Vinay Sharma
-
నిర్భయ దోషులకు నేడే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు తెలిపింది. నిర్భయ తల్లి వ్యాఖ్య తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు. దోషి అక్షయ్ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్(32), పవన్(25), వినయ్(26), అక్షయ్(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు. -
వినయ్ శర్మ బాగానే ఉన్నాడు
న్యూఢిల్లీ: తాను మానసికంగా బాధపడుతున్నానని చెబుతున్న నిర్భయ కేసులో ఒకరైన వినయ్ శర్మ చెబుతున్నదంతా అబద్ధమని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. వినయ్ తనపై తాను పైపైన తగిలేలా గాయపరుచుకున్నట్లు తేలిందని జడ్జి ధర్మేందర్‌కు అధికారులు తెలిపారు. పైగా ఎలాంటి మానసిక వ్యాధితో బాధపడట్లేదనే విషయం తేటతెల్లమైందని వివరించారు. అతడు ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడట్లేదని, తరచూ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని జైలు అధికారులు చెప్పారు.త్వరలో ఉరి కంబం ఎక్కబోతున్న తనకు మానసిక రుగ్మతతో బాధపడుతున్నందున ఉరి నుంచి తనకు మినహాయింపు కలిగించాలని శర్మ పిటిషన్ వేయడం తెల్సిందే. -
గోడకి తలబాదుకున్న నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాలంటూ శర్మ తరఫున అతని లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. స్కిజోఫేర్నియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ పిటిషన్లో పేర్కొనడంతో ఎలాంటి వైద్యం అందిస్తున్నారో వెల్లడించాలని తీహార్ జైలు అధికారుల్ని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ఆదేశించారు. ఉరిశిక్ష విధించిన దగ్గర్నుంచి వినయ్ శర్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అసహనంగా సెల్లోనే పచార్లు చేస్తున్నట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వినయ్ శర్మ ఆదివారం మధ్యాహ్నం తీహార్ జైలులో తనను ఉంచిన గదిలో తల గోడకేసి బాదుకోవడంతో గాయాలయ్యాయి. వెంటనే అతనికి అక్కడికక్కడే తీహార్ జైలు వైద్యులే చికిత్స అందించినట్టు అధికారులు చెప్పారు. ఆ గాయాలు ఏమంత పెద్దవి కావని వారు వెల్లడించారు. అయితే శర్మ తరఫు లాయర్ మాత్రం క్లయింట్ మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని, తన తల్లిని కూడా గుర్తించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వినయ్ శర్మ కుటుంబ సభ్యుల కోరిక మేరకు లాయర్ తీహార్ జైలుకి వెళితే తలకి గాయాలు, కుడి భుజానికి ఫ్రాక్చర్ అయి కట్టుతో కనిపించాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందంటూ లాయర్ తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు తీహార్ జైలు అధికారులు స్పందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. -
నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం
-
నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరితీతకు తాజా డెత్‌వారెంట్ జారీ అయిన నేపథ్యంలో దోషులు ఇప్పటికీ ఉరిని వాయిదా వేసేలా పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. దోషుల్లో ఇప్పటివరకూ తమ ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని పవన్ గుప్తా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఇక మరో దోషి వినయ్ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. తనను ఉంచిన సెల్లో గోడకు వినయ్ తలబాదుకున్నాడని, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని తీహార్ జైలు అధికారులు తెలిపారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో ఇక ఎలాంటి జాప్యం చోటుచేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి కోరుతున్నారు. నిర్భయకు న్యాయం జరగనిపక్షంలో హత్యాచారం వంటి తీవ్ర నేరాలకు గురైన బాధితులెవరికీ సత్వర న్యాయం జరిగే పరిస్థితి ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : నిర్భయ కేసు: సొమ్మసిల్లిన సుప్రీం న్యాయమూర్తి -
‘నిర్భయ’ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై న్యాయ సమీక్ష అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘క్షమాభిక్ష కోరుతూ సమర్పించిన అన్ని సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరమని భావించేందుకు ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదు. అందువల్ల ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పిటిషనర్ వాదనను కూడా కొట్టివేసింది. వినయ్ శర్మ ఆరోగ్యం సరిగ్గానే ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్‌లో స్పష్టంగా ఉందన్నారు. తిహార్ జైళ్లో తనను చిత్రహింసలు పెట్టారని, దాంతో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఈ విషయాన్ని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్లో వినయ్ శర్మ పేర్కొన్నారు. జైళ్లో చిత్రహింసల కారణంగా మానసిక అనారోగ్యానికి గురయ్యా నని స్పష్టం చేసే అన్ని పత్రాలను రాష్ట్రపతి దృష్టికి కేంద్రం తీసుకువెళ్లలేదని ఆ పిటిషన్లో శర్మ ఆరోపించారు. అయితే, వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. డెత్ వారెంట్ జారీ చేయొచ్చు: నిర్భయ దోషులకు వేర్వేరు రోజుల్లో ఉరిశిక్ష విధించేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని తాజాగా డెత్ వారెంట్లను ట్రయల్ కోర్టు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, నలుగురు దోషుల్లో పవన్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 17న ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించే సమయానికి, పవన్ క్యూరేటివ్ పిటిషన్ వేస్తాడన్నారు. ఇక పవన్ వంతు.. నలుగురు దోషుల్లో.. పవన్ గుప్తా ఇంకా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదు. పవన్‌కు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కూడా ఉంది. కాగా, తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను కూడా రాష్ట్రపతి కొట్టేశారు. స్పృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి నిర్భయ’ దోషులను వేర్వేరు రోజుల్లో ఉరి తీసేందుకు అనుమతించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ భానుమతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కాసేపటికి మళ్లీ స్పృహలోకి వచ్చారు. వెంటనే ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఆమెను తన చాంబర్లోకి తీసుకువెళ్లారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించారు. జస్టిస్ భానుమతి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జైల్లో తీవ్రమైన టార్చర్ కారణంగా వినయ్ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే సమయంలో ఆ విషయాన్ని రాష్ట్రపతి పరిగణించలేదని అతని తరపు లాయర్ వాదించారు. అతను మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెప్పే మెడికల్ రికార్డులు రాష్ట్రపతి వద్దకు రాలేదని కోర్టుకు తెలిపారు. కాగా, ఈ వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగానే ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఫిబ్రవరి 12 నాటి మెడికల్ రికార్డుల ప్రకారం వినయ్ ఆరోగ్య స్థితికి ఇబ్బందేం లేదని కేంద్రం తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వినయ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక 2012లో నిర్భయ ఘటన జరగగా.. 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి : నిర్భయ దోషికి లాయర్‌ను నియమించిన కోర్టు) -
నిర్భయ దోషికి లాయర్.. హక్కులు కాపాడాలి!
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యోదంతం దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాకు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొత్త లాయర్‌ను నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును అనుసరించి దోషి తరఫున వాదించేందుకు రవి ఖాజీ అనే న్యాయవాదిని నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా.. దోషి చివరి శ్వాస వరకు అతడి హక్కుల్ని, స్వేచ్చను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని పేర్కొంది. కాగా తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్‌ను తొలగించిన కారణంగా.. తాను కొత్త లాయర్‌ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని పవన్ గుప్తా కోర్టును కోరిన విషయం తెలిసిందే. (లాయర్ లేడట.. నేనేమో న్యాయం కోసం అడుక్కోవాలి: నిర్భయ తల్లి) ఇదిలా ఉండగా.. నిర్భయ దోషి వినయ్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి తిరస్కరణను సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలులో జాప్యం చేసేందుకే దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ నలుగురు దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయడం కోసం డెత్‌వారెంట్లు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పటికిప్పుడు డెత్ వారెంట్లు జారీ చేయలేమని పేర్కొంది. (నిర్భయ దోషులకు ‘సుప్రీం’ నోటీసులు) కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి... ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేసిన విషయం విదితమే. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.(నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ) -
నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ
న్యూఢిల్లీ: నిర్భయ దోషి వినయ్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. వినయ్ శర్మ తరఫున అతడి లాయర్ ఏపీ సింగ్ ఈమేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు ఉరిశిక్ష రద్దు చేసి, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అర్జీ పెట్టుకోగా... ఫిబ్రవరి 1న ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక నిర్భయ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలనీ, న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోవడానికి వారికి ఢిల్లీ హైకోర్టు గడువు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే. నిర్భయ దోషుల ఉరితీతపై స్టేకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడానికి న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. దోషులకు నోటీసులు ఇవ్వాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనతో జస్టిస్ భానుమతి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. చదవండి: నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి కాగా ఈ కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకోగా.. వినయ్ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. ఇంకా అతడికి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఒకే కేసులో దోషులైన వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ క్రమంలో దోషులు మరోసారి వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. -
'నిర్భయ దోషికి స్లో పాయిజన్ ఇస్తున్నారు'
న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వినయ్ శర్మకు జైలు అధికారులు స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆయన తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడం లేదన్నారు. శనివారం ఆయన ఈ మేరకు కోర్టుకు దరఖాస్తును అందజేశారు. కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..! దోషులు ఉరి తప్పించుకునేందుకు తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని.. వారికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చామని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి వినయ్ శర్మ లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు. దీంతో ఉరి నుంచి తప్పించుకునేందుకు మెల్లమెల్లగా దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరించగా ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు! -
క్షమాభిక్ష అడగలేదు: నిర్భయ కేసు దోషి
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నిర్భయ కేసులో నేరస్తుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో సంచలన విషయం వెల్లడించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని ఢిల్లీలోని నిర్భయ సామూహిక హత్యాచార ఘటనలో మరణ శిక్ష పడిన వినయ్ శర్మ పేర్కొన్నాడు. ఆ పిటిషన్‌పై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తన మెర్సీ పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని తన న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా అభ్యర్థించాడు. అంతేకాదు హోం మంత్రిత్వ శాఖ పంపించిన క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం తనది కాదని స్పష్టం చేశాడు. తను ఇంకా ఎలాంటి క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయకముందే ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. కాగా వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా, దీన్ని రాష్ట్రపతికి పంపిన హోంశాఖకు పంపించిన సంగతి తెలిసిందే. ఈకేసులో వినయ్ శర్మ సహా మొత్తం దోషులుగా తేలినవారు ఆరుగురు. వీరిలో రామ్‌సింగ్ 2013 మార్చిలో జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా మరొక నిందితుడు మైనర్ కావడంతో అతడికి బాలనేరస్తుల కోర్టు మూడేళ్ళ శిక్ష విధించి అనంతరం విడుదల చేసింది. ఇక మిగిలిన నలుగురు నిందితులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వినయ్ శర్మ చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నిర్భయ నిందితుడు ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు వినయ్‌శర్మ బుధవారంరాత్రి తిహార్ జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. వినయ్ కొన్ని మాత్రలు మింగడంతోపాటు కిటికీకి తువ్వాలుతో ఉరేసుకోవడానికి యత్నిస్తుండగా తమిళనాడుకు చెందిన జైలు సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని జైలు సూపరింటెండెంట్ బిజేంద్రకుమార్ తెలిపారు. గట్టి భద్రత మధ్య జైలులోని 8వ నంబర్ సెల్లో శర్మ ఉన్నాడని, ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడో తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే, ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ఆయనపై హత్యాయత్నం జరిగిందని శర్మ న్యాయవాది ఏపీ సింగ్ ఆరోపించారు. తోటి ఖైదీలు, పోలీసులు తనను కొడుతున్నందున భద్రత కల్పించాలని 2013లో శర్మ డిమాండ్ చేశారు. కొద్దిరోజుల క్రితం జైలును సందర్శించినప్పుడు జైలులోపల తనను వేధింపులకు గురి చేస్తున్నారని వినయ్‌శర్మ తనతో చెప్పారని న్యాయవాది పేర్కొన్నారు. -
ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై లైంగికదాడి(2012 డిసెంబర్ 16) చేసి అత్యంతపాశవికంగా ప్రవర్తించి ఆమె చావుకు కారణమైన ప్రధాన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి తిహార్ జైలులో ఉండగా వారిలో వినయ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత పెయిన్ కిల్లర్స్ తీసుకొని అనంతరం టవల్ తో ఉరిపెట్టుకున్నాడు. అది గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని తప్పించి ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. 2013 ప్రారంభంలో తనపై తిహార్ జైలులోని తోటి ఖైదీలు దాడి చేశారని తనకు అదనపు భద్రత కల్పించాలని వినయ్ శర్మ అప్పట్లో డిమాండ్ చేశాడు. కాగా, ఈ కేసులో ఉన్న నిందితులు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందే అదే ఏడాది(2013) మార్చి నెలలో బస్సు డ్రైవర్ రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని చనిపోగా అతడి తల్లిదండ్రులు మాత్రం పోలీసుల హత్య అని ఆరోపించారు. -
నిర్భయ కేసులో ఇద్దరి ఉరి నిలిపివేత
సుప్రీంకోర్టు ఉత్తర్వులు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లకు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ముఖేష్, పవన్‌గుప్తాలకు విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ మార్చి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులే వీరికీ వర్తిస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఉరిశిక్షలపై అప్పీళ్లను త్రిసభ్య ధర్మాసనం విచారించాలన్న సవరణకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో తమ కేసును కూడా త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్ల వినతిని కోర్టు నిరాకరించింది. సవరణ నిబంధనలను ఇంకా నోటిఫై చేయలేదని పేర్కొంది. ఈ కేసులో నలుగురు నిందితులకు విచారణ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం తెలిసిందే. దీన్ని నిలిపివేస్తూ సుప్రీం స్టే ఇచ్చింది. ఈ కేసురికార్డులను తమకివ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా, అత్యాచారం లాంటి హేయమైన ఘటనలకు పాల్పడే నిందితులు బాల నేరస్తులైనా వారిని పెద్దలుగానే పరిగణించాలన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ వ్యాఖ్యలను నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు. గ్యాంగ్ రేప్ కేసుల్లో బాల నేరస్తులను సాకుగా చూపి వారి తరఫు న్యాయవాదులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్భయ తండ్రి పేర్కొన్నారు. -
ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిల్లో కదులుతున్నప్పటికీ లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే అనేక మిడ్ క్యాప్ షేర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. ఎన్నికల అనంతరం కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే ఇన్ఫ్రా రంగం బాగా పుంజుకునే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వినయ్ శర్మ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన డివిడెండ్ ఈల్డ్ పథకం వివరాలను తెలియచేయడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకి గడ్డుకాలం తొలగినట్లే అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం సంస్కరణలను కొనసాగిస్తూ, జీఎస్టీ, ఆదాయపు పన్నుల్లో మార్పులు తీసుకొస్తే ఈ ఏడాది కూడా మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.... దిగిరాకపోతే కష్టమే.. వడ్డీరేట్లు దిగిరాకపోతే అది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లు దిగివచ్చే అవకాశాలు కనిపించడం లేదని దీనికితోడు ఎలినెనో మార్కెట్లను మరింత భయపెడుతోందన్నారు. ఎలినెనో వల్ల వర్షాభావం ఏర్పడితే దేశీయ వినియోగంపై దెబ్బతింటుందని శర్మ తెలిపారు. కాని ఇప్పుడే ఎలినెనో ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పలేమని, ద్రవ్యోల్బణం తగ్గి 5-6 నెలలు స్థిరంగా ఉంటే కాని వడ్డీరేట్లు తగ్గే అవకాశం లేదన్నారు. అమ్ముతూనే ఉన్నారు.. మార్కెట్లు గరిష్ట స్ధాయిలో ఉన్నప్పటికీ దేశీయంగా చిన్న ఇన్వెస్టర్లు ఇప్పటికీ మార్కెట్లకు దూరంగానే ఉంటున్నట్లు శర్మ పేర్కొన్నారు. సూచీలు బాగా పెరిగిన తర్వాత గతంకంటే పరిస్థితి కొద్దిగా మెరుగైనప్పటికీ దేశీయ ఫండ్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పట్లో కొత్త పథకాలు లేవు ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పోర్ట్‌ఫోలియోలో అనేక రకాల పథకాలు ఉండటంతో కొత్త తరహా ఈక్విటీ ఫండ్స్ ప్రవేశపెట్టే ఆలోచన లేదని శర్మ స్పష్టం చేశారు. ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన డివిడెండ్ ఈల్డ్ విభాగంలో ఇక్కడ తక్కువ పథకాలు అందుబాటులో ఉండటంతో దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ కింద కేవలం రూ.6,000 కోట్ల ఆస్తులు మాత్రమే నిర్వహణలో ఉన్నాయని, ఈ విభాగం మరింత వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయన్నారు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్ అత్యధికంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలను ఎంపిక చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. నిఫ్టీ డివిడెండ్ ఆపర్చునిటీస్ ఇండెక్స్ ప్రామాణికంగా పనిచేసే ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 80 శాతం నిఫ్టీ ఇండెక్స్ షేర్లకే కేటాయించనున్నట్లు శర్మ తెలిపారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 9న ముగుస్తుంది, ఈ సమయంలో రూ.700 - 800 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు. -
దిగువ కోర్టు తీర్పును సవాలు చేసిన ఇద్దరు దోషులు
న్యూఢిల్లీ: సామూహిక అత్యాచార కేసులో దిగువకోర్టు ఇచ్చిన తీర్పును దోషులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లు హైకోర్టులో సవాలుచేశారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాది ఎ.పి.సింగ్ సోమవారం ఓ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ దిగువ న్యాయస్థానం గత నెలలో తీర్పు వెలువరించిన సంగతి విదితమే. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కదులుతున్న బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని నలుగురు దోషులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను దిగువకోర్టు న్యాయమూర్తి ఆలకించలేదని పిటిషనర్లు పేర్కొన్నార ని న్యాయవాది తెలిపారు. వినయ్ శర్మ వయస్సు 17 సంవత్సరాలేనని, అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ బాలనేరస్తుల చట్టం కింద విచారించాలని విన్నవించారన్నారు. వినయ్ పుట్టిన తేదీ పత్రాలను అతడి స్వగ్రామం తెప్పించి, సమర్పించాలంటూ దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. అంతేకాకుండా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని కోరినట్టు తెలిపారు. తన వయస్సు 17 సంవత్సరాల ఎనిమిది నెలలేనని, అందువల్ల మైనరేనని వినయ్ ఈ పిటిషన్లో పేర్కొన్నట్టు సింగ్ తెలిపారు. వయోనిర్ధారణ కోసం తనకు ఎముకల పరీక్ష చేయించాలని వినయ్ కోరాడని, అయితే సదరు విన్నపాన్ని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చిందన్నారు. కారాగారంలోనే ఉన్నప్పటికీ వినయ్ బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడన్నారు. వినయ్ జైలుకు రాకముందు జిమ్ ట్రెయిన్ అని, తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవాడని సింగ్ తెలిపారు.