న్యూఢిల్లీ: డిసెంబర్ 16 న మహిళపై లైంగికదాడికి జరిగి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహిళలకు చేయూతనిచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నడుంబిగించారు. సోమవారం పేద మహిళలకు డ్రైవింగ్, ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధనే ధ్యేయంగా పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. శిక్షణ పొందిన మహిళకు ఉద్యోగాలు ఇప్పించేందుకు అనుమతి కలిగి ఉన్న రేడియో ట్యాక్సీ సంస్థలైన మెరూ, ఈజీక్యాబ్స్‌తో ఈ మేరకు అవగాహన కుదుర్చుకొన్నామని చెప్పారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొందడానికి 100 మహిళలు స్వచ ్ఛందంగా ఉత్తర జిల్లా పోలీసుల వద్ద నమోదు చేయించుకొన్నారు. ఉదయం, లేదా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో డ్రైవింగ్‌లో వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఆయా మహిళలు ఏదో ఓ బ్యాచ్‌లో శిక్షణ పొందవచ్చని పోలీసులు తె లిపారు. ఇలాంటి మహిళల కోసం కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు స్వచ్ఛందంగా వాహనాలను కేటాయించాయి. డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న మహిళా పోలీసులు కూడా వారికి శిక్షణ ఇస్తారని డిప్యూటీ పోలీస్ కమిషనర్(ఉత్తర) మాధుర్‌వర్మ తెలిపారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న దారిద్య్రరేకకు దిగువ ఉన్న కుటుంబాల మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను స్వచ్ఛందంగా చేరదీసి ‘పరివర్తన పథకం’కింద డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళ పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా మహిళలు నిర్భయంగా వచ్చి ఫిర్యాదులు చేసే వాతావరణాన్ని కల్పించాలన్నారు.
మహిళ లకు పోలీసుల చేయూత
Published Mon, Dec 15 2014 11:50 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement