
న్యూఢిల్లీ: తాను మానసికంగా బాధపడుతున్నానని చెబుతున్న నిర్భయ కేసులో ఒకరైన వినయ్ శర్మ చెబుతున్నదంతా అబద్ధమని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. వినయ్ తనపై తాను పైపైన తగిలేలా గాయపరుచుకున్నట్లు తేలిందని జడ్జి ధర్మేందర్‌కు అధికారులు తెలిపారు. పైగా ఎలాంటి మానసిక వ్యాధితో బాధపడట్లేదనే విషయం తేటతెల్లమైందని వివరించారు. అతడు ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడట్లేదని, తరచూ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని జైలు అధికారులు చెప్పారు.త్వరలో ఉరి కంబం ఎక్కబోతున్న తనకు మానసిక రుగ్మతతో బాధపడుతున్నందున ఉరి నుంచి తనకు మినహాయింపు కలిగించాలని శర్మ పిటిషన్ వేయడం తెల్సిందే.