ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికలు | APSRTC announces CCS election on december 16 | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికలు

Published Wed, Nov 16 2016 6:21 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికలు - Sakshi

ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికలు

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం లిమిటెడ్(క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ) ఎన్నికలు వచ్చే నెల 16న జరగనున్నాయి. ఈ మేరకు సీసీఎస్ కార్యదర్శి ఎన్‌వీ రాఘవరెడ్డి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సభ్యులు డిసెంబరు2 నుంచి 8వ తేదీ వరకు ఆయా డిపోల్లో నామినేషన్ దాఖలు చేయాల్సివుంటుంది.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబరు 13 అని రాఘవరెడ్డి చెప్పారు. 13 జిల్లాల్లో పనిచేస్తున్న 55,462 మంది ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎస్ ఎన్నికల్లో పాల్గొని 242 మంది డెలిగేట్స్‌ను ఎంపిక చేసుకుంటారు. సీసీఎస్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదరరావులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement