపోగా అతడి తల్లిదండ్రులు మాత్రం పోలీసుల హత్య అని ఆరోపించారు. -
ఇటు నిర్భయ.. అటు పెషావర్
స్వాతంత్య్రానంతరం ఇరు దేశాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఘోర సంఘటనలను భారత్, పాకిస్థాన్ గుర్తు చేసుకుంటున్నాయి. మూడేళ్ల క్రితం డిసెంబర్ 16న భారత రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై పాశవిక లైగింకదాడి, అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు.. కొత్త చట్టాలకు బాటలు వేస్తే, ఏడాది క్రితం ఇదే డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేధం.. పాలు పొసి పెంచిన ఉగ్రవాదమనే పాము తనను కూడా కాటేయకుండా ఉండదని పాక్‌కు తెలిసొచ్చేలా చేసింది. మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు జస్టిస్ వర్మ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన చట్టానికి 'నిర్భయ' పేరు పెట్టుకుంది భారత్. పెషావర్ మారణహోమం తర్వాత ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది పాక్. ఆ మేరకు ఉగ్రవాదులకు ఉరిశిక్షల అమలుపై కొనసాగుతున్న మారటోరియాన్ని ఎత్తేసి నాలుగు నెలల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ దండన విధించింది. నిర్భయ చట్టం రూపొందించినంత మాత్రన మన దేశంలో లైంగిక దాడులు ఆగలేదు. మరణశిక్షలు అమలు చేసినంత మాత్రాన పాకిస్థాన్‌లో ఉగ్రవాదమూ అంతమొందలేదు. కానీ ఆ రెండు ఘటనలు ఇరుదేశాల పౌరుల ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఇండియాలో వేధింపులు తగ్గలేదు. కానీ వేధింపులను భరించే మహిళల సంఖ్య తగ్గింది. కాటేయజూసినవాడు కన్నతండ్రైనా, సొంత అన్నైనా, ఉపాధ్యాయుడైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే పోయే 'పరువు' కంటే, పిల్లల ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి భారతీయ కుటుంబాలు. కేవలం దాయాది దేశం మీద ద్వేషంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. భావితరం బతకలేదని గుర్తించారు పాకిస్థానీ పేరెంట్స్. -
ఆ పాశవికులు మరో కేసులో దోషులు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థినిపై పాశావిక లైంగిక దాడి కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులు మరో కేసులో నిందితులుగా తేల్చారు. ఢిల్లీలోని కిందిస్థాయి కోర్టు వారు అదే రోజు దొంగతనానికి పాల్పడినట్లు నిర్థారించింది. 2012 డిసెంబర్ 16న రాత్రి ఓ పారామెడికల్ విద్యార్థినిపై ఈ నలుగురు వేగంగా నడుస్తున్న బస్సులో అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె స్నేహితుడిని కొట్టి ఇద్దరిని వివస్తృలుగా చేసి నడిరోడ్డుపక్కన పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ దారుణానికి పాల్పడటానికి కొన్ని గంటలముందు ఇదే నలుగురు ఓ కార్పెంటర్ దంపతుల ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇదే కేసును తాజాగా విచారించిన కోర్టు వారిని ఈకేసులో కూడా దోషులుగా తేల్చింది. -
మహిళ లకు పోలీసుల చేయూత
న్యూఢిల్లీ: డిసెంబర్ 16 న మహిళపై లైంగికదాడికి జరిగి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహిళలకు చేయూతనిచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నడుంబిగించారు. సోమవారం పేద మహిళలకు డ్రైవింగ్, ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధనే ధ్యేయంగా పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. శిక్షణ పొందిన మహిళకు ఉద్యోగాలు ఇప్పించేందుకు అనుమతి కలిగి ఉన్న రేడియో ట్యాక్సీ సంస్థలైన మెరూ, ఈజీక్యాబ్స్తో ఈ మేరకు అవగాహన కుదుర్చుకొన్నామని చెప్పారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొందడానికి 100 మహిళలు స్వచ ్ఛందంగా ఉత్తర జిల్లా పోలీసుల వద్ద నమోదు చేయించుకొన్నారు. ఉదయం, లేదా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో డ్రైవింగ్‌లో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా మహిళలు ఏదో ఓ బ్యాచ్‌లో శిక్షణ పొందవచ్చని పోలీసులు తె లిపారు. ఇలాంటి మహిళల కోసం కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు స్వచ్ఛందంగా వాహనాలను కేటాయించాయి. డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న మహిళా పోలీసులు కూడా వారికి శిక్షణ ఇస్తారని డిప్యూటీ పోలీస్ కమిషనర్(ఉత్తర) మాధుర్వర్మ తెలిపారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న దారిద్య్రరేకకు దిగువ ఉన్న కుటుంబాల మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను స్వచ్ఛందంగా చేరదీసి ‘పరివర్తన పథకం’కింద డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళ పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా మహిళలు నిర్భయంగా వచ్చి ఫిర్యాదులు చేసే వాతావరణాన్ని కల్పించాలన్నారు. -
‘ఎఫ్ఐఆర్ నమోదు చట్టవ్యతిరేకం’
న్యూఢిల్లీ: నిర్భయ స్నేహితుడు ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారని, ఇది చట్టవ్యతిరేకమని డిసెంబర్ 16నాటి సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురిలో ఇద్దరు ఢిల్లీ హైకోర్టు ముందు వాదించారు. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ రేవ కేత్రపాల్, ప్రతిభా రాణిలతో కూడిన ధర్మాసనం ముందు దోషులు ముఖేశ్, పవన్ కుమార్ గుప్తాలు సోమవారం హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాది ఎం.ఎల్.శర్మ మాట్లాడుతూ నిర్భయ వాంగ్మూలం కాకుండా ఆమె స్నేహితుడు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. అలాగే మృతురాలి శరీరంపై ఉన్న ఆరు గాయాలతో, ఇద్దరు దోషుల వేలిముద్రలతో సరిపోయాయన్నారు. అలాంటప్పుడు ముఖేశ్, పవన్‌లను దోషులుగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం కూడా ఈ వాదనలు జరగనున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు అత్యాచారం చేశారు. వీరిలో నలుగురికి ఉరి శిక్ష ఖరారైంది. మరొకడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ బాల నేరస్తుల గృహంలో శిక్ష అనుభవిస్తున్నాడు. -
జీపీఎస్ లేని వాహనాలపై కొరడా
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన జరిగిన తర్వాత రవాణా విభాగంలో భారీ మార్పులే కనబడుతున్నాయి. ప్రయాణికుల భద్రతతో పాటు ఇతర నియమాలను పాటించని అన్ని వాహనాలపై దాడులు చేసేందుకు నియమించిన ప్రత్యేక బృందం అనుకున్న మేరకు ఫలితాలను రాబట్టగలుగుతోంది. ఈ ఏడాది నియమాలు పాటించని 202 చార్టెర్డ్ బస్సుల పర్మిట్‌ను రద్దు చేసింది. ఈ సంఖ్య స్వల్పంగా కనిపిస్తున్నా గతేడాదితో పొల్చుకుంటే ఇది మెరుగనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఒక్క బస్సు పర్మిట్‌ను కూడా రద్దు చేయని రవాణా శాఖ అధికారులు ఈసారి 2,529 చార్టెర్డ్ బస్సుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేయగా, మరికొన్నింటిని సస్పెండ్ చేశారు. నిర్భయపై అత్యాచారం బస్సులో జరగడంతో దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో అప్రమత్తమైన రవాణా శాఖ ప్రజా రవాణా వాహనాలపై దృష్టి సారించింది. ప్రతి వాహనం సెప్టెంబర్‌లోపు జీపీఎస్ వ్యవస్థను అమర్చుకోవాలని ఆదేశాలు జారీచేసింది. లేకపోతే చలాన్లు విధిస్తామని, పర్మిట్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది.నవంబర్ నెలాఖరువరకు నియమాలు పాటించని 2,500 బస్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ వరకు సమయమిచ్చినా జీపీఎస్ అమర్చుకోని 451 గ్రామీణ్ సేవా వాహనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2,138 వాహనాల పర్మిట్‌ను కూడా రద్దు చేసింది. అలాగే 2,464 ఆటో యజమానులపై కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంది. నవంబర్ వరకు 3,05,549 చార్టెర్డ్ బస్సులు ఇప్పటికీ జీపీఎస్ అమర్చుకోలేదని తెలిపింది. 2011-12లో 1,549 ప్రయాణికుల వాహనాలు స్వాధీనం చేసుకున్న రవాణాశాఖ ఈసారి 10,144 వాహనాలను జప్తు చేసుకుంది. ఇప్పటివరకు 1.54 లక్షల ప్రజా సేవ వాహనాల (పీఎస్వీ)కు పోలీసులు తనిఖీ చేసి గుర్తులు జారీ చేశారు. నగరంలోని 1,515 గుర్తింపు పొందిన పాఠశాలల్లో తమ బస్సులను పోలీసులు తనిఖీ చేశారని 582 సంస్థల యజమానులు రవాణాశాఖకు లేఖలు రాశారు. తాము ఎలాంటి రవాణా సదుపాయం కల్పించడం లేదని 764 పాఠశాల యజమానులు పేర్కొన్నారు. -
జంతర్‌మంతర్‌లో నేటికీ...
సాక్షి, న్యూఢిల్లీ: ‘డిసెంబర్ 16’ రాత్రి ఘటన ఇంకా ఢిల్లీవాసుల మదిలో మెదులుతూనే ఉంది. ఆడబిడ్డపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ చిన్నా పెద్దా.. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరి పిడికిళ్లు బిగిశాయి. కన్నెర్ర చేసిన ఢిల్లీయువత ఆగ్రహానికి రైసినాహిల్స్ జనసంద్రంగా మారింది. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీ యావత్తు ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. అంతా ఒక్కటై నిర్భయకు న్యాయం చేయాలని నినదించారు. పోలీసు ఆంక్షలు వారిని ఆపినా.. బారికేడ్లు అడ్డుపెట్టినా జనసామాన్యం గొంతుకను వినిపించే జంతర్‌మంతర్ ఆందోళనలో తాను పాలుపంచుకుంది. ఆందోళనకారులను తన అక్కున చేర్చుకుని నినాదాలతో ఘోషించి ంది. 16 డిసెంబర్ క్రాంతి పేరిట ఏర్పడిన సంస్థ నిర్భయ నిందితులను తుదముట్టించేవరకు పోరు సాగిస్తాంటూ జంతర్‌మంతర్‌లో నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏడాది గడిచినా జంతర్‌మంతర్‌లో నిర్భయ ఘటన అనంతర ఉద్యమాల తాలూకా జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నేటికి మారుమ్రోగుతున్న నినాదాలు: కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన దాడి ఘటన తర్వాత జనాగ్రహం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తూ వచ్చింది. రోజురోజుకు ఆందోళనలో పాల్గొనే వారి సంఖ్య వందల నుంచి వేలల్లోకి మారిపోయింది. ‘వీ వాంట్ జస్టిస్...’ ‘ఫాంసీదో.. ఫాంసీదో..’అంటూ చేసిన నినాదాలు నేటికి ఆ ప్రాంతానికి వెళితే చెవుల్లో మారుమ్రోగినట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్డుపై పడుకునేందుకు ఉడికిపోయారు యువత. నిరసన వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకున్నారు. కొందరు ఆవేదనతో దిక్కులు పిక్కటిల్లేలా ‘న్యాయం చేయండి’అంటూ నినదిస్తే.. జావత్ జాతిని మేల్కొలిపిన ‘చెల్లెమ్మ’ ఆరోగ్యం కుదుటపడాలంటూ నిరంతరం ప్రార్థనలు చేశారు. కళాకారులు సైతం కుంచె కలిపారు. తమ బొమ్మలతో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చూపారు. నిర్భయ సమాధిని ఏర్పాటుచేసి అక్కడ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జంతర్‌మంతర్‌లో చేసే ధర్నాలు అన్నీ ఒక ఎత్తు అయితే నిర్భయ ఘటనలు ఒకటి. ఇక్కడ ఏళ్లుగా ఆందోళనలు చేసినా నెరవేరని ఎన్నో డిమాండ్లు ఉన్నా, నిర్భయ ఘటనలో యువత స్పందించిన తీరు.. జంతర్‌మంతర్‌లో కొనసాగిన నిరసనల హోరు పార్లమెంట్‌నూ కుదిపేసింది.ఘటన జరిగిన తర్వాత నుంచి నిర్భయ మతి ఆతర్వాతి పరిణామాల వరకు యావత్ దేశం చూపంతా జంతర్‌మంతర్‌పైనే కేంద్రీకతమై ఉంది. దేశ, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం చర్చకు దారితీసిన ఓ ‘ఘటన’కు జంతర్‌మంతర్ సజీవ సాక్ష్యం నిలిచింది. ఇక్కడ రోజుల తరబడి చేసిన ఆందోళనలే తర్వాతి కాలంలో ‘నిర్భయ చట్టం’రావడానికి కారణమాయ్యయనేది చరిత్ర మరువని సత్యం.