ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు | Nirbhaya Gangrape Case Convict Vinay Sharma Attempts Suicide | Sakshi
Sakshi News home page

ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు

Published Thu, Aug 25 2016 8:54 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు - Sakshi

ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై లైంగికదాడి(2012 డిసెంబర్ 16) చేసి అత్యంతపాశవికంగా ప్రవర్తించి ఆమె చావుకు కారణమైన ప్రధాన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి తిహార్ జైలులో ఉండగా వారిలో వినయ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత పెయిన్ కిల్లర్స్ తీసుకొని అనంతరం టవల్ తో ఉరిపెట్టుకున్నాడు.

అది గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని తప్పించి ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. 2013 ప్రారంభంలో తనపై తిహార్ జైలులోని తోటి ఖైదీలు దాడి చేశారని తనకు అదనపు భద్రత కల్పించాలని వినయ్ శర్మ అప్పట్లో డిమాండ్ చేశాడు. కాగా, ఈ కేసులో ఉన్న నిందితులు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందే అదే ఏడాది(2013) మార్చి నెలలో బస్సు డ్రైవర్ రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని చనిపోగా అతడి తల్లిదండ్రులు మాత్రం పోలీసుల హత్య అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement